వరల్డ్ కప్ టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమిండియా ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ టాస్ వేసే సమయంలో ఓ గందరగోళం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరల్డ్ కప్ టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమిండియా ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ టాస్ వేసే సమయంలో ఓ గందరగోళం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరల్డ్ కప్ 2023 టీమిండియా గెలుస్తుందని కోట్ల మంది భారతీయులు ఎన్నో కలలు కన్నారు. అందుకు తగ్గట్లుగానే టీమిండియా టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టింది. ఆడిన 10 మ్యాచ్ ల్లో పదీ గెలిచి.. దిగ్విజయంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. కానీ కీలక టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై.. భారత ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక ఈ ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు క్రికెట్ లవర్స్. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ టాస్ వేసే సమయంలో ఓ గందరగోళం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
నరేంద్ర మోదీ స్టేడియం.. రెండు జట్లు, ఒక వరల్డ్ కప్. స్టేడియం మెుత్తం టీమిండియా జెర్సీలతో నిండిపోయింది. ఇండియా.. ఇండియా అనే నినాదాలతో స్టేడియం మెుత్తం దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో స్టేడియంలోకి టాస్ వేయడానికి వచ్చారు రోహిత్ శర్మ, పాట్ కమ్మిన్స్. ఇక అప్పటికే గ్రౌండ్ లో తన కామెంట్రీతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి. తనదైన కామెంట్రీతో మ్యాచ్ ను మరింత రసవత్తరంగా మార్చేశాడు. కాగా.. టాస్ వేయడానికి రంగం సిద్దమైంది. ఈ సమయంలో ఓ గందరగోళం ఏర్పడింది. బహుశా ఇది ఎవరూ గుర్తించి ఉండకపోవచ్చు. అదేంటంటే?
రవిశాస్త్రి టాస్ కాయిన్ ను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కు ఇవ్వమని మ్యాచ్ రిఫరీ ఆండీ క్రాప్ట్ కు చెప్పాడు. అయితే అతడు టాస్ కాయిన్ ను తీసుకెళ్లి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతిలో పెట్టాడు. దీంతో రోహిత్ టాస్ వేయడం.. మిగతా సంగతి అంతా తెలిసిన విషయమే. మ్యాచ్ రిఫరీ టాస్ కాయిన్ ను రోహిత్ కు కాకుండా రవిశాస్త్రి చెప్పినట్లుగా కమ్మిన్స్ కు కాయిన్ ఇచ్చిఉంటే.. ఫలితం వేరేవిధంగా ఉండేదని ఈ వీడియో చూసిన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ భారత్ బౌలింగ్ ఫస్ట్ చేస్తే.. టీమిండియా కచ్చితంగా వరల్డ్ కప్ గెలిచేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్. మరి ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి