Nidhan
టీమిండియాతో టెస్ట్ సిరీస్ అనగానే రోహిత్, రాహుల్, అయ్యర్ లాంటి టాప్ బ్యాటర్స్‌ను చూసి ఇంగ్లండ్ భయపడుతోంది. కానీ ఆ జట్టు గెలవాలంటే అతడ్ని ఆపాల్సి ఉంటుంది.
టీమిండియాతో టెస్ట్ సిరీస్ అనగానే రోహిత్, రాహుల్, అయ్యర్ లాంటి టాప్ బ్యాటర్స్‌ను చూసి ఇంగ్లండ్ భయపడుతోంది. కానీ ఆ జట్టు గెలవాలంటే అతడ్ని ఆపాల్సి ఉంటుంది.
Nidhan
ఉప్పల్ టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్లు ఇవాళ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈసారి స్పిన్ అస్త్రంతోనే బరిలోకి దిగుతోంది రోహిత్ సేన. స్వదేశంలోని టర్నింగ్ ట్రాక్స్‌పై ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని ఇదే ఉచ్చులో బిగిస్తూ వస్తోంది టీమిండియా. స్పిన్ వ్యూహంతో అపోజిషన్ టీమ్స్‌కు ఉక్కిరిబిక్కిరి చేసి చిత్తుగా ఓడిస్తోంది. బజ్‌బాల్ స్ట్రాటజీతో ఓడిస్తామంటూ బీరాలు పోతున్న ఇంగ్లండ్‌పై కూడా స్పిన్ అస్త్రాన్నే ప్రయోగించేందుకు రెడీ అయిపోయింది. హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టులోనే అపోజిషన్ టీమ్‌కు దీని రుచి ఏంటో చూపించాలని భావిస్తోంది. అటు ఇంగ్లండ్ మాత్రం బజ్‌బాల్ క్రికెట్‌తో భారత్‌ను భయపెట్టి సిరీస్‌ను కొట్టేయాలని చూస్తోంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను ఆపితే తిరుగుండదని అనుకుంటోంది. కానీ ఇంగ్లీష్ టీమ్‌కు అసలైన డేంజర్ మాత్రం ఓ యంగ్ ప్లేయర్ నుంచే పొంచి ఉంది.
భారత్‌ను సొంతగడ్డ మీద ఓడించడం అంత ఈజీ కాదు. తోపు టీమ్స్ కూడా ఎన్నో సవాళ్లు విసిరి, ఓడిస్తామని ప్రగల్భాలు పలికి సైలెంట్‌గా తోకముడుచుకొని వెళ్లిపోయాయి. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా బజ్‌బాల్‌తో సిరీస్‌ను పట్టేస్తామని అంటోంది. తొలి రెండు టెస్టుల్లో ఎలాగూ విరాట్ కోహ్లీ లేడు.. కాబట్టి రోహిత్, అయ్యర్, రాహుల్‌ను ఆపితే విజయం తమదేనని భావిస్తోంది. కానీ ఇంగ్లీష్ టీమ్‌కు చుక్కలు చూపించేందుకు సై అంటున్నాడో యంగ్ బ్యాటర్. ప్రత్యర్థి టీమ్‌కు అసలైన బజ్‌బాల్ అంటే ఏంటో రుచి చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అతడే యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. ఫార్మాట్ ఏదైనా అటాకింగ్ అప్రోచ్‌తో దుమ్మురేపుతున్నాడు జైస్వాల్. క్రీజులో అడుగుపెట్టింది మొదలు బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. స్ట్రయిక్ రొటేషన్ కంటే బౌండరీలు, సిక్సులతో స్కోరు బోర్డును పరిగెత్తించడమే ధ్యేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థుల నుంచి మ్యాచుల్ని లాగేసుకుంటున్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా జైస్వాల్‌ను అదే శైలిలో ఆడమని ఎంకరేజ్ చేస్తున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో ఫెయిలైనా జట్టులో తన ప్లేస్‌కు ఢోకా లేదనే హామీని ఇస్తున్నారు. దీంతో బ్యాట్‌తో మరింతగా చెలరేగిపోతున్నాడు జైస్వాల్. ఇప్పటికే టీ20ల్లో దుమ్మురేపుతూ రెగ్యులర్ ప్లేయర్‌గా మారిన ఈ యువ కెరటం.. టెస్టుల్లోనూ తన స్థానాన్ని పదిలపర్చుకోవాలని భావిస్తున్నాడు. అందుకు ఇంగ్లండ్ సిరీస్‌ను పూర్తిగా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ప్రాక్టీస్‌లో తీవ్రంగా చెమటోడ్చిన ఈ ప్లేయర్ మ్యాచ్‌లో తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఒకవేళ జైస్వాల్ గనుక క్రీజులో సెటిలైతే ఇంగ్లండ్‌కు చుక్కలే. ట్రాక్ ఏదైనా, బౌలర్ ఎవరైనా పట్టించుకోకుండా ఊచకోత కోస్తాడు. వాళ్ల బజ్‌బాల్ ఫార్ములాను వాళ్లకే తిప్పికొడతాడు. ఇంగ్లీష్ టీమ్ నెగ్గాలంటే జైస్వాల్‌ను ఆపాలి లేకపోతే అతడు ఇచ్చిపడేయడం ఖాయం. మరి.. జైస్వాల్ ఈ సిరీస్‌లో అంచనాలను అందుకుంటాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.