iDreamPost
android-app
ios-app

South Africa: చోకర్స్​గా ముద్రపడిన టీమ్ అంత ఈజీగా ఆఫ్ఘాన్​ను ఎలా చిత్తు చేసింది? సీక్రెట్ ఏంటి?

  • Published Jun 27, 2024 | 4:39 PM Updated Updated Jun 27, 2024 | 4:39 PM

సౌతాఫ్రికా జట్టు అద్భుతం చేసింది. నాకౌట్​ ఫైట్​లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్​ను చిత్తుగా ఓడించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్జాగా ఫైనల్ గడప తొక్కింది.

సౌతాఫ్రికా జట్టు అద్భుతం చేసింది. నాకౌట్​ ఫైట్​లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్​ను చిత్తుగా ఓడించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్జాగా ఫైనల్ గడప తొక్కింది.

  • Published Jun 27, 2024 | 4:39 PMUpdated Jun 27, 2024 | 4:39 PM
South Africa: చోకర్స్​గా ముద్రపడిన టీమ్ అంత ఈజీగా ఆఫ్ఘాన్​ను ఎలా చిత్తు చేసింది? సీక్రెట్ ఏంటి?

సౌతాఫ్రికా అద్భుతం చేసింది. నాకౌట్​ ఫైట్​లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్​ను చిత్తుగా ఓడించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్జాగా ఫైనల్ గడప తొక్కింది. ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆఫ్ఘాన్​తో జరిగిన సెమీస్​లో ఆ టీమ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన రషీద్ సేన.. 11.5 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. తబ్రేజ్ షంసీ (3/6) మార్కో యాన్సన్ (3/16), అన్రిచ్ నోకియా (2/7) బౌలింగ్​ ముందు ఆ టీమ్ నిలబడలేకపోయింది. నిప్పులు చెరిగే బంతులతో ఆఫ్ఘాన్ బ్యాటర్లకు ఓ రేంజ్​లో పోయించారు ప్రొటీస్ బౌలర్లు. ఆ తర్వాత ఈజీ టార్గెట్​ను వికెట్ నష్టానికి 8.5 ఓవర్లలోనే ఛేజ్ చేసేశారు. డికాక్ (5) త్వరగా ఔటైనా.. రీజా హెండ్రిక్స్ (29 నాటౌట్), ఎయిడెన్ మార్క్రమ్ (23 నాటౌట్) కలసి టీమ్​ను విజయతీరాలకు చేర్చారు.

గ్రూప్ దశ నుంచి సూపర్-8 వరకు అనూహ్య విజయాలతో రచ్చ చేసింది ఆఫ్ఘానిస్థాన్. సూపర్ పోరులో బంగ్లాదేశ్​తో పాటు ఫేవరెట్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి సెమీస్​కు క్వాలిఫై అయింది. ఆ టీమ్ జోరు చూస్తుంటే ఈజీగా ప్రొటీస్​ను మట్టికరిపిస్తుందని అంతా అనుకున్నారు. క్వాలిటీ స్పిన్ అటాక్, ఎఫెక్టివ్ పేసర్స్, టాలెంటెడ్ బ్యాటర్స్ ఉన్న రషీద్ సేనను ఆపడం సౌతాఫ్రికాకు కష్టమేనని భావించారు. కానీ ఆ జట్టు మ్యాచ్​ను వన్ సైడ్ చేసేసింది. ఆఫ్ఘాన్​ను దారుణంగా ఓడించింది. కనీసం 60 పరుగులు కూడా చేయనివ్వలేదు. స్మాల్ టార్గెట్​ను సగం ఓవర్లు పూర్తవ్వక ముందే ఛేజ్ చేసి ఔరా అనిపించింది. ఎప్పుడూ నాకౌట్ మ్యాచుల్లో చిత్తవుతారు కాబట్టి సౌతాఫ్రికాకు చోకర్స్ అనే ముద్ర పడింది. సెమీస్ వరకు వచ్చినా అక్కడ ఓడి ఇంటికి వెళ్లడం అలవాటుగా మారడంతో ఆ టీమ్​ను అందరూ చోకర్స్ అని పిలుస్తూ ఎగతాళి చేస్తుంటారు.

చోకర్స్ అనే ముద్రపడిన సౌతాఫ్రికా జట్టు ఫుల్ జోరు మీద ఉన్న ఆఫ్ఘానిస్థాన్​ను ఇంత చిత్తుగా ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదు. టఫ్ ఫైట్ జరుగుతుందని అనుకుంటే మార్క్రమ్ సేన మ్యాచ్​ను వన్​ సైడ్ చేయడంతో అసలు ఇంత ఈజీగా ఎలా గెలిచిందని షాకవుతున్నారు. వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఏంటని ఆలోచిస్తున్నారు. సరిగ్గా గమనిస్తే సౌతాఫ్రికా టీమ్ మీద ఆడియెన్స్​తో పాటు సొంత అభిమానుల్లోనూ అంతగా అంచనాలు లేవు. ఆ జట్టు ఫైనల్​కు వెళ్తుందని ఎవరూ అనుకోలేదు. మాజీ క్రికెటర్లు, ఎక్స్​పర్ట్స్ కూడా ఆఫ్ఘాన్ జోరులో ప్రొటీస్ మునిగిపోతుందని అనుకున్నారు. ఇదే ఆ జట్టుకు ప్లస్ అయింది. ఎలాంటి ఎక్స్​పెక్టేషన్స్ లేకుండా ఆడి ఘనవిజయం సాధించింది. అదే భారీ అంచనాల మధ్య దిగిన రషీద్ సేన.. ఒత్తిడిని జయించలేక, బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంలో విఫలమైంది. ఎక్స్​పెక్టేషన్స్ లేకపోవడం వల్ల స్వేచ్ఛగా ఆడిన సౌతాఫ్రికా ప్లేయర్లు.. తమ రియల్ టాలెంట్​ను బయటపెట్టి టీమ్​ను ఫైనల్​కు చేర్చారు. మరి.. సౌతాఫ్రికా ఫైనల్​లో ఎవర్ని ఢీకొంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.