iDreamPost

IPL షెడ్యూల్‌ రిలీజ్‌! తొలి మ్యాచ్‌లోనే ధోని వర్సెస్‌ కోహ్లీ!

ఐపీఎల్ 2024 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు క్రికెట్ లవర్స్. వారికి భారీ గుడ్ న్యూస్ చెప్పాడు లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్.

ఐపీఎల్ 2024 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు క్రికెట్ లవర్స్. వారికి భారీ గుడ్ న్యూస్ చెప్పాడు లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్.

IPL షెడ్యూల్‌ రిలీజ్‌! తొలి మ్యాచ్‌లోనే ధోని వర్సెస్‌ కోహ్లీ!

ఐపీఎల్ 2024 సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. తాజాగా ఆ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ 17వ సీజన్ ను రెండు షెడ్యూల్స్ కింద విభజించి.. ఒక షెడ్యూల్ ను ఇండియాలో, మరో షెడ్యూల్ ను యూఏఈలో జరపాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు గతంలో వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే.. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేస్తామని టోర్నీ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2024 సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ క్రికెట్ జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 సీజన్ ను మార్చి 22 నుంచి లాంఛనంగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ మధ్య జరగనుంది. అయితే.. ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ కాకుండా.. కేవలం 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే.. దేశంలో పార్లమెంట్‌ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన తర్వాత.. మిగిలిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.  గతంలో ఐపీఎల్‌ షెడ్యూల్‌పై  టోర్నీ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ..”ఐపీఎల్ 2024 సీజన్ ను చెన్నైలో మార్చి 22 నుంచి ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎన్నికల డేట్స్ ఎప్పుడు వస్తాయో.. వాటిని చూసి టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ప్లాన్ చేస్తాం. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం” అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కసరత్తులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఎన్నికల అధికారులు షెడ్యూల్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 9వ తేదీ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ ఇంకాస్త ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంది.

ఇదికూడా చదవండి: ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్​కు గుడ్​న్యూస్.. అదే జరిగితే భారత్​కు కష్టమే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి