iDreamPost

వీడియో: ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో పంత్​కు రోహిత్ వార్నింగ్.. క్యాచ్ పట్టినా గానీ..!

  • Published Jun 21, 2024 | 3:34 PMUpdated Jun 21, 2024 | 3:34 PM

సూపర్-8ని విజయంతో ప్రారంభించింది టీమిండియా. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 47 పరుగుల తేడాతో భారీ విక్టరీ కొట్టింది రోహిత్ సేన.

సూపర్-8ని విజయంతో ప్రారంభించింది టీమిండియా. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 47 పరుగుల తేడాతో భారీ విక్టరీ కొట్టింది రోహిత్ సేన.

  • Published Jun 21, 2024 | 3:34 PMUpdated Jun 21, 2024 | 3:34 PM
వీడియో: ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో పంత్​కు రోహిత్ వార్నింగ్.. క్యాచ్ పట్టినా గానీ..!

ఎన్నో ప్రశ్నలు.. ఇంకెన్నో అనుమానాలు. కానీ అన్నింటికీ ఒక్క మ్యాచ్​తో సమాధానం దొరికేసింది. టీ20 వరల్డ్ కప్-2024 ఫస్టాఫ్​లో భారత్ ఆటతీరు చూసిన వారికి చాలా సందేహాలు వచ్చాయి. అమెరికాలోని ట్రిక్కీ పిచ్​లపై మన బ్యాటర్లు దారుణంగా ఫ్లాప్ అవడం, బౌలర్లలో పేసర్లు రాణించినా స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపించకపోవడంతో జట్టు పరిస్థితి ఏంటా అని అందరూ టెన్షన్ పడ్డారు. సూపర్-8కి చేరుకున్నాం సరే.. సెమీస్ బెర్త్ ఎలా సాధించగలం? ఇలాంటి ఆటతీరుతో విజయాలు సాధ్యమేనా? అనే డౌట్స్ వచ్చాయి. అయితే అన్నింటికీ తమ పెర్ఫార్మెన్స్​తో బదులిచ్చారు మెన్ ఇన్ బ్లూ. ఆఫ్ఘానిస్థాన్​తో గురువారం జరిగిన సూపర్ పోరులో రోహిత్ సేన చెలరేగి ఆడింది. ఆఫ్ఘాన్​ను 47 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఈ టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘాన్.. అన్ని ఓవర్లు ఆడి 134 పరుగులకే పరిమితమైంది. బ్యాటింగ్​లో సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53), హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32) సూపర్బ్ నాక్స్​తో ఆకట్టుకున్నారు. బౌలింగ్​లో అర్ష్​దీప్ సింగ్ (3/36), జస్​ప్రీత్ బుమ్రా (3/7), కుల్దీప్ యాదవ్ (2/32) అదరగొట్టారు. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో ఉన్న అన్ని డౌట్స్​కు చెక్ పెట్టింది టీమిండియా. తమ రియల్ గేమ్​ను బయటపెట్టి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపించింది. ఇక, నిన్నటి మ్యాచ్​కు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి వికెట్ కీపర్ రిషబ్ పంత్​కు కెప్టెన్ రోహిత్ వార్నింగ్ ఇవ్వడం.

నిన్నటి మ్యాచ్​లో పంత్​కు రోహిత్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్​గా మారింది. ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ సమయంలో గుల్బదీన్ నయీబ్ ఇచ్చిన క్యాచ్​ను చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ పట్టుకున్నాడు పంత్. అయితే కీపర్ అంత దూరం వచ్చి క్యాచ్ అందుకోవడం హిట్​మ్యాన్​కు నచ్చలేదు. ఆల్రెడీ అక్కడ ఒకరిద్దరు ఫీల్డర్లు ఉన్నారు. అయినా పంత్ తానే క్యాచ్ పడతానంటూ వచ్చి మరీ అందుకున్నాడు. ఒకవేళ క్యాచ్ మిస్ అయితే ఏం జరిగేదో చెప్పలేం.

గుల్బదీన్ వికెట్ చాలా కీలకం. అందుకే క్యాచ్ పట్టాక పంత్ సెలబ్రేట్ చేసుకుంటూ రోహిత్ దగ్గరకు వచ్చాడు. కానీ హిట్​మ్యాన్​ మాత్రం అంత ఓవరాక్షన్ ఎందుకు అంటూ అతడికి సిగ్నల్ ఇచ్చాడు. నార్మల్​గా ఉండు కదా అంటూ సైగ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. పంత్ క్యాచ్ పట్టడంలో తప్పు లేదు గానీ అంత రిస్క్ ఎందుకని అంటున్నారు. క్యాచింగ్ పొజిషన్స్​లో ఉన్నవారైతే క్యాచ్ అందుకుంటారని, కీపర్ అంత దూరం పరిగెత్తి ఒకవేళ మిస్సైతే కష్టం కదా.. అందుకే రోహిత్ అతడ్ని సున్నితంగా మందలించాడని చెబుతున్నారు. మరి.. పంత్​కు రోహిత్ వార్నింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి