iDreamPost
android-app
ios-app

జురెల్ ఫోన్​ను చూస్తే షాకవ్వాల్సిందే.. మిడిల్ క్లాస్ మెంటాలిటీ పోదుగా..!

  • Published Feb 20, 2024 | 6:21 PM Updated Updated Feb 20, 2024 | 6:21 PM

భారత నయా వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాజ్​కోట్ టెస్టులో బ్యాట్​తో రాణించడమే గాక వికెట్ కీపింగ్​లోనూ అదరగొట్టాడు.

భారత నయా వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాజ్​కోట్ టెస్టులో బ్యాట్​తో రాణించడమే గాక వికెట్ కీపింగ్​లోనూ అదరగొట్టాడు.

  • Published Feb 20, 2024 | 6:21 PMUpdated Feb 20, 2024 | 6:21 PM
జురెల్ ఫోన్​ను చూస్తే షాకవ్వాల్సిందే.. మిడిల్ క్లాస్ మెంటాలిటీ పోదుగా..!

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. రాజ్​కోట్ టెస్టులో బరిలోకి దిగిన జురెల్‌.. అటు బ్యాటింగ్​తో పాటు ఇటు వికెట్ కీపింగ్​లోనూ సత్తా చాటాడు. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో మాత్రమే అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దాన్ని అతడు బాగా యూజ్ చేసుకున్నాడు. 46 పరుగులు చేసిన జురెల్.. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​తో కలసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆ టైమ్​లో మరో వికెట్ పడితే భారత్ మరింత కష్టాల్లో పడేది. ఇక, కొంతమంది ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటారు. తమ మూలాలు మర్చిపోరు. జురెల్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఇండియాకు ఆడుతున్నా అతడి విషయంలో ఆ ఒక్కటి మాత్రం మారలేదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ధృవ్ జురెల్ వాడుతున్న మొబైల్ ఫోన్ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మూడో టెస్టు ముగియడంతో రాజ్​కోట్ నుంచి నాలుగో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న రాంచీకి బయల్దేరారు భారత ఆటగాళ్లు. ఈ క్రమంలో ఫ్లైట్​లో ప్రయాణిస్తున్న టైమ్​లో కొత్త కుర్రాళ్లు జురెల్, యశస్వి జైస్వాల్, రజత్ పాటిదార్ ఓ ఫొటో దిగారు. పక్కపక్కనే కూర్చున్న ఈ బ్యాటింగ్ త్రయం మొబైల్ కెమెరా వైపు చూస్తూ నవ్వులు చిందించారు. అయితే వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ధృవ్ ఫోన్​ను చూసి అంతా షాకవుతున్నారు. అందులో వెనుక వైపు ఐదొందల రూపాయల నోట్లు రెండు ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇండియాకు ఆడినా గానీ జురెల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ మాత్రం మారలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇది అతడి సింప్లిసిటీకి బిగ్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు.

మామూలుగా ఇలా ఫోన్ల వెనుక పౌచ్​లో డబ్బుల్ని ఉంచడం మిడిల్ క్లాస్ వారికి బాగా అలవాటు. యూపీఐ యాప్స్​లో డబ్బులు ఉన్నా, పర్స్​లో క్రెడిట్, డెబిట్ లాంటి కార్డులు ఉన్నా, జేబులో క్యాష్ ఉన్నా.. ఇలా మొబైల్ వెనుక మనీ క్యారీ చేయడం చాలా మందికి హాబీ. ఏదైనా అత్యవసరంగా పని పడి డబ్బులు లేకుంటే అప్పుడు వాటిని బయటకు తీస్తారు. అయితే జురెల్ టీమిండియాకు ఆడుతున్నాడు. ఇప్పుడు సెలబ్రిటీగా మారాడు. అతడి ఫోన్​లోనూ యూపీఐ యాప్స్ ఉంటాయి. డబ్బులతో అంత అవసరం పడితే టీమ్ మేనేజ్​మెంట్ చూసుకుంటుంది. అయినా ధృవ్ ఎందుకైనా సేఫ్ అని ఇలా డబ్బుల్ని మొబైల్ పౌచ్​లో క్యారీ చేయడం వైరల్ అవుతోంది. అతడు ఇంత ఎదిగినా, ఏమాత్రం మారలేదని అంటున్నారు నెటిజన్స్. ఇక, చిన్నతనంలో క్రికెట్​ కిట్​కు డబ్బులు లేక జురెల్ ఇబ్బంది పడిన టైమ్​లో అతడి తల్లి తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేసి కిట్ కొనిచ్చారు. అలాంటి సామాన్యమైన బ్యాగ్రౌండ్ నుంచి వచ్చాడీ యంగ్ కీపర్. మరి.. జురెల్ తన ఫోన్​ పౌచ్​లో మనీ క్యారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL స్టార్టింగ్ డేట్ లీక్.. ఇంత ముందుకి పెట్టేశారా? ఇక పండగే!