ప్రపంచ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కోసం టీమిండియాలో కొందరు యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ టోర్నీలో ఐదుగురు యువ ఆటగాళ్లు ఆడటం ఫిక్స్ అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రపంచ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కోసం టీమిండియాలో కొందరు యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ టోర్నీలో ఐదుగురు యువ ఆటగాళ్లు ఆడటం ఫిక్స్ అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా తిరుగులేని విధంగా డామినేట్ చేస్తోంది. ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడిస్తూ ఓటమనేదే లేకుండా నాకౌట్‌ను దూసుకొచ్చి అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను అమాంతం పెంచేసింది. అయితే ఇంత వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా ఉండనుంది. సెమీఫైనల్ గండాన్ని దాటితేనే ఫైనల్‌కు క్వాలిఫై అవ్వగలం కాబట్టి న్యూజిలాండ్‌ను తప్పక ఓడించాల్సిందే. ఎలాంటి హడావుడి లేకుండా కూల్‌గా పని చేసుకుపోతూ, ప్రత్యర్థులకు షాకిచ్చే కివీస్‌తో బుధవారం రోహిత్ సేన తలపడనుంది. టోర్నీలో టీమ్ పెర్ఫార్మెన్స్, ప్లేయర్ల ఇండివిడ్యువల్ ఫామ్, వాంఖడే స్టేడియంలో రికార్డు.. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఈ మ్యాచ్‌లో టీమిండియానే హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
వరల్డ్ కప్ సెమీస్ హిస్టరీ మాత్రం మన వైపు లేదని చెప్పాలి. గత చరిత్రను మార్చి సరికొత్త చరిత్రను రాయాల్సిన తరుణమిది. గత ప్రపంచ కప్ సెమీస్‌కు రీవేంజ్ తీసుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఆశలు నాకౌట్ స్టేజ్‌లోనే కూలిపోకుండా చూడాల్సిన రెస్పాన్సిబులిటీ రోహిత్ సేనదే. బ్యాటింగ్ పరంగా కివీస్ తరఫున సంచలన ప్రదర్శన చేస్తున్న రచిన్ రవీంద్రతో జాగ్రత్తగా ఉండాలి. అతడ్ని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌కు చేరిస్తే మంచిది. రచిన్‌తో పాటు మంచి ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్, డేంజరస్ బ్యాటర్ డెవిన్ కాన్వేల్లో ఏ ఇద్దరు సెటిలైనా భారత్‌కు కష్టాలు తప్పవు. ఇక ఆ టీమ్‌లో అతి పెద్ద ముప్పు కెప్టెన్ కేన్ విలియమ్సన్ నుంచి పొంచి ఉందని చెప్పొచ్చు.
టీమిండియాపై మంచి రికార్డు ఉన్న కేన్ మామ సెమీస్‌లోనూ దాన్ని కంటిన్యూ చేసేందుకు ప్రయత్నిస్తాడు. మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను క్రీజులో కుదురుకోకుండా చేయాలి. ఒకవేళ అతడు సెటిలైతే మాత్రం ఆపడం కష్టం. న్యూజిలాండ్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్ చాలా కీలకం కానున్నారు. వీళ్లిద్దర్నీ బాగా ఎదుర్కొంటే రన్స్ రావడం ఈజీ అయిపోతుంది. భారత క్రికెటర్లకు వాంఖడేలో మంచి రికార్డుతో పాటు ఎన్నో మ్యాచులు ఆడిన ఎక్స్‌పీరియెన్స్ ఉండటం కలిసొచ్చే అంశం. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌కు ఇది హోమ్ గ్రౌండ్ అనేది తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా టీమ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఐదు మ్యాచుల ఈ సిరీస్‌లో కొందరు యంగ్‌స్టర్స్‌కు టీమిండియాలో చోటు ఫిక్స్ అని తెలుస్తోంది. రీసెంట్గా జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మకు టీమిండియాలో ప్లేస్ ఖాయమని క్రికెట్ వర్గాల సమాచారం. యంగ్ వికెట్ కీపర్, బ్యాటర్ జితేష్ శర్మనూ కంగారూ సిరీస్‌లో ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ అనౌన్స్ చేసే వరకు తుది జట్టుపై ఏమీ చెప్పలేం. మరి.. ఆసీస్‌తో సిరీస్‌లో యంగ్ క్రికెటర్స్‌లో ఎవరెవర్ని ఆడిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సిరాజ్.. అయినా టాప్‌లో భారతీయుడే!
Ruturaj, Jaiswal, Rinku, Tilak and Jitesh likely to be part of India’s squad for the T20i series against Australia. (Espncricinfo). pic.twitter.com/kipRcirZPQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 14, 2023