iDreamPost
android-app
ios-app

Akash Deep: దులీప్ ట్రోఫీలో 9 వికెట్లతో దుమ్మురేపిన ఆకాశ్​దీప్.. టీమిండియాలో ప్లేస్ పక్కా!

  • Published Sep 08, 2024 | 2:08 PM Updated Updated Sep 08, 2024 | 2:08 PM

Akash Deep Nine Wickets Haul In Duleep Trophy 2024: యంగ్ పేసర్ ఆకాశ్​దీప్ దులీప్ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఏకంగా 9 వికెట్లు పడగొట్టి తన దమ్ము ఏంటో మరోమారు చూపించాడు. తన బౌలింగ్ రేంజ్ ఏంటనేది ఇంకోసారి ప్రూవ్ చేశాడు.

Akash Deep Nine Wickets Haul In Duleep Trophy 2024: యంగ్ పేసర్ ఆకాశ్​దీప్ దులీప్ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఏకంగా 9 వికెట్లు పడగొట్టి తన దమ్ము ఏంటో మరోమారు చూపించాడు. తన బౌలింగ్ రేంజ్ ఏంటనేది ఇంకోసారి ప్రూవ్ చేశాడు.

  • Published Sep 08, 2024 | 2:08 PMUpdated Sep 08, 2024 | 2:08 PM
Akash Deep: దులీప్ ట్రోఫీలో 9 వికెట్లతో దుమ్మురేపిన ఆకాశ్​దీప్.. టీమిండియాలో ప్లేస్ పక్కా!

దులీప్ ట్రోఫీ-2024లో సంచలనాలు కొనసాగుతున్నాయి. బాగా ఆడుతారని అనుకున్న స్టార్ ప్లేయర్లు దారుణంగా ఫ్లాప్ అవుతున్నారు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అద్భుతమైన ఆటతీరుతో స్టార్లకు షాక్ ఇస్తున్నారు. ఈ టోర్నీలో పెద్దగా ఎక్స్​పెక్టేషన్స్ లేకుండా గ్రౌండ్​లోకి దిగిన ఓ పేస్ బౌలర్ ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. అతడు ఆకాశ్​దీప్. ఇండియా ఏ తరఫున ఆడుతున్న ఈ స్పీడ్​స్టర్ రెండు ఇన్నింగ్స్​లో కలిపి తొమ్మిది వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్.. సెకండ్ ఇన్నింగ్స్​లో 5 వికెట్స్ హాల్​ను పూర్తి చేశాడు. ఇండియా బీ బ్యాటర్లను అతడు ముప్పుతిప్పలు పెట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లాంటి స్టార్లను అతడు ఔట్ చేశాడు.

సెకండ్ ఇన్నింగ్స్​లో మరింతగా రెచ్చిపోయాడు ఆకాశ్​దీప్. ఇండియా బీ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్​తో పాటు సెంచరీ హీరో ముషీర్​ ఖాన్​ను పెవిలియన్​కు పంపించాడు. అలాగే వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, నవ్​దీప్ సైనీని కూడా అతడే ఔట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్​లో అద్భుతమైన స్పెల్స్​తో రెచ్చిపోయిన ఈ పేసర్ 14 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 మెయిడిన్లు కూడా ఉన్నాయి. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​లో బంతులు వేస్తూ బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు. మంచి పేస్​, రిథమ్​తో బౌలింగ్ చేస్తూనే వేరియేషన్స్ కూడా యూజ్ చేస్తూ పోయాడు. బ్రేక్ త్రూ కావాలనుకున్న ప్రతిసారి కెప్టెన్ శుబ్​మన్ గిల్ అతడికే బాల్ ఇచ్చాడు. ఆకాశ్ కూడా సారథి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన బెస్ట్ ఇస్తూ పోయాడు. ప్రత్యర్థి టీమ్​ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆకాశ్​దీప్ చెలరేగడంతో ఇండియా బీ రెండో ఇన్నింగ్స్​లో 184 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఆ టీమ్ లీడ్ 275 పరుగులు చేరుకుంది. ఆ తర్వాత ఛేజింగ్ స్టార్ట్ చేసిన ఇండియా ఏ ఇప్పుడు 6 వికెట్లకు 106 పరుగులతో ఉంది. కేఎల్ రాహుల్ (34 నాటౌట్), కుల్దీప్ యాదవ్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. రాహుల్ మీదే ఆ టీమ్ ఆశలన్నీ ఉన్నాయి. అతడు ఔట్ అయితే మ్యాచ్ కష్టమే. రాహుల్​కు కుల్దీప్ ఎంతవరకు సపోర్ట్‌ అందిస్తాడో చూడాలి. ఇక, ఈ మ్యాచ్​లో ఆకాశ్​దీప్ బౌలింగ్ చేసిన తీరును అంతా మెచ్చుకుంటున్నారు. అతడి బౌలింగ్ సూపర్ అని.. దీన్నే కంటిన్యూ చేయాలని కోరుకుతున్నారు. ఆల్రెడీ ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​తో డెబ్యూ ఇచ్చిన ఈ పేసర్​ను బంగ్లాదేశ్​ సిరీస్​లో టీమ్​లోకి తీసుకోవడం పక్కా అని చెబుతున్నారు. సెలెక్టర్లు అతడి బౌలింగ్​కు ఫిదా అవడం ఖాయం అంటున్నారు. మరి.. ఆకాశ్​దీప్ భారత జట్టులోకి వస్తాడా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.