Nidhan
భారత్‌కు మరో టెస్ట్ సిరీస్ విజయాన్ని కట్టబెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మను ఓ మాజీ క్రికెటర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. లెజెండ్ ఎంఎస్ ధోనీకి అసలైన వారసుడు హిట్‌మ్యానే అన్నాడు.
భారత్‌కు మరో టెస్ట్ సిరీస్ విజయాన్ని కట్టబెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మను ఓ మాజీ క్రికెటర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. లెజెండ్ ఎంఎస్ ధోనీకి అసలైన వారసుడు హిట్‌మ్యానే అన్నాడు.
Nidhan
బజ్‌బాల్ క్రికెట్ అంటూ బడాయికి పోయిన ఇంగ్లండ్ గర్వాన్ని మరోసారి అణచింది రోహిత్ సేన. ఆ టీమ్‌పై వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది. రాంచీ టెస్టులో ఇంగ్లీష్ టీమ్ విసిరిన ప్రతి సవాల్‌కు దీటుగా బదులిచ్చిన భారత్.. ఓటమి తప్పదనే పరిస్థితుల్లో నుంచి బయటపడి బంపర్ విక్టరీ కొట్టింది. దీనికి జట్టులోని అందరూ యంగ్ ఆటగాళ్లను మెచ్చుకోవాల్సిందే. అయితే వాళ్ల కంటే కాస్త ఎక్కువ క్రెడిట్ మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మకు ఇవ్వాలి. జురెల్, సర్ఫరాజ్, ఆకాశ్ దీప్, రజత్ పాటిదార్ లాంటి డెబ్యుటెంట్స్తో పాటు జైస్వాల్, గిల్ లాంటి యంగ్‌స్టర్స్ నుంచి టీమ్‌కు ఏం కావాలో అది తీసుకున్నాడు. బ్యాట్‌తో పాటు కెప్టెన్‌గా విక్టరీలో కీలకపాత్ర పోషించాడు. అలాంటి హిట్‌మ్యాన్‌ను భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా ప్రశంసల్లో ముంచెత్తాడు. రోహితే నెక్స్ట్ ధోని అని మెచ్చుకున్నాడు.
‘రోహితే నెక్స్ట్ ధోని. అతడ్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎంఎస్ ధోని తరహాలో యంగ్‌స్టర్స్‌కు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు రోహిత్. ధోని కెప్టెన్సీలో నేను చాలా మ్యాచులు ఆడా. గంగూలీ సారథ్యంలోనూ ఆడా. దాదా తన టీమ్‌ను చాలా సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత మాహీ కెప్టెన్సీ పగ్గాలు అందుకొని తనదైన శైలిలో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. ప్రస్తుత భారత జట్టు సాధిస్తున్న విజయాలకు ఎక్కువ క్రెడిట్ రోహిత్‌కు ఇవ్వాల్సిందే. అతడు మొదట సర్ఫరాజ్‌కు డెబ్యూ ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత జురెల్‌ను జట్టులోకి తీసుకొచ్చాడు. హిట్‌మ్యాన్ సరైన మార్గంలోనే వెళ్తున్నాడు. అతడు బ్రిలియంట్ కెప్టెన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు’ అని రైనా పొగడ్తల్లో ముంచెత్తాడు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ గురించి కూడా టీమిండియా మాజీ బ్యాటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
విరాట్ కోహ్లీ అంటే తన కొడుక్కి చాలా ఇష్టమని రైనా తెలిపాడు. అతడు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంటే చూడాలని ఉందన్నాడు. ‘నా కొడుక్కి కోహ్లీ అంటే చాలా ఇష్టం. విరాట్‌కు ఐపీఎల్ ట్రోఫీ రావాలి. భారత క్రికెట్ జట్టుతో పాటు ఆర్సీబీకి అతడు ఎంతో చేశాడు. బెంగళూరు టీమ్ తరఫున కోహ్లీ చాలా సక్సెస్ అయ్యాడు. అతడు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంటే చూడాలని ఉంది’ అని రైనా చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ కోసం కోహ్లీ ఎంతో చేశాడని.. దాన్ని ఎవరూ మర్చిపోకూడదని పేర్కొన్నాడు. విరాట్ కోసమే కాదు.. అతడికి అండగా ఉంటూ, టీమ్‌ను సపోర్ట్ చేస్తూ వస్తున్న బెంగళూరు అభిమానుల కోసమైనా ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ నెగ్గాలని రైనా వివరించాడు. మరి.. రోహితే నెక్స్ట్ ధోని అంటూ రైనా చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అలాంటి వారికే టీమ్ లో చోటు.. పాండ్యా, ఇషాన్ కు రోహిత్ ఇండైరెక్ట్ వార్నింగ్!
Suresh Raina said “Rohit Sharma is the next MS Dhoni, he has done well, giving a lot of chances to youngsters the way Dhoni did. I played a lot of cricket under Dhoni – Rohit is going in the right direction, he is a brilliant captain”. [TOI] pic.twitter.com/xJapq15NLK
— Johns. (@CricCrazyJohns) February 27, 2024