iDreamPost
android-app
ios-app

దులీప్ ట్రోఫీలో శుబ్​మన్ గిల్ టీమ్ ఓటమి.. కెప్టెన్ సహా స్టార్లంతా ఫెయిల్!

  • Published Sep 08, 2024 | 4:45 PM Updated Updated Sep 08, 2024 | 7:53 PM

Duleep Trophy 2024, IND B vs IND A, Shubman Gill: దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్​లో ఓటమిపాలైంది శుబ్​మన్ గిల్ టీమ్. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా బీ చేతుల్లో గిల్ సేన మట్టికరిచింది. కెప్టెన్ సహా స్టార్లంతా విఫలమవడం టీమ్​కు శాపంగా మారింది.

Duleep Trophy 2024, IND B vs IND A, Shubman Gill: దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్​లో ఓటమిపాలైంది శుబ్​మన్ గిల్ టీమ్. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా బీ చేతుల్లో గిల్ సేన మట్టికరిచింది. కెప్టెన్ సహా స్టార్లంతా విఫలమవడం టీమ్​కు శాపంగా మారింది.

  • Published Sep 08, 2024 | 4:45 PMUpdated Sep 08, 2024 | 7:53 PM
దులీప్ ట్రోఫీలో శుబ్​మన్ గిల్ టీమ్ ఓటమి.. కెప్టెన్ సహా స్టార్లంతా ఫెయిల్!

దులీప్ ట్రోఫీ-2024 ఓపెనింగ్ మ్యాచ్​లో ఓటమిపాలైంది శుబ్​మన్ గిల్ టీమ్. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా బీ చేతుల్లో గిల్ సేన మట్టికరిచింది. కెప్టెన్ సహా స్టార్లంతా విఫలమవడం ఇండియా-ఏకు శాపంగా మారింది. 275 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆ జట్టు 198 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (121 బంతుల్లో 57) మినహా మిగతా బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ శుబ్​మన్ గిల్ (21) సహా రియాన్ పరాగ్ (31), ధృవ్ జురెల్ (0), శివమ్ దూబె (14), మయాంక్ అగర్వాల్ (3) ఇలా అందరూ చేతులెత్తేశారు. దీంతో 76 పరుగుల తేడాతో ఆ టీమ్​కు ఓటమి తప్పలేదు.

ఛేజింగ్​కు దిగిన ఇండియా ఏకు సరైన స్టార్ట్ దొరకలేదు. మయాంక్ అగర్వాల్ రెండో ఓవర్​లోనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్-పరాగ్ జోడీ రెండో వికెట్​కు 44 పరుగులు జోడించారు. కానీ తక్కువ వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్​కు చేరుకున్నారు. ఫోర్త్ డౌన్​లో బ్యాటింగ్​కు దిగిన రాహుల్ ఫైటర్​లా పోరాడాడు. ఇండియా బీ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. సాలిడ్ డిఫెన్స్​తో చుక్కలు చూపించాడు. ఒకవైపు జురెల్, తనుష్ కోటియన్ (0) ఔట్ అయినా రాహుల్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. టెయిలెండర్ కుల్దీప్ యాదవ్ (14)తో కలసి ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు రాహుల్. ఇద్దరూ కలసి ప్రత్యర్థి బౌలర్లను చాలా సేపు విసిగించారు. అయితే కీలక టైమ్​లో కేఎల్ ఔట్ అవడంతో ఇండియా ఏ ఆశలు అవిరయ్యాయి. ఆ తర్వాత కుల్దీప్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ అండతో ఆకాశ్ దీప్ (42 బంతుల్లో 43) కాసేపు మెరుపులు మెరిపించాడు.

క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లతో విధ్వంసం సృష్టించాడు ఆకాశ్​దీప్. 3 బౌండరీలు కొట్టిన అతడు.. 4 భారీ సిక్సులు బాదాడు. ఆఖరి వికెట్​గా అతడు వెనుదిరిగాడు. ఇక, తొలి ఇన్నింగ్స్​లో భారీ సెంచరీతో మ్యాచ్​కు డిసైడింగ్ ఫ్యాక్టర్​గా మారిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్​లో 182 పరుగులు బాదిన ఈ యంగ్ సెన్సేషన్.. సెకండ్ ఇన్నింగ్స్​లో 12 పరుగులు చేశాడు. అతడు ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఇక, ఈ మ్యాచ్​లో ఇండియా ఏ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల ఫెయిల్యూర్ అనే చెప్పాలి. కేఎల్ రాహుల్ మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా అంచనాలను అందుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో 37 పరుగులు చేసిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్​లో 57 పరుగులు చేశాడు. అతడికి మిగతా వారి నుంచి సపోర్ట్ అంది ఉంటే ఇండియా ఏ అలవోకగా విజయతీరాలకు చేరేది.

Shubman Gill's team lost in Duleep Trophy 2