iDreamPost

నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సిరాజ్.. అయినా టాప్​లో భారతీయుడే!

  • Author singhj Published - 11:30 AM, Wed - 15 November 23

ఐసీసీ రీసెంట్​గా ప్రకటించిన ర్యాంకింగ్స్​లో నంబర్ వన్ ప్లేస్​ను సొంతం చేసుకున్నాడు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. అయితే వారంలోపే టాప్ ప్లేస్​ను కోల్పోయాడు సిరాజ్.

ఐసీసీ రీసెంట్​గా ప్రకటించిన ర్యాంకింగ్స్​లో నంబర్ వన్ ప్లేస్​ను సొంతం చేసుకున్నాడు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. అయితే వారంలోపే టాప్ ప్లేస్​ను కోల్పోయాడు సిరాజ్.

  • Author singhj Published - 11:30 AM, Wed - 15 November 23
నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సిరాజ్.. అయినా టాప్​లో భారతీయుడే!

క్రికెట్​లో ర్యాంకులకు ఉండే ఇంపార్టెన్స్ గురించి తెలిసిందే. కంటిన్యూస్​గా బాగా పెర్ఫార్మ్ చేసే ప్లేయర్లే ర్యాంకుల్లో ముందుంటారు. టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ నిరంతరం రాణించే ఆటగాళ్లకు ర్యాంకులు కాన్ఫిడెన్స్​ను మరింతగా పెంచుతాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించే ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్స్ హవా నడుస్తోంది. తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్​లో స్టార్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ (832 పాయింట్లు) ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (824)ను వెనక్కినెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు గిల్. భారత్ తరఫున పిన్న వయసులో నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్న బ్యాట్స్​మన్​గా హిస్టరీ క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇప్పుడు దీన్ని గిల్ బ్రేక్ చేశాడు.

లెజెండరీ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ తర్వాత వన్డేల్లో నంబర్ వన్​గా నిలిచిన భారత బ్యాటర్​గా నిలిచాడు గిల్. తాజా ర్యాంకింగ్స్​లో విరాట్ కోహ్లీ (772) నాలుగో ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (760) ఉన్నాడు. ఇటీవల ప్రకటించిన బౌలింగ్ ర్యాంకింగ్స్​లో నంబర్ వన్ ప్లేసులోకి దూసుకొచ్చిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (723) రెండో స్థానానికి పడిపోయాడు. భారత మూలాలు ఉన్న సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (726) అగ్రస్థానానికి చేరుకున్నాడు. జస్​ప్రీత్ బుమ్రా (687), కుల్​దీప్ యాదవ్ (682) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు.

సిరాజ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించి వారం కూడా గడవలేదు. అప్పుడే ఆ ర్యాంక్​ను కోల్పోయాడు. దీనికి కారణం అగ్రస్థానంలోకి వచ్చిన సఫారీ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ మిగిలిన మ్యాచుల్లో రాణించడమేనని చెప్పొచ్చు. అయితే సిరాజ్ టాప్ ప్లేస్​ను కోల్పోయినా ఆ స్థానంలోకి భారతీయ మూలాలు ఉన్న కేశవ్ రావడంతో ఇండియన్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. సిరాజ్ పోయినా టాప్ చెయిర్ మనోడికే దక్కిందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్​ సెమీస్​లో సౌతాఫ్రికా, భారత్​లు ఉన్నాయి. నాకౌట్ మ్యాచ్​లో నెగ్గితే ఫైనల్​కు కూడా చేరుకునే ఛాన్స్ ఉన్నందున టోర్నమెంట్ ముగిసేలోపు నంబర్ వన్ ర్యాంక్ కోసం సిరాజ్-కేశవ్ మధ్య పోటీ ఇలాగే జరిగేలా కనిపిస్తోంది. మరి.. సిరాజ్ టాప్ ర్యాంక్ కోల్పోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్- న్యూజిలాండ్ మ్యాచ్.. ముంబై వాంఖడే స్టేడియానికి బెదిరింపులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి