Nidhan
ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ముగిసింది. అయితే ఇక్కడితో ఐసీసీ టోర్నీలు అయిపోలేదు. వచ్చే మూడేళ్లలో ఏకంగా 7 బడా ఈవెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటైన ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పాటు ఇంకా ఏయే టోర్నీలకు ఇండియా హోస్ట్ కంట్రీగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ముగిసింది. అయితే ఇక్కడితో ఐసీసీ టోర్నీలు అయిపోలేదు. వచ్చే మూడేళ్లలో ఏకంగా 7 బడా ఈవెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటైన ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పాటు ఇంకా ఏయే టోర్నీలకు ఇండియా హోస్ట్ కంట్రీగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ప్రస్తుతం అన్ని క్రికెట్ టీమ్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ షెడ్యూల్ అలా ఉంది. దాదాపుగా ప్రతి జట్టు ఏదో ఒక సిరీస్‌లో ఆడుతూ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ రూపంలో ప్రేక్షకులకు మస్తు వినోదం అందింది. అయితే ఇక్కడితే అయిపోలేదు. వచ్చే మూడేళ్లలో ఏకంగా 7 బడా ఈవెంట్స్ జరగనున్నాయి. అందులో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నీలు ఐదు ఉండటం విశేషం. వీటితో పాటు రెండు ఆసియా కప్‌లు కూడా జరగనున్నాయి. ఒక ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మిగతా ఆసియా కప్‌తో పాటు ఇతర ఐసీసీ టోర్నీలు ఎక్కడ జరగనున్నాయి? హోస్ట్ నేషన్స్ ఏవి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నమెంట్‌కు దాయాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతా కారణాలు, సరిహద్దు వివాదాల కారణంగా అక్కడ ఆడమని భారత్ అంటోంది. దీనిపై ఐసీసీ తేల్చేదాకా ఏ విషయమూ చెప్పలేం. ఇక, వచ్చే ఏడాది మరో ఐసీసీ ఈవెంట్ జరగనుంది. అదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. దీనికి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2025లో మరో కీలక టోర్నమెంట్ జరగనుంది. అదే ఆసియా కప్. భారత్ హోస్ట్‌గా ఉన్న ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరగనుంది. ఆ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం 34 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనిపై తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
2026లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్-2027 ఎక్కడ జరుగుతుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై ఐసీసీ స్పష్టత ఇచ్చే దాకా ఏదీ చెప్పలేం. అదే ఏడాది జరిగే ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ హోస్ట్‌గా ఉండనుంది. ఈ టోర్నీని వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఇక, వన్డే ప్రపంచ కప్-2027కు ఆఫ్రికా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా హోస్ట్ కంట్రీస్‌గా ఉంటాయి. మరి.. ఇందులో ఏ టోర్నీ కోసం మీరు ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.
The host of major Cricket events in Men’s till 2027:
Champions Trophy – Pakistan
WTC final – England
Asia Cup – India (T20I)
T20I WC – India & Sri Lanka
WTC final – Yet to be Decided
Asia Cup – Bangladesh (ODI)
ODI WC – South Africa, Zimbabwe & Namibia. pic.twitter.com/HHW80N6R0r— Johns. (@CricCrazyJohns) July 29, 2024