iDreamPost
android-app
ios-app

నాలుగో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. విజయానికి 5 కారణాలు!

  • Published Feb 26, 2024 | 2:42 PMUpdated Feb 26, 2024 | 5:42 PM

రాంచీ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్​లో పోరాడి గెలించింది. ఈ నేపథ్యంలో భారత్ విజయానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రాంచీ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్​లో పోరాడి గెలించింది. ఈ నేపథ్యంలో భారత్ విజయానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 26, 2024 | 2:42 PMUpdated Feb 26, 2024 | 5:42 PM
నాలుగో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. విజయానికి 5 కారణాలు!

నాలుగో టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించింది. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్, ఆకాశ్ దీప్.. ఇలా సగానికి పైగా జట్టులో యంగ్​స్టర్సే​ ఉన్నారు. అయినా సరే పటిష్టమైన ఇంగ్లండ్​ను మట్టికరిపించింది భారత్. రాంచీ టెస్టులో 5 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేసింది. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్​లో శుబ్​మన్ గిల్, ధృవ్ జురెల్ మొక్కవోని పోరాటంతో టీమ్​కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ 3-1 తేడాతో మరో మ్యాచ్ ఉండగానే టెస్ట్ సిరీస్​ను సొంతం చేసుకుంది. ఇది పక్కా యంగ్​స్టర్స్ విజయమనే చెప్పాలి. ఈ మ్యాచ్​లో మన టీమ్ నెగ్గడానికి గల 5 కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బౌలింగ్
రాంచీ టెస్టులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ సెలక్ట్ చేసుకున్నాడు. అయితే ఆ జట్టును మన బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. జో రూట్ (122 నాటౌట్), ఓలీ రాబిన్సన్ (58) ఇన్నింగ్స్​ తీసేస్తే ఇంగ్లీష్ బ్యాటర్లను మన బౌలర్లు కంప్లీట్​గా కట్టిపడేశారు. అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ 3 వికెట్లతో ఇంగ్లండ్ టాపార్డర్​ను కూల్చాడు. రవీంద్ర జడేజా (4 వికెట్లు), మహ్మద్ సిరాజ్ (2 వికెట్లు) ఆ జట్టు పతనాన్ని శాసించారు. బౌలర్లు రాణించకపోతే ప్రత్యర్థి టీమ్ భారీ స్కోరు సాధించేది. వారిని మన బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్​లో బౌలర్లు రాణించబట్టే ఇంగ్లండ్ 145 పరుగులకే ఆలౌట్ అయింది. అందుకే ఈ మ్యాచ్​లో గెలుపునకు బౌలింగ్ ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు.

యశస్వి జైస్వాల్
భారత జట్టు తొలి ఇన్నింగ్స్​లో 307 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (73), ధృవ్ జురెల్ (90) సూపర్బ్ నాక్స్​తో అదరగొట్టారు. జైస్వాల్ ఆడిన తీరు, ఇన్నింగ్స్​ను నడిపించిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. రెండో ఇన్నింగ్స్​లోనూ అతడు 37 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. పెద్దగా ఎక్స్​పీరియెన్స్ లేకపోయినా అతడు మంచి స్టార్ట్​లు ఇస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాలుగో టెస్టులో భారత్ విక్టరీ కొట్టడంలో జైస్వాల్ కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది. గనుక విజయానికి అతడూ ఒక కారణమే.

ధృవ్ జురెల్
కేవలం ఒకే ఒక టెస్టు ఆడిన అనుభవం ఉన్న ధృవ్ జురెల్ రాంచీ టెస్టులో అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్​లో 90 పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్​లో 39 పరుగుల విలువైన ఇన్నింగ్స్​తో మెరిశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమ్​ను అతడు 300 పరుగుల మార్క్​ను దాటించాడు. దీని వల్ల ఇంగ్లండ్ లీడ్ తగ్గింది. రెండో ఇన్నింగ్స్​లో గిల్​తో కలసి 72 పరుగుల పార్ట్​నర్​షిప్​ను జోడించాడు. ఈ మ్యాచ్​ గెలుపులో ఎక్కువ క్రెడిట్ జురెల్​కు దక్కుతుంది. బ్యాటింగ్​లో అతడు చూపించిన టెంప్రమెంట్, పేషెన్స్ గురించి ఎంత పొగిడినా తక్కువే.

రోహిత్ శర్మ
టెస్టుల్లో రోహిత్ పనికిరాడు.. అతడు సరిగ్గా కెప్టెన్సీ చేయడం లేదనే విమర్శలకు ఈ మ్యాచ్, సిరీస్ విజయం చెంపపెట్టు లాంటిదనే చెప్పాలి. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఫెయిలైనా సెకండ్ ఇన్నింగ్స్​లో 55 పరుగులు విలువైన ఇన్నింగ్స్ ఆడాడు హిట్​మ్యాన్. బ్యాటింగ్​కు కష్టంగా మారిన పిచ్ మీద ధనాధన్ ఇన్నింగ్స్​తో ఇంగ్లండ్​ను బ్యాక్ సీట్​లోకి నెట్టాడు. కెప్టెన్​గా రెండు సార్లు ఇంగ్లీష్ టీమ్​ను ఆలౌట్ చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. బౌలర్లతో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూ, సూచనలు ఇస్తూ, డీఆర్ఎస్ విషయంలోనూ అండగా ఉంటూ రిజల్ట్ రాబట్టాడు. కాబట్టి భారత విజయంలో ప్రధాన కారణాల్లో రోహిత్ బ్యాటింగ్, కెప్టెన్సీ ఒకటని చెప్పొచ్చు.

రవిచంద్రన్ అశ్విన్
రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​ 145 పరుగులకే కుప్పకూలింది. దీనికి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అతడు 5 వికెట్లతో ఇంగ్లీష్ టీమ్ వెన్ను విరిచాడు. డకెట్, పోప్, రూట్, ఫోక్స్ లాంటి కీలక బ్యాటర్లను ఔట్ చేసి ప్రత్యర్థిని చావుదెబ్బ తీశాడు. అశ్విన్ అనుభవం ఇతర బౌలర్లకు కూడా కలిసొచ్చింది. అతడు బౌలింగ్​ యూనిట్​ను ముందుండి నడపడం వల్లే ఇంగ్లండ్​ను తక్కువ స్కోరుకే రెండుసార్లు ఆలౌట్ చేయగలిగాం. కాబట్టి భారత్ విక్టరీకి గల కారణాల్లో అశ్విన్ కూడా ఒకడని చెప్పొచ్చు. వీళ్లతో పాటు ఒక ఇన్నింగ్స్​లో 38, మరో ఇన్నింగ్స్​లో 52 పరుగులు చేసిన గిల్​ కూడా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా బౌలర్లు, బ్యాటర్లు.. ఇలా టీమ్ మొత్తం పెట్టిన ఆల్​రౌండ్ ఎఫర్ట్ వల్లే జట్టు నెగ్గింది. మరి.. రోహిత్ సేన విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: సెల్యూట్ కొట్టి మరీ సెలబ్రేషన్! జురెల్ అలా ఎందుకు చేశాడంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి