iDreamPost
android-app
ios-app

ఫైనల్​కు టీమిండియా.. కన్నీళ్లు తెప్పిస్తున్న సిరాజ్ ఇన్​స్టాగ్రామ్ స్టోరీ!

  • Author singhj Updated - 04:04 PM, Sat - 18 November 23

నాకౌట్ మ్యాచ్​లో న్యూజిలాండ్​ను ఓడించి భారత్ వరల్డ్ కప్​లో ఫైనల్​ బెర్త్​ను ఖాయం చేసుకుంది. దీంతో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇన్​స్టాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

నాకౌట్ మ్యాచ్​లో న్యూజిలాండ్​ను ఓడించి భారత్ వరల్డ్ కప్​లో ఫైనల్​ బెర్త్​ను ఖాయం చేసుకుంది. దీంతో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇన్​స్టాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

  • Author singhj Updated - 04:04 PM, Sat - 18 November 23
ఫైనల్​కు టీమిండియా.. కన్నీళ్లు తెప్పిస్తున్న సిరాజ్ ఇన్​స్టాగ్రామ్ స్టోరీ!

అద్భుతం.. వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా ఆటతీరును వర్ణించడానికి ఈ పదం కూడా సరిపోదు. లీగ్ స్టేజ్​లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నెగ్గిన భారత జట్టు.. నాకౌట్ మ్యాచ్​లో న్యూజిలాండ్​కు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చింది. గత రికార్డుల భయం వెంటాడుతున్నా, తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్నా సెమీస్​ మ్యాచ్​లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఛాంపియన్​లా ఆడుతూ కివీస్​కు తన రియల్ పవర్ చూపించింది రోహిత్ సేన. ఈ మ్యాచ్ ఎన్నో రికార్డులకు వేదికైంది. వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. తన పెర్ఫార్మెన్స్​పై వస్తున్న సందేహాలకు మరోమారు బ్యాట్​తో చెలరేగి సమాధానం ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్.

కసితో, బాల్​ను మరింత పదునెక్కిస్తూ న్యూజిలాండ్ బ్యాటింగ్ యూనిట్​ను ఒంటిచేత్తో కుప్పకూల్చాడు పేసర్ మహ్మద్ షమి. న్యూజిలాండ్​తో జరిగిన నాకౌట్ పోరులో రోహిత్ సేన 70 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. విరాట్ కోహ్లీ (117), శ్రేయస్ అయ్యర్ (105) సెంచరీలతో విరుచుకుపడటంతో టీమిండియా 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు శుబ్​మన్ గిల్ (80 నాటౌట్), రోహిత్ శర్మ (47)తో పాటు కేఎల్ రాహుల్ (39 నాటౌట్) కూడా అదరగొట్టారు. కొండంత టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన విలియమ్సన్ సేన షమి దెబ్బకు విలవిల్లాడింది. ఓపెనర్లు డెవిన్ కాన్వే (13), రచిన్ రవీంద్ర (13)ను షమి త్వరగానే పెవిలియన్​కు పంపాడు.

కివీస్ 39 రన్స్​కే రెండు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్​కు వచ్చిన డారిల్ మిచెల్ (134).. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (69) అండతో ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు. ముఖ్యంగా మిచెల్ భారీ షాట్లు కొడుతూ భారత్​కు చెమటలు పట్టించాడు. వీళ్లిద్దరి దెబ్బకు ఆ టీమ్ 31 ఓవర్లలో 213 రన్స్ చేసింది. విలియమ్సన్, మిచెల్ క్రీజులో పాతుకుపోవడంతో మ్యాచ్ టీమిండియా నుంచి చేజారుతున్నట్లు కనిపించింది. కానీ సెకండ్ స్పెల్​ వేసేందుకు వచ్చిన షమి భారత్​ను ఆదుకున్నాడు. కేన్ మామతో పాటు టామ్ లేథమ్​ను ఒకే ఓవర్లో ఔట్ చేసి మ్యాచ్​ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత వచ్చిన ఫిలిప్స్ (41) చెలరేగాడు. మిచెల్ కూడా సెంచరీతో భయపెట్టాడు. అయితే వరుసగా వికెట్లు తీస్తూ పోయిన మన బౌలర్లు టీమ్​కు అద్భుత విజయాన్ని కట్టబెట్టారు.

టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్​కు చేరుకోవడంతో ప్రేక్షకులు, ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఇన్​స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈ టైమ్​లో తన తండ్రి నుంచి కాల్ వచ్చుంటే ఎంతో బాగుండేదని.. ఆయన్ను ఎంతో మిస్ అవుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు సిరాజ్. అతడి తండ్రి మహ్మద్ గౌస్ మూడేళ్ల కింద కన్నుమూశారు. ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మృతి చెందారు. అయితే తండ్రిని ఎంతో ఇష్టపడే సిరాజ్​.. ఈ సమయంలో ఆయన ఉంటే ఎంతో బాగుండేదని తన పోస్ట్​లో చెప్పకనే చెప్పాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్.. ఒకవేళ సిరాజ్ తండ్రి గనుక ఉంటే కొడుకు ఘనతను చూసి ఎంతో గర్వపడేవారని అంటున్నారు. సిరాజ్ పోస్ట్ కన్నీళ్లు తెప్పిస్తోందని.. తండ్రిపై అతడికి ఉన్న ప్రేమ అద్భుతమని అంటున్నారు.

షమీ లైఫ్ స్టోరీ – ఈ వీడియో కూడా చుడండి