iDreamPost
android-app
ios-app

Ravi Bishnoi: గెలిచినా, ఓడినా అది మాత్రం మారదు.. బిష్ణోయ్ పోస్ట్ వాళ్లను ఉద్దేశించా?

  • Published Jul 29, 2024 | 5:22 PM Updated Updated Jul 29, 2024 | 5:22 PM

టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఇప్పుడు జోరు మీదున్నాడు. లంకతో టీ20 సిరీస్​లో సూపర్బ్​గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు బిష్ణోయ్.

టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఇప్పుడు జోరు మీదున్నాడు. లంకతో టీ20 సిరీస్​లో సూపర్బ్​గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు బిష్ణోయ్.

  • Published Jul 29, 2024 | 5:22 PMUpdated Jul 29, 2024 | 5:22 PM
Ravi Bishnoi: గెలిచినా, ఓడినా అది మాత్రం మారదు.. బిష్ణోయ్ పోస్ట్ వాళ్లను ఉద్దేశించా?

టీమిండియా మరో సిరీస్​ను సొంతం చేసుకుంది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది సూర్య సేన. ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. పతుమ్ నిస్సంక (32), కుశాల్ పెరీరా (53) సత్తా చాటారు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి మద్దతు దొరక్కపోవడంతో ఆ టీమ్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆ తర్వాత మెన్ ఇన్ బ్లూ ఛేజింగ్ చేసే టైమ్​లో వర్షం పడటంతో మ్యాచ్​ను కుదించారు. భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78గా సెట్ చేశారు.

కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలోకి దిగిన టీమిండియా 6.3 ఓవర్లలోనే 81 పరుగులు చేసి ఛేజ్ కంప్లీట్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30) మరోమారు కీలక ఇన్నింగ్స్​తో మెరిశాడు. సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26) కెప్టెన్సీ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22) కసిగా భారీ షాట్లు బాది మ్యాచ్​ను త్వరగా ముగించాడు. జైస్వాల్, సూర్య రాణించినా.. బౌలింగ్​లో 3 కీలక వికెట్లతో లంక భారీ స్కోరు చేయకుండా అడ్డుపడిన స్పిన్నర్ రవి బిష్ణోయ్​కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. అయితే మ్యాచ్ ముగిశాక బిష్ణోయ్ ఇన్​స్టాగ్రామ్​లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడు వాళ్లను ఉద్దేశించే ఇది పెట్టాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

లంకతో సిరీస్​ను 2-0తో గెలవడంతో సంతోషంలో మునిగిపోయిన స్పిన్నర్ బిష్ణోయ్ ఇన్​స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. యాటిట్యూడ్ ఉండాలని.. అది మనల్ని సక్సెస్ దిశగా నడిపిస్తుందని అందులో రాసుకొచ్చాడు. గెలిచినా, ఓడినా యాటిట్యూడ్​ను వదలొద్దనే అర్థం వచ్చేలా అతడి పోస్ట్ ఉంది. గత కొన్నేళ్లుగా భారత టీ20 జట్టులో రెగ్యులర్ ప్లేయర్​గా ఉంటున్న బిష్ణోయ్ వికెట్ల మీద వికెట్లు తీస్తూ టీమ్ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అయినా అతడికి టీ20 వరల్డ్ కప్-2024 టీమ్​లో చోటు దక్కలేదు. అందుకే తాజాగా అతడీ విధంగా పోస్ట్ పెట్టాడని నెటిజన్స్ అంటున్నారు. ఏదేమైనా యాటిట్యూడ్​ను వదలనంటూ సెలెక్టర్లకు కౌంటర్​గా అతడు ఈ పోస్ట్ పెట్టాడని చెబుతున్నారు. మరి.. బిష్ణోయ్ పోస్ట్ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.