ప్రపంచ కప్‌కు ముందు భారత ఆటగాళ్లకు భలే ప్రాక్టీస్ దొరికింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను టీమిండియా బాగా వినియోగించుకుంటోంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లాంటి పలువురు ప్రధాన ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి.. వాళ్ల ప్లేసులో మిగిలిన వారికి అవకాశాలు ఇవ్వడం కలిసొచ్చింది. వన్డేల్లో ఎలా ఆడాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇప్పుడు రెండో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ వంతు వచ్చింది. టీమ్‌లో ప్లేసు దక్కాలంటే తప్పక రాణించాల్సిన పరిస్థితుల్లో అయ్యర్ సెంచరీతో సత్తా చాటాడు.
శ్రేయాస్ అయ్యర్ (105)తో పాటు ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (104) కూడా రెండో వన్డేలో దుమ్మురేపాడు. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఆసీస్ బౌలర్లను చితగ్గొట్టాడు గిల్. అయ్యర్-గిల్ మధ్య 200 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. దీన్ని బట్టే వీళ్లిద్దరి బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ముందు అయ్యర్ సెంచరీ పూర్తి చేసుకొని ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్ శతకాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఇది అతడి వన్డే కెరీర్లో 6వ సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో అత్యంత వేగంగా ఆరు సెంచరీలు కొట్టిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా వన్డేల్లో 1,917 రన్స్ చేసిన గిల్.. 35 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించాడు.
మొత్తంగా 35 వన్డేల్లో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ కొట్టాడు శుబ్‌మన్ గిల్. ఈ ఏడాది 39 ఇన్నింగ్స్‌ల్లో అతడికి ఇది 7వ సెంచరీ కావడం గమనార్హం. ఇక, ఆసీస్‌తో రెండో వన్డేలో గిల్, అయ్యర్‌తో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించారు. రాహుల్ (38 బంతుల్లో 52) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సూర్య (37 బంతుల్లో 72 నాటౌట్) అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సులు ఉండటం విశేషం. 50 ఓవర్లకు భారత్ 399/5 స్కోరు చేసింది.
Historic:
Shubman Gill has most runs after 35 innings in ODIs. pic.twitter.com/cciP5kLa8u
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 24, 2023