వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత్ అదరగొడుతోంది. పలువురు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా భారత బృందం ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. ఫిట్నెస్, ఫామ్ నిరూపించుకునేందుకు ఇదే చివరి అవకాశం అంటూ తనపై వస్తున్న కామెంట్లకు శ్రేయస్ అయ్యర్ గట్టి జవాబిచ్చాడు. ఒకే ఇన్నింగ్స్‌తో అన్ని అనుమానాలను పటాపంచలు చేశాడు. అతడికి తోడు భీకర ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ కూడా శతక్కొట్టాడు. వన్డేల్లో ఎలా ఆడాలనే కిటుకు తెలుసుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా మరోమారు తన ప్రతాపాన్ని చూపించాడు. ఫలితంగా భారీ విజయాన్ని అందుకున్న భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఇండోర్‌లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో 99 రన్స్ తేడాతో ఆసీస్‌ను టీమిండియా మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ అన్ని ఓవర్లాడి 5 వికెట్ల నష్టానికి 399 రన్స్ చేసింది. వన్డేల్లో కంగారూ జట్టుపై టీమిండియాకు ఇదే హయ్యెస్ట్ స్కోరు కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికైన శ్రేయస్ అయ్యర్ (105), ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (104) సెంచరీలతో సత్తా చాటారు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 200 రన్స్ జోడించారు. వీళ్లకు తోడుగా సూర్యకుమార్ (72 నాటౌట్), కేఎల్ రాహుల్ (52) కూడా దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
టీమిండియా ఇన్నింగ్స్‌లో 31 ఫోర్లు, 18 సిక్సర్లు ఉండటం విశేషం. ఆ తర్వాత వాన కారణంగా ఆసీస్ టార్గెట్‌ను డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 33 ఓవర్లలో 317 రన్స్‌గా నిర్దేశించారు. కానీ కంగారూ టీమ్ 28.2 ఓవర్లలో 217 రన్స్‌కు ఆలౌటైంది. వార్నర్ (53), అబాట్ (54) రాణించారు. ఈ సిరీస్‌లో ఆఖరి వన్డే బుధవారం రాజ్‌కోట్‌లో జరగనుంది. అయితే రెండో వన్డేలో సెంచరీతో అలరించిన గిల్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నారని సమాచారం. వీళ్లిద్దరికీ రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించిందట. తొలి రెండు వన్డేల్లో ఆడని రోహిత్, కోహ్లీ, పాండ్యా, కుల్దీప్, సిరాజ్ చివరి వన్డేకు అందుబాటులో ఉంటారనేది తెలిసిందే. చివరి వన్డేలో టీమిండియాతో పాటు ఆసీస్ కూడా ఫుల్ స్ట్రెంగ్త్‌తో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు తప్పదనే చెప్పాలి.
ఇదీ చదవండి: కోహ్లీ ప్లేస్‌పై అయ్యర్ కన్నేశాడా? స్టార్ బ్యాటర్ రియాక్షన్ ఇదే..!
Shubman Gill and Shardul Thakur rested from the 3rd ODI. (Indian Express). pic.twitter.com/98LnfkDwha
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 25, 2023