భారత జట్టు వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది. టీమిండియాకు అసలు ఎదురే లేకుండా పోతోంది. ఆసియా కప్‌లో ఎదురొచ్చిన ప్రత్యర్థులను ఓడిస్తూ పోయిన భారత జట్టు.. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది. ఆసియా కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. కంగారూలతో జరిగిన తొలి రెండు వన్డేల్లో సునాయాసంగా గెలిచి, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌లో నామమాత్రంగా చెప్పుకునే మూడో వన్డేలో మాత్రం రెండు టీమ్స్ ఫుల్ స్ట్రెంగ్త్‌తో బరిలోకి దిగుతున్నాయి.
తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలు చివరి వన్డేకు అందుబాటులో ఉంటారు. దీంతో రాజ్‌కోట్ వన్డేలో పలువురు ప్లేయర్లు బెంచ్‌కే పరిమితం కానున్నారు. రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్‌తో పాటు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను విశ్రాంతినిచ్చే అవకాశముంది. కీపర్ ఇషాన్ కిషన్‌కు కూడా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొదటి రెండు వన్డేల్లో ఓపెనర్‌గా ఆడిన రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండటం లేదు. ఆసియా క్రీడల కోసం అతడు హాంగ్జౌకు వెళ్తున్నాడు. ఆ క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఆసియా కప్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆసీస్‌తో ఆఖరి వన్డేకు అందుబాటులో ఉంటాడని అందరూ అనుకున్నారు. అతడు గ్రౌండ్లోకి దిగుతాడని భావించారు. కానీ మూడో వన్డేకు అక్షర్ దూరమయ్యాడు. గాయం బారి నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లో అతడు ఆడట్లేదు. అయితే వరల్డ్ కప్‌కు కూడా అక్షర్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ లోపు ప్రపంచ కప్ జట్టులో మార్పులు చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అంతలోపు అక్షర్ ఫిట్నెస్ సాధించకపోతే అతడి ప్లేసులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీకి మార్గం సుగమమవుతుంది. మరో ప్రత్యామ్నాయంగా వాషింగ్టన్ సుందర్ కనిపిస్తున్నా.. మంచి అనుభం ఉన్న అశ్విన్ ఈ రేసులో ముందున్నాడు.