భారత్ చేతుల్లో ఇంగ్లండ్ ఓడేలా కుట్ర పన్నారు.. మాజీ క్రికెటర్ ఆరోపణలు!

India vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య మరికొన్ని నిమిషాల్లో నాకౌట్ ఫైట్ మొదలవనుంది. ఈ మ్యాచ్​లో నెగ్గిన టీమ్ ఫైనల్ చేరుతుంది. అందుకే దీనిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

India vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య మరికొన్ని నిమిషాల్లో నాకౌట్ ఫైట్ మొదలవనుంది. ఈ మ్యాచ్​లో నెగ్గిన టీమ్ ఫైనల్ చేరుతుంది. అందుకే దీనిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

భారత్-ఇంగ్లండ్ మధ్య మరికొన్ని నిమిషాల్లో నాకౌట్ ఫైట్ మొదలవనుంది. ఈ మ్యాచ్​లో నెగ్గిన టీమ్ ఫైనల్ చేరుతుంది. అందుకే దీనిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన బట్లర్ సేన ఫైనల్ చేరి మరోమారు కప్పు ఎగరేసుకుపోవాలని చూస్తోంది. అటు భారత్ ఇంగ్లండ్​ను ఆపి.. టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ రెండు టీమ్స్ మధ్య విరోధం కూడా ఉంది. గత టీ20 ప్రపంచ కప్ సెమీస్​లో టీమిండియాను ఇంగ్లీష్ టీమ్ ఓడించింది. అప్పటివరకు ఎదురులేకుండా దూసుకొచ్చిన మెన్ ఇన్ బ్లూ.. నాకౌట్ ఫైట్​లో ఓడి ఇంటిదారి పట్టింది. ఆ పగను ఇప్పుడు తీర్చుకోవాలని చూస్తోంది రోహిత్ సేన.

గయానా ఆతిథ్యం ఇస్తున్న నాకౌట్ ఫైట్​కు సర్వం సిద్ధమైంది. అయితే అక్కడ వర్షం మొదలవడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. వరుణుడు శాంతించకపోతే మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్​కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే రోహిత్ సేన ఫైనల్​కు చేరుకుంటుంది. సూపర్-8లో గ్రూప్ టాపర్​గా నిలిచింది కాబట్టి మన జట్టుకు అదృష్టం కలసి వస్తుంది. ఇప్పుడు ఇదే విషయంపై భగ్గుమంటున్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ డేవిడ్ లాయిడ్. సెమీస్​లో టీమిండియా చేతుల్లో ఇంగ్లండ్ ఓడిపోయేలా కుట్ర పన్నారంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మీద ఆయన విమర్శలు గుప్పించాడు. నాకౌట్ ఫైట్​లో భారత్​ గెలవాలనే కుట్రతో రిజర్వ్ డేను ఐసీసీ ఏర్పాటు చేయలేదని ఆరోపణలు గుప్పించాడు లాయిడ్.

కొందరి మేలు కోసం మెగాటోర్నీని మ్యానిప్యులేట్ చేస్తున్నారని విమర్శించాడు డేవిడ్ లాయిడ్. రెండో సెమీఫైనల్​ మ్యాచ్​కు ఎందుకు రిజర్వ్ డే లేదనే విషయంపై ఐసీసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మ్యాచ్ రద్దయితే భారత్ విజేతగా నిలుస్తుందని.. తద్వరా ఇంగ్లండ్​కు అన్యాయం చేసినట్లే అవుతుందన్నాడు లాయిడ్. ఈ మ్యాచ్ అనే కాదు.. భారత్ ఆడే ఇతర మ్యాచులపై కూడా ఆయన విమర్శలు చేశాడు. వరల్డ్ కప్​ మ్యాచుల్ని ఇండియన్ ఆడియెన్స్ చూడాలనే ఉద్దేశంతో వాళ్లకు అనుకూలమైన టైమింగ్స్​లో నిర్వహిస్తున్నారని ఆరోపించాడీ ఇంగ్లండ్ దిగ్గజం. యాడ్స్ రెవెన్యూ, ధనార్జన కోసమే ఇలా చేస్తున్నారని సీరియస్ అయ్యాడు. భారత్ కోసమే కాదు.. అన్ని దేశాల క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆలోచించి ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. బీసీసీఐ ఏం చెబితే అది ఐసీసీ పాటిస్తోందని, తోలుబొమ్మలా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మరి.. భారత్​ను గెలిపించేందుకు కుట్ర పన్నారంటూ లాయిడ్ చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments