iDreamPost
android-app
ios-app

అలాంటి క్రికెటర్​ను ఎక్కడా చూడలేదు.. అందరి బ్యాట్లు, హెల్మెట్లు మోస్తాడు: అశ్విన్

  • Author singhj Published - 05:51 PM, Tue - 28 November 23

ఒక టీమిండియా యంగ్ క్రికెటర్​ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. అలాంటి ప్లేయర్​ను తాను ఎక్కడా చూడలేదన్నాడు.

ఒక టీమిండియా యంగ్ క్రికెటర్​ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. అలాంటి ప్లేయర్​ను తాను ఎక్కడా చూడలేదన్నాడు.

  • Author singhj Published - 05:51 PM, Tue - 28 November 23
అలాంటి క్రికెటర్​ను ఎక్కడా చూడలేదు.. అందరి బ్యాట్లు, హెల్మెట్లు మోస్తాడు: అశ్విన్

సూర్యకుమార్ నేతృత్వంలోని యంగ్ ఇండియా మరో కీలక మ్యాచ్​కు రెడీ అయిపోయింది. 5 టీ20ల సిరీస్​లో భాగంగా మంగళవారం జరిగే మూడో మ్యాచ్​లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఈ సిరీస్​లో ఫస్ట్ మ్యాచ్​లో భారత్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆ మ్యాచ్​లో ఈజీగా గెలవాల్సింది. కానీ ఆఖర్లో ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ చెత్త షాట్ ఆడి ఔటవ్వడం, ఆ తర్వాత మరో ఇద్దరు బ్యాటర్లు వెంటవెంటనే రనౌట్ కావడంతో టీమ్​పై ప్రెజర్ పెరిగింది. కానీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్​లో చివరిదాకా క్రీజులో నిలబడిన రింకూ సింగ్ మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 44 రన్స్ తేడాతో ఆసీస్​ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్​లో ఎక్స్​పెక్ట్ చేసిన దాని కంటే బాగా పెర్ఫార్మ్ చేసింది మన జట్టు. అన్ని విభాగాల్లోనూ అపోజిషన్ కంగారూ టీమ్​ను డామినేట్ చేసి గెలిచింది.

మూడో టీ20లో గెలిస్తే ఐదు టీ20ల సిరీస్ భారత్ సొంతమవుతుంది. అందుకే ఎలాగైనా ఇవాళ్టి మ్యాచ్​లో నెగ్గాలని టీమిండియా అనుకుంటోంది. మరోవైపు ఆసీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్​ను వదలొద్దని అనుకుంటోంది. సిరీస్ దక్కాలంటే ఈ మ్యాచ్​లో నెగ్గడం ఆ టీమ్​కు కంపల్సరీగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇరు టీమ్స్ ప్లేయర్లు సర్వశక్తులూ ఒడ్డి ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా జరిగిన రెండు టీ20లను చూసుకుంటే భారత జట్టు చాలా స్ట్రాంగ్​గా కనిపిస్తోంది. టీమ్​లో పెద్దగా స్టార్లు లేకపోయినా ఉన్న యంగ్​స్టర్స్ అందరూ సత్తా చాటుతుండటం, ఫియర్​లెస్ అప్రోచ్​తో ఆడుతుండటం మనకు బిగ్ ప్లస్ అనే చెప్పాలి. సిరీస్​లోని మిగిలిన మ్యాచుల్లోనూ ఇదే విధంగా ఆడితే ఇక మనకు తిరుగుండదనే చెప్పాలి. గత రెండు మ్యాచుల్లోనూ భారత బ్యాటింగ్ యూనిట్ భీకరమైన ఫామ్​లో కనిపించింది.

ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి ఫినిషర్ రింకూ సింగ్ వరకు బ్యాటర్లు అందరూ మంచి ఫామ్​లో ఉన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ ఎలాగూ ఉండనే ఉన్నాడు. అయితే ఇషాన్ కిషన్ రాణిస్తుండటం టీమ్​కు అదనపు బలమనే చెప్పాలి. వరల్డ్‌ కప్​ స్క్వాడ్​లో ఉన్నా ఆడే అవకాశం దక్కని ఇషాన్.. ఆసీస్​తో సిరీస్​లో సత్తా చాటుతున్నాడు. మొదటి మ్యాచ్​లో 58 రన్స్ చేసిన అతను.. రెండో టీ20లోనూ 52 రన్స్ చేసి టీమ్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఇషాన్​ను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. ఇషాన్ కిషన్ అలాంటి ప్లేయర్​ను తానెక్కడా చూడలేదన్నాడు. ‘ఇషాన్​కు గ్రేట్ యాటిట్యూడ్ ఉంది. అతడు బాగా ఆడినప్పుడు నేను హ్యాపీగా ఫీలవుతా. అందర్నీ సంతోషంగా ఉంచేందుకు ఇషాన్ ప్రయత్నిస్తుంటాడు. ప్రతి ఆటగాడి బ్యాట్, గ్లవ్స్, హెల్మెట్స్ అతడే సిద్ధం చేస్తాడు’ అని అశ్విన్ చెప్పాడు.

ప్లేయింగ్ ఎలెవన్​లో చోటు దక్కకపోయినా ఇషాన్ కిషన్ ఎప్పుడూ కంప్లయింట్స్ చేయడని అశ్విన్ తెలిపాడు. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదని.. ఇషాన్ చాలా మంచోడని పొగడ్తల్లో ముంచెత్తాడు. అశ్విన్ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ ఇషాన్ కిషన్​ను ప్రశంసిస్తున్నారు. ఆయన చెప్పింది నిజమేనని అంటున్నారు. డ్రింక్స్ టైమ్​లో బ్యాటర్లకు గ్లవ్స్, బ్యాట్స్, హెల్మెట్ లాంటివి అందిస్తుంటాడని చెబుతున్నారు. వరల్డ్ కప్​ సెమీస్​లో కోహ్లీ, గిల్ అలసిపోతే వారికి డ్రింక్స్​ తీసుకెళ్లడంతో పాటు గొడుగు కూడా పట్టాడని గుర్తుచేస్తున్నారు. మరి.. ఇషాన్​పై అశ్విన్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బుమ్రా షాకింగ్ పోస్ట్.. ఎవరిని ఉద్దేశించి?