Nidhan
రాంచీ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. హిట్‌మ్యాన్‌కు ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.
రాంచీ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. హిట్‌మ్యాన్‌కు ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు భారత ఇన్నింగ్స్ టైమ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. హిట్‌మ్యాన్‌ను ఇంగ్లండ్ అభిమానులు అవమానించారు. బహుశా రోహిత్ కెరీర్లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావొచ్చు. రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రత్యర్థి జట్టు 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగింది భారత్. కఠిన పిచ్ మీద నిలదొక్కుకొని రన్స్ చేయడం చాలా కష్టంగా మారడంతో రోహిత్ రాణించడం టీమ్‌కు ఇంపార్టెంట్‌గా మారింది. కానీ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ దెబ్బకు హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. జిమ్మీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైన భారత సారథి క్రీజును వీడాడు. అయితే ఆ టైమ్‌లో అతడికి అవమానం జరిగింది. ఇంగ్లీష్ ఫ్యాన్స్ రోహిత్‌ను టార్గెట్ చేసుకున్నారు.
అండర్సన్ బౌలింగ్‌లో ఔటైన రోహిత్ శర్మ నిరాశతో క్రీజును వీడాడు. పెవిలియన్ వైపుగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ టైమ్‌లో భారత అభిమానులు అంతా సైలెంట్ అయిపోయారు. మంచి ఇన్నింగ్స్‌తో అలరిస్తాడనుకుంటే ఇలా ఔట్ అయ్యాడేంటని షాకయ్యారు. టీమ్‌ను గట్టెక్కిస్తాడనుకుంటే స్టార్టింగ్‌లోనే వికెట్ సమర్పించుకోవడంతో నిరాశ చెందారు. కానీ ఇంగ్లీష్ టీమ్ ఫ్యాన్స్ మాత్రం రోహిత్ ఔట్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అతడు క్రీజులో ఉంటే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో తెలిసిందే. అందుకే రోహిత్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఇంగ్లండ్ అభిమానులు అతడికి బైబై చెప్పారు. స్టేడియంలో ఓ చోట గుంపుగా కూర్చున్న ఇంగ్లీష్ సపోర్టర్స్ బై రోహిత్ అంటూ చేతులు ఊపుతూ అవమానించారు.
రోహిత్‌కు బైబై చెప్పడమే గాక ఈలలు వేస్తూ, గోల చేశారు ఇంగ్లండ్ ఫ్యాన్స్. హిట్‌మ్యాన్‌ను ఇంగ్లీష్ టీమ్ అభిమానులు అవమానించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. రోహిత్ మీద పగబట్టి మరీ అవమానించారు కదా అని ఫైర్ అవుతున్నారు. దీనికి అంతకంతా అనుభవిస్తారని.. సెకండ్ ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌తో స్ట్రాంగ్ రిప్లయ్ ఇస్తాడని అంటున్నారు. రోహిత్‌ను అవమానించారు కదా.. ఇక, సిరీస్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు బ్యాటింగ్‌కు వస్తే ఇచ్చి పడేస్తామని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్‌తో, కెప్టెన్సీతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడు రోహిత్. ప్రత్యర్థి జట్టు, వాళ్ల అభిమానులు కూడా హిట్‌మ్యాన్‌ను ఇష్టపడతారు. అలాంటిది ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఇలా అవమానించడంపై విమర్శలు వస్తున్నాయి. మరి.. రోహిత్‌కు జరిగిన అవమానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తండ్రి రిక్షావాలా.. కూతురు ధోనిని మించిన మ్యాచ్ ఫినిషర్! ఎవరీ సజనా
After #RohitSharma was dismissed by #JamesAnderson and as he was walking back to the dressing room, #England supporters inside the stadium waved their hands and sang ‘Bye Bye Rohit’ in unison.#INDvsENG #Hitman #Rajkot #India #Cricket pic.twitter.com/wnHA7KKSlV
— mahe (@mahe950) February 24, 2024