Nidhan
IND vs BAN, Kanpur Pitch Report: ఫస్ట్ టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. రెండో ఛాలెంజ్‌కు రెడీ అవుతోంది. కాన్పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.
IND vs BAN, Kanpur Pitch Report: ఫస్ట్ టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. రెండో ఛాలెంజ్‌కు రెడీ అవుతోంది. కాన్పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.
Nidhan
ఓడించి తీరతామంటూ తమను రెచ్చగొట్టిన బంగ్లాదేశ్ బెండు తీసింది భారత్. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. ఏకంగా 280 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. మళ్లీ మనతో పెట్టుకోవాలంటే భయపడేలా చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలోనూ రోహిత్ సేన ముందు నిలబడలేకపోయింది బంగ్లాదేశ్. ఈ గెలుపును ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు రెండో టెస్ట్‌పై ఫోకస్‌ను షిఫ్ట్ చేశారు. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27వ తేదీన మొదలవనుందీ మ్యాచ్. దీంతో ఈ పిచ్ ఎలా ఉంటుంది? చెన్నై వికెట్లాగే ఉంటుందా? మార్పులు చేస్తారా? ఎవరికి అనుకూలం? లాంటి డిస్కషన్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కాన్పూర్ పిచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బంగ్లాదేశ్‌కు షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్పిన్ ఫ్రెండ్లీగా ఉన్న చెన్నై వికెట్‌ను పేస్ పిచ్‌గా మార్చారు. అందుకు తగ్గట్లే ఆ టెస్ట్‌లో తొలి రెండ్రోజులు పేస్ బౌలింగ్‌కు చక్కటి హెల్ప్ దొరికింది. అయితే కాన్పూర్‌లో మాత్రం స్లో వికెట్‌ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. పూర్తిగా నల్లమట్టితో వికెట్‌ను తయారు చేస్తున్నారని సమాచారం. కాస్త ఫ్లాట్‌గా ఉండే ఈ ట్రాక్ మీద మొదట్లో పరుగులు ఈజీగా వచ్చినా.. ఆ తర్వాత స్పిన్ డామినేషన్ మొదలవుతుందట. స్పిన్నర్లు పండుగ చేసుకునేలా ఈ ట్రాక్‌ను రూపొందిస్తున్నారని వినిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలని డిసైడ్ అయిందట. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కేవలం ఒకే మార్పు జరగనుందని తెలుస్తోంది.
చెన్నై టెస్ట్‌లో ఆడిన పేసర్ ఆకాశ్‌దీప్‌కు బదులు చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను కాన్పూర్ టెస్ట్‌లో బరిలోకి దింపనున్నారని సమాచారం. ఇప్పటికే అతడికి ఈ మాట చెప్పి, తీవ్రంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ పిచ్‌తో టీమిండియాకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఒకవేళ స్పిన్ వికెట్ అయితే భారత్ డేంజర్లో పడుతుంది. ఎందుకంటే షకీబ్ అల్ హసన్, మెహ్దీ హసన్ మిరాజ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లతో బంగ్లా టీమ్ బలంగా ఉంది. మరోవైపు స్పిన్‌ను ఎదుర్కోవడంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఇబ్బందులు ఇంకా పోలేదు.
రోహిత్ శర్మ తప్పితే స్పిన్‌ను ఫేస్ చేయడంలో దాదాపుగా అందరు బ్యాటర్లు స్ట్రగుల్ అవడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాన్పూర్‌లో బంగ్లా విసిరే సవాల్‌కు మనోళ్లు ఎలా అడ్డు నిలుస్తారో చూడాలి. ఇక, కాన్పూర్ గ్రౌండ్ విషయానికొస్తే.. ఇక్కడ ఓవరాల్‌గా 23 టెస్టులు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ 7 సార్లు నెగ్గింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 370గా ఉంది. దీన్ని బట్టి లోస్కోరింగ్ గేమ్‌గా కనిపిస్తోంది. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న టీమ్ గెలుపు పక్కాగా కనిపిస్తోంది. బ్యాటర్ల టెక్నిక్, పేషెన్స్కు ఈ మ్యాచ్ రియల్ టెస్ట్‌గా నిలవబోతున్నట్లు అనిపిస్తోంది.