iDreamPost
android-app
ios-app

IND vs ENG: భారత్​-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Jan 24, 2024 | 11:33 AM Updated Updated Jan 24, 2024 | 11:33 AM

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య గురువారం నాడు తొలి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్​లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య గురువారం నాడు తొలి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్​లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 24, 2024 | 11:33 AMUpdated Jan 24, 2024 | 11:33 AM
IND vs ENG: భారత్​-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ గురువారం మొదలుకానుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్​లోని తొలి మ్యాచ్​కు ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టెస్ట్​కు ఇంకొక్క రోజు మాత్రమే ఉండటంతో రెండు జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. రెండు టీమ్స్ మేనేజ్​మెంట్ గెలుపు కోసం వ్యూహాలు పన్నడంలో మునిగిపోయాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్స్​లో చేరుకోవాలంటే ఈ సిరీస్ నెగ్గడం కీలకంగా మారడంతో భారత్, ఇంగ్లండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గాలనే పట్టుదలతో ఉన్నాయి. సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లీష్ టీమ్ మన జట్టును రెచ్చగొడుతూ వస్తోంది. బజ్​బాల్ ఫార్ములానే ప్రయోగిస్తాం.. కాచుకోండి, మీకు ఓటమి తప్పదంటూ ఇంగ్లండ్ మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే భారత మాజీలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మీ ఫార్ములాతోనే మిమ్మల్ని చిత్తు చేస్తామని అంటున్నారు. ఈ తరుణంలో తొలి టెస్ట్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

మొదటి టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్​ గ్రౌండ్​లో భారత్​కు సూపర్బ్ రికార్డు ఉంది. ఇక్కడ మన జట్టుకు తిరుగులేదు. ఈ వేదికలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా.. నాలుగింట్లో నెగ్గింది. 2010లో న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు డ్రాగా ముగియగా.. ఆ తర్వాత వరుసగా కివీస్, ఆసీస్, బంగ్లాదేశ్, వెస్టిండీస్​పై భారత్ విక్టరీలు నమోదు చేసింది. ఆ ఐదు మ్యాచుల్లోనూ ఈ పిచ్​ మీద స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇప్పుడు కూడా టర్నింగ్ ట్రాక్​ను రెడీ చేశారని తెలుస్తోంది. అందుకే భారత జట్టు మళ్లీ స్పిన్ అస్త్రాన్నే ప్రయోగించాలని అనుకుంటోంది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతాడు. పర్సనల్ రీజన్స్​తో మొదటి రెండు టెస్టులకు స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. కాబట్టి అతడి ప్లేస్​లో యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ ఆడటం ఖాయం. సెకండ్ డౌన్​లో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. మిడిలార్డర్​ భారాన్ని కేఎల్ రాహుల్ మోస్తాడు. అతడికి సపోర్ట్​గా కేఎస్ భరత్, రవీంద్ర జడేజా ఉంటారు.

india test team playing 11

రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటర్​గా ఆడతాడని మ్యాచ్​కు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చేశాడు. కాబట్టి వికెట్ కీపర్​గా కేస్ భరత్ ఆడటం ఖాయం. కొత్త కుర్రాడు ధృవ్ జురెల్ రూపంలో పోటీ ఉన్నప్పటికీ మంచి ఫామ్​లో ఉండటం భరత్​కు కలిసొచ్చే అంశం. స్పిన్ బాధ్యతలను రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ పంచుకుంటారు. జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్​లు పేస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఉప్పల్ పిచ్ ఎప్పుడూ స్పిన్​కు అనుకూలిస్తూ వస్తోంది. అయితే ఈ మ్యాచ్​లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉండే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. స్పిన్నర్ల కంటే పేసర్లకు పిచ్ నుంచి ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో కుల్దీప్​ను ఆడిస్తారా లేదా అతడి ప్లేస్​లో థర్డ్ పేసర్​ను తీసుకుంటారా? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. కానీ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ స్ట్రాటజీలను గమనిస్తే కుల్దీప్ వైపే మొగ్గుచూపే ఛాన్స్ కనిపిస్తోంది. స్పిన్ అస్త్రంతో ఇంగ్లండ్​ను కట్టిపడేయడమే భారత్ టార్గెట్​గా కనిపిస్తోంది. మరి.. ఈ మ్యాచ్​లో భారత ప్లేయింగ్ ఎలెవన్​లో ఇంకెవర్ని అయినా చేరిస్తే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

భారత జట్టు (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.