iDreamPost

Rohit Sharma: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన రోహిత్.. అయినా బాధపడుతున్న ఫ్యాన్స్! కారణం?

ఇంగ్లాండ్ తో తాజాగా జరిగిన మూడో టెస్ట్ లో సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. దీంతో 73 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. దీంతో ఓ వైపు సంతోషం, మరోవైపు బాధపడుతున్నారట ఫ్యాన్స్. మరి దానికి కారణం ఏంటో చూద్దాం.

ఇంగ్లాండ్ తో తాజాగా జరిగిన మూడో టెస్ట్ లో సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. దీంతో 73 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. దీంతో ఓ వైపు సంతోషం, మరోవైపు బాధపడుతున్నారట ఫ్యాన్స్. మరి దానికి కారణం ఏంటో చూద్దాం.

Rohit Sharma: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన రోహిత్.. అయినా బాధపడుతున్న ఫ్యాన్స్! కారణం?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును జడేజాతో కలిసి పటిష్ట స్థితిలో నిలిపాడు. వీరిద్దరు నాలుగో వికెట్ కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఈ సెంచరీతో రోహిత్ భాయ్ ఏకంగా 73 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఈ రికార్డు సంగతి పక్కనపెడితే.. వారు మాత్రం తెగ ఫీలైపోతున్నారట. మరి ఆ రికార్డు ఏంటి? ఫ్యాన్స్ బాధపడటానికి కారణం ఏంటి? ఆ వివరాలు చూద్దాం.

రోహిత్ శర్మ.. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు. గత కొంతకాలంగా పూర్తిగా విఫలం అవుతూ వచ్చిన హిట్ మ్యాన్.. ఈ మ్యాచ్ తో ఫుల్ స్వింగ్ లోకి వచ్చాడు. 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్ లో ఔటైయ్యాడు. ఈ శతకంతో తన టెస్ట్ కెరీర్ లో 11 సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. 73 ఏళ్ల క్రితం టీమిండియా దిగ్గజం విజయ్ హజారే నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకీ ఆ ఘనత ఏంటంటే?

1951లో ఇంగ్లాండ్ టీమ్ పై సెంచరీ సాధించాడు భారత మాజీ ఆటగాడు విజయ్ హజారే. అప్పుడు అతడి వయసు 36 సంవత్సరాలా 278 రోజులు. తాజాగా ఈ ఓల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు రోహిత్. ఈ సెంచరీ నాటిని హిట్ మ్యాన్ వయసు 36 ఏళ్ల 291 రోజులు. దీంతో అత్యధిక వయసులో శతకం చేసిన బ్యాటర్ గా ఇండియా కెప్టెన్ నిలిచాడు. అయితే రోహిత్ సెంచరీ చేయడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నప్పటికీ.. మరోవైపు బాధకూడా ఉందట. ఎందుకంటే? హిట్ మ్యాన్ ఏజ్ పెరిగిపోతుండటంతో క్రికెట్ కు దూరమైపోతాడని ఫీల్ అవుతున్నారట. ఈ రీజన్ చూసి నెటిజన్లు పలు విధాలుగా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతంలో జీవిస్తూ.. సంతోషంగా ఉండటం వదిలేసి, భవిష్యత్ గురించి బెంగపడుతున్నారు ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ రాసుకొస్తున్నారు. మరి రోహిత్ 73 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: సర్ఫరాజ్ రనౌట్ పై జడేజా ఎమోషనల్ పోస్ట్! తప్పు ఒప్పుకుంటూ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి