సెల్యూట్ కొట్టి మరీ సెలబ్రేషన్! జురెల్ అలా ఎందుకు చేశాడంటే..?

ఇంగ్లండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. దీనికి బౌలింగ్​లో అశ్విన్, కుల్దీప్ చేసిన మాయ ఓ కారణమైతే.. బ్యాటింగ్​లో జైస్వాల్, జురెల్ లాంటి యంగ్​స్టర్స్ రాణించడం మరో కారణంగా చెప్పొచ్చు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. దీనికి బౌలింగ్​లో అశ్విన్, కుల్దీప్ చేసిన మాయ ఓ కారణమైతే.. బ్యాటింగ్​లో జైస్వాల్, జురెల్ లాంటి యంగ్​స్టర్స్ రాణించడం మరో కారణంగా చెప్పొచ్చు.

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తన మీద టీమ్ మేనేజ్​మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టాడు. ఇంగ్లండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో జట్టుకు అతడు ఆపద్బాంధవుడిగా మారాడు. యశస్వి జైస్వాల్ (73) మినహా మిగతా బ్యాటర్లు అంతా ఫెయిలైన చోట జురెల్ (90) పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. కష్టాల్లో పడ్డ టీమ్​ను అతడు ఆదుకున్నాడు. కుల్దీప్ యాదవ్ (28), ఆకాశ్ దీప్ (9) సాయంతో జట్టు స్కోరును 300 దాటించాడు. అతడు లేకపోయి ఉంటే ఇంగ్లండ్ లీడ్ మరింత పెరిగేది. అప్పుడు రెండో ఇన్నింగ్స్​లో భారత్​కు అటు బౌలింగ్, ఇటు ఛేజింగ్ రెండూ కష్టమయ్యేవి. అయితే హాఫ్ సెంచరీ తర్వాత జురెల్ సెలబ్రేట్ చేసుకున్న తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 50 పరుగుల మార్క్​ను చేరుకున్నాక అతడు సెల్యూట్ కొడుతూ కనిపించాడు. ఈ సెలబ్రేషన్​కు మీనింగ్ ఏంటనేది చాలా మందికి అర్థం కాలేదు.

రాంచీ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్​లో 90 పరుగులు చేసిన జురెల్.. సెంచరీ కొట్టకపోయినా దానికి సమానమైన ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. అతడి వల్లే ఈ మ్యాచ్​లో టీమిండియా పట్టు బిగించింది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆట తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నాడీ యంగ్ కీపర్. సెల్యూట్ కొట్టి ఎందుకు అలా సెలబ్రేట్ చేసుకున్నాడో స్వయంగా అతడే రివీల్ చేశాడు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తన తండ్రి కోసమే అలా సెల్యూట్ కొట్టానన్నాడు. ‘నా తండ్రి కార్గిల్ వార్​లో పాల్గొన్నారు. అందుకే ఫిఫ్టీ సెలబ్రేషన్స్​లో సెల్యూట్ కొట్టా. ఆ సెల్యూట్ ఆయనకే. మూడో రోజు ఆటకు ముందు ఆయనతో మాట్లాడా. ఒక సెల్యూట్ కొట్టి చూపించమని ఆయన ఇన్​డైరెక్ట్​గా చెప్పారు. అందుకే హాఫ్ సెంచరీ పూర్తవగానే సెల్యూట్ కొట్టా. ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. చిన్నప్పటి నుంచి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని కెరీర్​ను మలచుకున్నా’ అని జురెల్ చెప్పుకొచ్చాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఇది డెబ్యూ సిరీస్ కావడంతో తన మీద కొంత ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని జురెల్ తెలిపాడు. అయితే బరిలోకి దిగిన తర్వాత తన నుంచి టీమ్ ఏం కోరుకుంటుంది? జట్టు విజయం కోసం ఏం చేయగలననేదే ఆలోచిస్తానని పేర్కొన్నాడు. ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే అన్ని పరుగులు చేయొచ్చని.. ఇది వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాదు టీమ్​కూ ఎంతో ఉపయోగకరమని జురెల్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్​లో సెంచరీ మిస్సయినందుకు తనకు రిగ్రెట్ లేదన్నాడు. టీమ్ కోసం విలువైన పరుగులు చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక, సూపర్బ్ నాక్​తో భారత్​ను మ్యాచ్​లో నిలిపిన జురెల్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. మనకు మరో ధోని దొరికాడని అంటున్నారు. ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మైకేల్ వాన్ కూడా జురెల్ బ్యాటింగ్​ను మెచ్చుకున్నాడు. అతడి టెక్నిక్ అద్భుతంగా ఉందన్నాడు. మరి.. జురెల్ బ్యాటింగ్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: RCB ప్లేయర్స్​కు మాత్రమే దక్కే క్రేజ్ ఇది.. వైరల్ వీడియో!

Show comments