iDreamPost

బుమ్రా షాకింగ్ పోస్ట్.. ఎవరిని ఉద్దేశించి?

  • Author Soma Sekhar Published - 01:40 PM, Tue - 28 November 23

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెట్టిన ఓ షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత తొలిసారి స్పందించాడు బుమ్రా. అయితే ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడో? ఏం జరిగిందో? మాత్రం చెప్పలేదు.

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెట్టిన ఓ షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత తొలిసారి స్పందించాడు బుమ్రా. అయితే ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడో? ఏం జరిగిందో? మాత్రం చెప్పలేదు.

  • Author Soma Sekhar Published - 01:40 PM, Tue - 28 November 23
బుమ్రా షాకింగ్ పోస్ట్.. ఎవరిని ఉద్దేశించి?

గాయం.. ఎంతటి మనిషినైనా కుంగదీస్తుంది. ఇక అది ఎన్ని రోజులు మనిషిని వెంటాడుతుందో కూడా చెప్పలేం. ప్రస్తుతం భారతీయులను కూడా ఓ గాయం వెంటాడుతోంది. ఆ గాయం ఏదో కాదు.. టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడమే. ఇప్పటికీ ఈ ఓటమి భారతీయుల కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఇక తమ బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ వస్తున్నారు కొందరు స్టార్ క్రికెటర్లు. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్, స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా పెట్టిన ఓ షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. భారత జట్టు ఓటమి తర్వాత తొలిసారి స్పందించాడు బుమ్రా. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి, ఎందుకు పెట్టాడో? ఏం జరిగిందో? మాత్రం చెప్పలేదు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే?

జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా స్టార్ పేసర్ గా ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించగల సమర్థవంతమైన బౌలర్. ఇక తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. అదీకాక ఈ మెగాటోర్నీలో 11 మ్యాచ్ ల్లో 18 వికెట్లు తీసి సత్తా చాటాడు. టోర్నీ మెుత్తం అద్భుతంగా రాణించిన టీమిండియా ప్లేయర్లు కీలక టైటిల్ పోరులో చేతులెత్తేశారు. ఇక వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోవడంతో చాలా మంది రకరకాల మాటలు, విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రా వరల్డ్ కప్ ఓటమి తర్వాత తొలిసారి ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో “కొన్ని కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటమే సరైన సమాధానం” అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయితే బుమ్రా ఈ సమయంలో ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టాడు? అన్న విషయం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.

కాగా.. ఓటమి తర్వాత వచ్చే విమర్శలకు బదులివ్వడం కంటే సైలెంట్ గా ఉండటమే బెటర్ అని బుమ్రా భావించి ఈ పోస్ట్ పెట్టాడని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ముంబై టీమ్ లోకి పాండ్యా రావడంతోనే బుమ్రా ఈ పోస్ట్ చేశాడని చెప్పుకొస్తున్నారు. దానికి కారణం రోహిత్ తర్వాత ముంబై పగ్గాలను బుమ్రా అందుకోవాలని చూస్తుండటమే. పాండ్యా రావడంతో.. బుమ్రా తీవ్ర అసహనంలో ఉన్నట్లు, అందుకే ఈ పోస్ట్ పెట్టినట్లు ఇంకొందరు సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. బుమ్రా-సంజనా దంపతులు ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. కొన్ని రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సంజనా. ఇలాంటి సంతోష సమయంలో అతడు పెట్టిన పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి బుమ్రా షాకింగ్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి