SNP
India Playing 11 For 5th Test: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ టెస్టులో ఇండియా ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందో ఇప్పుడు చూద్దాం..
India Playing 11 For 5th Test: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ టెస్టులో ఇండియా ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందో ఇప్పుడు చూద్దాం..
SNP
భారత్-ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి ధర్మశాల వేదికగా చివరిదైన ఐదో టెస్టు జరగనుంది. మొత్తం ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే నాలుగు టెస్టులు ముగిశాయి. ఆ నాలుగింటిలోనూ ఫలితం తేలడం విశేషం. ఇప్పటికే టీమిండియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మిగిలిన చివరి టెస్టు నామమాత్రమే అయినా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025ని దృష్టిలో పెట్టుకుంటే ఇరుజట్లకు ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకం. అందుకే సిరీస్ గెలిచేసినా.. టీమిండియా మాత్రం చివరి టెస్టులోనూ గెలిచితీరాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుంది. మరోవైపు ఇంగ్లండ్ సైతం వరుస ఓటములకు అడ్డుకట్ట వేసి.. విజయంతో ఈ సిరీస్‌కు ముగింపు పలకాలని భావిస్తోంది.
ఇలా సిరీస్‌లోని లెక్కలతో పాటు చివరి మ్యాచ్‌కు మరో ప్రాధాన్యత కూడా సంతరించకుంది. అదేంటంటే.. ఇరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు తమ టెస్ట్ కెరీర్‌లో అరుదైన మైలు రాయిని చేరుకుంటున్నారు. టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో వందో టెస్టు ఆడేందుక సిద్ధం అవుతున్నాడు. యాధృశ్చికంగా ఇదే టెస్టు మరో ఆటగాడి కెరీర్‌లో వందో టెస్ట్ కానుంది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టోకు సైతం వందో టెస్టు ఇదే కావడం విశేషం. ఇలా రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్ స్టో ఇద్దరు ఒక మ్యాచ్‌తో తమ కెరీర్‌లో వందో టెస్టు లాంటి అరుదైన మైలురాయిని అందుకోనుండటంతో ఈ టెస్ట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా రెండు జట్లు పటిష్టమైన ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగనున్నాయి. నామమాత్రమైన చివరి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటాడని అంతా భావించినా అది జరగలేదు. రోహిత్ కూడా బరిలోకి దిగన్నారు. అయితే.. ఈ టెస్టులో జట్టులో కొన్ని మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. బెంచ్‌కే పరిమితం అయిన ఆటగాళ్లకు అవకాశాలు దక్కొచ్చు. ఒక సారి టీమిండియా ప్లేయింగ్(అంచనా)ను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్/దేవదత్త్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్. మరి ఈ ప్లేయింగ్ ఎలెవన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dharamshala Stadium is getting ready for the 5th Test match between India Vs England🏏🏟️ pic.twitter.com/VVDk8tB24g
— CricketGully (@thecricketgully) March 5, 2024