Nidhan
బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీకి భారత టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కౌంటర్ ఇచ్చాడు. తానెప్పుడూ అలా కోరలేదన్నాడు. అసలు వీళ్ల మధ్య నడుస్తున్న వివాదం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీకి భారత టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కౌంటర్ ఇచ్చాడు. తానెప్పుడూ అలా కోరలేదన్నాడు. అసలు వీళ్ల మధ్య నడుస్తున్న వివాదం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీసి విజయం సాధించిన టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ఉప్పల్ టెస్టుకు ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సిరీస్‌ను 1-1తో సమం చేసినందుకు సంతోషంలో ఉంది. రాజ్‌కోట్‌లో జరగబోయే తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ, భారత టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మధ్య చిన్న వార్ జరగడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న పిచ్‌ల విషయంలో ఈ ఇద్దరు లెజెండ్స్ భిన్నంగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో మొదట దాదా తనదైన శైలిలో స్పందించగా.. తాజాగా ద్రవిడ్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. అసలు ఈ కాంట్రవర్సీ ఎక్కడ మొదలైంది.. దాదా-ద్రవిడ్ ఏమేం కామెంట్స్ చేశారనేది ఇప్పుడు చూద్దాం..
భారత్‌లోని పిచ్‌లు సాధారణంగా స్పిన్‌కు సహకరిస్తాయి. అయితే వన్డేలు, టీ20లను మినహాయిస్తే.. టెస్టులకు మాత్రం ఇక్కడ పూర్తిగా టర్నింగ్ ట్రాక్స్‌నే తయారు చేస్తారు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే బ్యాటర్లు, బాల్‌ను అద్భుతంగా టర్న్ చేసే స్పిన్నర్లు మన టీమ్‌లో ఉన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో స్వదేశంలో టీమిండియా ఆడే టెస్టు మ్యాచుల్లో ఎక్కువగా స్పిన్ ట్రాక్‌లే దర్శనమిస్తున్నాయి. దీని వల్ల ఐద్రోజులు జరగాల్సిన మ్యాచులు కాస్తా కొన్నిసార్లు ఒకటిన్నర, రెండ్రోజుల్లోనే ముగిసిపోతుండటంతో పిచ్ తయారీ మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎలాంటి పిచ్ మీదనైనా వికెట్లు తీసే సత్తా ఉన్న బుమ్రా, సిరాజ్, షమి, అశ్విన్, జడేజా, కుల్దీప్ లాంటి బౌలర్లు టీమ్‌లో ఉన్నప్పుడు కేవలం స్పిన్ ట్రాక్‌లే ఎందుకు తయారు చేయిస్తున్నారని దాదా విమర్శించాడు.
స్పిన్‌తో పాటు పేస్‌కు అనుకూలించే పిచ్‌లు రూపొందించాలని.. దేనికీ భయపడాల్సిన అవసరం లేదన్నాడు గంగూలీ. స్పిన్ ట్రాక్‌లు మనకు అవసరమా అని సూటిగా ప్రశ్నించాడు. పిచ్‌లపై గంగూలీ చేసిన వ్యాఖ్యల మీద తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రియాక్ట్ అయ్యాడు. వైజాగ్ టెస్టులో భారత్ గెలుపు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. తానెప్పుడూ టర్నింగ్ ట్రాక్స్ తయారు చేయాలని కోరలేదని స్పష్టం చేశాడు. పిచ్‌ను రూపొందించడం క్యూరేటర్ల పని అని.. అందులో తాము జోక్యం చేసుకోలేమని క్లారిటీ ఇచ్చాడు. పూర్తిగా స్పిన్ పిచ్‌లు మాత్రమే కావాలని తాము అడగమన్నాడు ద్రవిడ్.
భారత్‌లో సహజంగా వికెట్లు స్పిన్‌కు అనుకూలిస్తాయని.. పిచ్ మీద ఎంత టర్న్ లభిస్తుందనేది ఎవరికీ తెలియదన్నాడు ద్రవిడ్. పిచ్ విషయంలో తానేమీ ఎక్స్పర్ట్ కాదన్నాడు భారత్ కోచ్. అయితే ద్రవిడ్ వ్యాఖ్యలపై నెటిజన్స్ సోషల్ మీడియాలో డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. దాదా లాంటి వారికి కౌంటర్‌గానే ద్రవిడ్ ఈ కామెంట్స్ చేశాడని అంటున్నారు. అయితే కొందరు మాత్రం అదేమీ లేదని వాళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న టైమ్‌లోనే ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించాడని గుర్తుచేస్తున్నారు. మరి.. గంగూలీ-ద్రవిడ్ కాంట్రవర్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rahul Dravid said “Curators make the pitches – we don’t ask for rank turners, obviously tracks in India would spin, how much they will spin, how less they will spin – I am not an expert, wickets in India in the course of 4 or 5 days, they do turn”. pic.twitter.com/odGIGQ1d0W
— Johns. (@CricCrazyJohns) February 5, 2024