iDreamPost
android-app
ios-app

Rohit Sharma: చరిత్ర సృష్టించనున్న రోహిత్.. టీ20ల్లో తొలి ఆటగాడిగా నిలిచే ఛాన్స్!

  • Published Jan 13, 2024 | 8:28 PM Updated Updated Jan 13, 2024 | 8:28 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రికార్డులు కొత్త కాదు. క్రికెట్​లో ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేసిన హిట్​మ్యాన్.. ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రికార్డులు కొత్త కాదు. క్రికెట్​లో ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేసిన హిట్​మ్యాన్.. ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.

  • Published Jan 13, 2024 | 8:28 PMUpdated Jan 13, 2024 | 8:28 PM
Rohit Sharma: చరిత్ర సృష్టించనున్న రోహిత్.. టీ20ల్లో తొలి ఆటగాడిగా నిలిచే ఛాన్స్!

భారత క్రికెట్ టీమ్ ఫుల్ జోష్​లో ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది రోహిత్ సేన. సౌతాఫ్రికా టూర్​లో ఒక్క ఫార్మాట్​లోనూ సిరీస్​ను ఓడిపోకుండా స్వదేశానికి వచ్చిన టీమిండియా.. ఆఫ్ఘానిస్థాన్ సిరీస్​లోనూ శుభారంభం చేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్​లో మన టీమే గెలిచింది. మరో రెండు మ్యాచులు మిగిలి ఉన్నప్పటికీ సెకండ్ టీ20లోనే సిరీస్​ను పట్టేయాలని చూస్తోంది భారత్. తద్వారా మూడో టీ20లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు వీలు దొరుకుతుందని భావిస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న తీరు, ఆటగాళ్ల ఫామ్​ను బట్టి రెండో మ్యాచ్​లో గెలుపు నల్లేరు మీద నడకేలా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్​తో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. అతడికి రికార్డులు కొత్త కాదు. కానీ ఇది మాత్రం చాలా స్పెషల్​గా నిలవనుంది.

చరిత్ర సృష్టించేందుకు ఇంకో ఆడుగు దూరంలో ఉన్నాడు రోహిత్ శర్మ. ఇది సాధిస్తే టీ20 క్రికెట్​లో తొలి ఆటగాడిగా నిలుస్తాడు. 14 నెలల గ్యాప్ తర్వాత పొట్టి ఫార్మాట్​లోకి అడుగుపెట్టిన హిట్​మ్యాన్.. మరో అరుదైన రికార్డును తన అకౌంట్​లో వేసుకోనున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో 150 టీ20లు ఆడిన ఫస్ట్ క్రికెటర్​గా రికార్డు క్రియేట్ చేయనున్నాడు. ఇప్పటిదాకా 149 టీ20 మ్యాచులు ఆడిన టీమిండియా కెప్టెన్.. ఆఫ్ఘానిస్థాన్​తో ఆదివారం జరిగే సెకండ్ టీ20తో ఈ ఘనత అందుకోనున్నాడు. ఈ లిస్టులో స్టార్ బ్యాట్స్​మన్​ విరాట్ కోహ్లీ 11వ పొజిషన్​లో ఉన్నాడు. ఇక, చాన్నాళ్ల తర్వాత టీ20 మ్యాచ్ ఆడిన హిట్​మ్యాన్ ఫస్ట్ టీ20లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. దీంతో రెండో టీ20లో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

కాగా, భారత్-ఆఫ్ఘాన్ సెకండ్ టీ20 మ్యాచ్​కు మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సిరీస్​లోని తొలి మ్యాచ్​కు దూరమైన కోహ్లీ.. రెండో టీ20లో ఆడనున్నాడు. పర్సనల్ రీజన్స్ వల్ల ముంబైకి వెళ్లిన విరాట్.. మళ్లీ టీమ్​లో చేరాడు. దీంతో 14 నెలల విరామం తర్వాత అతడు ఆడనున్న తొలి పొట్టి ఫార్మాట్ మ్యాచ్ ఇదే కానుంది. ఈ మ్యాచ్​లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా చెలరేగితే ఆఫ్ఘాన్​కు కష్టాలు తప్పవు. మొదటి మ్యాచ్​లో విజయం సాధించాం కాబట్టి రెండో టీ20లో దాదాపుగా సేమ్ టీమ్​తో వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ కోహ్లీ వచ్చాడు కాబట్టి యంగ్ బ్యాట్స్​మన్ శుబ్​మన్ గిల్ బెంచ్​కే పరిమితం అవుతాడు. పిచ్​ను బట్టి ఇంకేమైనా మార్పులు చేస్తారేమో చూడాలి. మరి.. ఆఫ్ఘాన్​తో రెండో టీ20తో రోహిత్ సరికొత్త చరిత్రను సృష్టించనుండటం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: RCBని ఓడించి కప్ ఎగరేసుకుపోయిన SRH.. ఇది ఐపీఎల్ కాదు..!