iDreamPost

T20 World Cup: సూపర్‌ 8లో ఇండియా ఆడబోయేది ఈ టీమ్స్‌తోనే! ఆ రెండు టీమ్స్‌తో డేంజర్‌

  • Published Jun 13, 2024 | 12:46 PMUpdated Jun 13, 2024 | 12:46 PM

India, Super 8, T20 World Cup 2024, IND vs AUS: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా సూపర్‌ 8లో ఏ టీమ్స్‌తో తలపడనుంది? వాటిలో ఏ టీమ్స్‌ బలంగా ఉన్నాయి? వేటితో మనకు ముప్పు పొంచి ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

India, Super 8, T20 World Cup 2024, IND vs AUS: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా సూపర్‌ 8లో ఏ టీమ్స్‌తో తలపడనుంది? వాటిలో ఏ టీమ్స్‌ బలంగా ఉన్నాయి? వేటితో మనకు ముప్పు పొంచి ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 13, 2024 | 12:46 PMUpdated Jun 13, 2024 | 12:46 PM
T20 World Cup: సూపర్‌ 8లో ఇండియా ఆడబోయేది ఈ టీమ్స్‌తోనే! ఆ రెండు టీమ్స్‌తో డేంజర్‌

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోయింది. గ్రూప్‌ స్టేజ్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే అర్హత సాధించింది. ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, యూఎస్‌ఏలను వరుసగా ఓడించిన విషయం తెలిసిందే. 15న కెనడాతో నామమాత్రపు మ్యాచ్‌ ఆడనుంది రోహిత్‌ సేన. అయితే.. గ్రూప్‌ స్టేజ్‌లో టీమిండియాకు చిన్న టీమ్స్‌తోనే పోటీ ఎదురైంది. ఒక్క పాకిస్థాన్‌ పెద్ద టీమ్‌గా ఉన్న పెద్దగా పోటీ ఇవ్వలేదు. అయితే.. సూపర్‌ 8లో మాత్రం భారత జట్టుకు గట్టి పోటీ ఎదురవ్వనుంది. ఎందుకంటే.. సూపర్‌లో టీమిండియా రెండు డేంజరస్‌ టీమ్స్‌తో ఆడనుంది. మరి ఆ టీమ్స్‌ ఏవి? అందులో ఏ టీమ్స్‌తో మనకు ముప్పు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

సూపర్‌ 8లో టీమిండియా మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడనుంది. జూన్‌ 20న ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. గ్రూప్‌-సీ నుంచి ఇప్పటికే వెస్టిండీస్‌ సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోయింది. రెండో టీమ్‌గా ఆఫ్ఘనిస్థాన్‌ ఉండే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. గ్రూప్‌-సీ నుంచి సీ2 హోదా వెస్టిండీస్‌కు ఇవ్వడంతో.. గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఆఫ్ఘాన్‌ తొలి స్థానంలో నిలిచినా, రెండో స్థానంలో నిలిచినా దాన్ని సీ1 టీమ్‌గానే పరిగణిస్తారు. ఇక జూన్‌ 22న గ్రూప్‌-డీలో రెండో స్థానంలో నిలిచే టీమ్‌తో టీమిండియా మ్యాచ్‌ ఆడనుంది. గ్రూప్‌-డీ నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా క్వాలిఫై అయిపోయింది. రెండో స్థానం కోసం బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రెండు టీమ్స్‌లో ఏదో ఒక టీమ్‌తో టీమిండియా తమ రెండో సూపర్‌ 8 మ్యాచ్‌ను ఆడనుంది. ఇక మూడో సూపర్‌ 8 మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడతుంది.

తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి ఎవరనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాకపోయినా.. జూన్‌ 24న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ సెట్‌ అయిపోయింది. గ్రూప్‌-బీ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే క్వాలిఫై అయింది. ఆ జట్టు ఏ స్థానంలో ఉన్నా కూడా దాన్ని బీ2గా పరిగణిస్తారు. ఆ లెక్కన ఇండియా, ఆస్ట్రేలియా సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోవడంతో జూన్‌ 24న సెయింట్‌ లుసికాలోని డారెన్‌ సామి నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే.. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఇండియాకు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ రెండు జట్లు టీ20ల్లో ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఈ సూపర్‌ 8 మ్యాచ్‌లన్ని వెస్టిండీస్‌లోనే జరుగుతాయి. అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. దీంతో.. ఆఫ్ఘాన్‌తో కూడా తమకు చాలా డేంజర్‌ పొంచి ఉంది. ఆసీస్‌ ఎలాగో బలమైన ప్రత్యర్థి. మరి ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిస్తే.. సెమీ ఫైనల్‌ చేరినట్లే. మరి టీమిండియా సూపర్‌ 8 మ్యాచ్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి