iDreamPost
android-app
ios-app

ఆ ఇద్దరి కెరీర్ ఖతం.. టీమిండియాలో కొనసాగడం ఇక కష్టమే!

Team India: టీమిండియా అద్ధుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా కుర్రాళు దూసుకుపోతున్నారు. కానీ, ఇద్దరు మాత్రం తమ కెరీర్లను ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు.

Team India: టీమిండియా అద్ధుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా కుర్రాళు దూసుకుపోతున్నారు. కానీ, ఇద్దరు మాత్రం తమ కెరీర్లను ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు.

ఆ ఇద్దరి కెరీర్ ఖతం.. టీమిండియాలో కొనసాగడం ఇక కష్టమే!

టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కీలక మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇంకో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో టెస్టు సిరీస్ ని కైవసం చేసుకుంది. ఈసారి రోహిత్ సేన అద్భుతాలు సృష్టించిందనే చెప్పాలి. ఒకరు విఫలమైతే ఆ బాధ్యతను మరొకరు తీసుకుని సమష్టి కృషితో ఈ మ్యాచ్ లో విజయం సాధించారు. ముఖ్యంగా ధృవ్ జురెల్ లాంటి కుర్రాళ్లు రాణించడం జట్టుకు శుభ పరిణామం అని చెప్పచ్చు. ఇలాంటి తరుణంలో ఇప్పటికే జట్టులో అవకాశం దక్కించుకున్న ఇద్దరు కుర్రాళ్ల కెరీర్ అగమ్యగోచరంగా మారిపోయింది. జట్టులో వీళ్లు కొనసాగడం కూడా కష్టమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈ నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం నమోదు చేసింది. నిజానికి ఇది అంత ఈజీ విజయం అయితే కాదు. ఈ టెస్టులో కోహ్లీ లేడు, షమీ లేడు, కేఎల్ రాహుల్ కూడా లేడు. కానీ, రోహిత్ సేన మాత్రం అద్భుతం చేసి చూపించింది. ఈ జైశ్వాల్, గిల్, ధృవ్ జురెల్ వంటి కుర్రాళ్లు ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో సీనియర్లతో కూడా శభాష్ అంటూ ప్రసంశలు పొందారు. అయితే ఇదే టీమ్ లో అవకాశాల మీద అవకాశాలు దక్కించుకున్న ఇద్దరు కుర్రాళ్లు మాత్రం నిరాశ పరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్లు అసలు జట్టులో కొనసాగే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు కూర్రాళ్లు మరెవరో కాదు.. రజత్ పాటిదార్, కేఎస్ భరత్.

అవును ఇప్పుడు ఈ ఇద్దరు కుర్రాళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. వచ్చిన అన్ని అవకాశాలను పాడు చేసుకున్నారు. ధృవ్ జురెల్ లాంటి కుర్రాళ్లు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా దూసుకుపోతుంటే.. పటిదార్, భరత్ మాత్రం తీవ్ర నిరాశకు గురి చేస్తూనే వచ్చారు. రజత్ పటిదార్ విషయానికి వస్తే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తనదైనశైలిలో దూసుకుపోయాడు. కెరీర్ లో అదభుతంగా రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఆటతోనే ఇప్పుడు టీమిండియా జట్టులోకి వచ్చేశాడు. కానీ, వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఈ నాలుగో టెస్టులో కూడా రజత్ పటిదార్ అంతంత మాత్రం ప్రదర్శనతో నిరాశ పరిచాడు.

ఇంక తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ విషయానికి వస్తే.. అతనికి వచ్చిన అవకాశాలు ఇంకెవరికీ రాలేదు అనచ్చు. 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు. అక్కడ కూడా సోసోగానే ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఓవైపు జైస్వాల్, గిల్, జురెల్, సర్ఫరాజ్ ఖాన్ అంటూ కుర్రాళ్లు అంతా దూసుకుపోతుంటే.. పటిదార్, భరత్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఇలా జట్టులో పెరుగుతున్న పోటీతో వీళ్లిద్దరు ఇంక టీమిండియా జట్టులో కొనసాగడం దాదాపుగా అసాధ్యం అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. కేఎస్ భరత్, రజత్ పటిదార్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.