iDreamPost
android-app
ios-app

నిన్న రింకూని హగ్ చేసుకున్న ఇతను ఎవరు? అంతా ఇతని పుణ్యమే!

టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకుంది. రింకూ సింగ్ అద్భుతమైన ఫినిషింగ్ అందించాడు. అలాగే అతను చివర్లో ఒకరిని హత్తుకున్న ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకుంది. రింకూ సింగ్ అద్భుతమైన ఫినిషింగ్ అందించాడు. అలాగే అతను చివర్లో ఒకరిని హత్తుకున్న ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

నిన్న రింకూని హగ్ చేసుకున్న ఇతను ఎవరు? అంతా ఇతని పుణ్యమే!

వరల్డ్ కప్ ఫైనల్ రివేంజ్ ని విశాఖ వేదికగా టీమిండియా నెరవేర్చుకుంది. ఉత్కంఠ భరిత మ్యాచ్ లో భారత జట్టు అద్భుతవిజయాన్ని అందుకుంది. సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇంక రింకూ సింగ్ మంచి ఫినిఫింగ్ ని అందించాడు. టీమిండియాకు ఒక మంచి విన్నింగ్ ఫినిషర్ దొరికాడనే చెప్పాలి. ఈ మ్యాచ్ పూర్తైన తర్వాత రింకూ సింగ్ ఒక వ్యక్తిని కౌగిలించుకున్నాడు. ఆ పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు ఎవరు అతను? రింకూ సింగ్ కు అతనికి ఏంటి సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు డీకే సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులో సమాధానాలు దొరికాయి.

రింకూ సింగ్ ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ నుంచి వచ్చి కేకేఆర్ కు ఒక మంచి ఫినిషర్ గా ఎదిగాడు. ఇప్పుడు టీమిండియాలో రెగ్యూలర్ ప్లేయర్ అయ్యి.. టీ20 వరల్డ్ కప్ కోసం తయారవుతున్నాడు. అయితే రింకూ సింగ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం.. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తే. అతను మరెవరో కాదు.. టీమిండియా మాజీ ఆటగాడు అభిషేక్ మోహన్ నాయర్. అభిషేక్ టీమిండియాకు ప్రాతనిధ్యం వహించాడు. అలాగే ఐపీఎల్ లో కూడా పలు ఫ్రాంచైజీలకు ఆడాడు. అయితే కేకేఆర్ లో ఉన్నప్పటి నుంచి రింకూ సింగ్ ను అభిషేక్ నాయర్ గైడ్ చేయడం ప్రారంభించాడు. ఆ రోజుల్లోనే రింకూ సింగ్ లో అభిషేక్ ఒక మంచి ఫినిషర్ ని చూశాడు. అతడికి ఒక మెంటర్ గా వ్యవహరించడం ప్రారంభించాడు. ఈ విషయాలను ధినేష్ కార్తిక్ తన పోస్టులో వెల్లడించాడు.

“రింకూ సింగ్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే అందుకు కారణం అభిషేక్ నాయర్. రింకూ సింగ్, అభిషేక్ మధ్య బంధం 2018లో ప్రారంభమైంది. రింకూ సింగ్ కి కొన్ని కఠినమైన పనులు చెప్పి అతడిని గొప్ప ఫినిషర్ అయ్యేలా తీర్చిదిద్దాడు. రింకూకి గాయం అయిన సమయంలో అతడు కేకేఆర్ జట్టులోనే కొనసాగేలా యాజమాన్యాన్ని ఒప్పించాడు. అతనికి గాయం నయంమయ్యే వరకు తన ఇంట్లోని ఉంచుని రింకూని చూసుకున్నాడు. రింకూ సింగ్ రాబోయే రోజుల్లో చెలరేగుతాడు అని అభిషేక్ నాయర్ నాతో చెప్పేవాడు. రింకూ సింగ్ గొప్పగా ఆలోచిస్తే చాలు అని నాయర్ అనుకునేవాడు. అతని ఆలోచనలు అలా ఉండేలా చేసింది అభిషేకే. కేకేఆర్ కోసం రింకూ ఎలా ఆడాలని నాయర్ కోరుకున్నాడో.. రింకూ ఈ ఏడాది అలాగే ఆడాడు. ఈ ఫొటో చూసిన తర్వాత నాయర్ ఒక కోచ్ గా ఎలా ఎదిగాడు అనేది నాకు అర్థమైంది” అంటూ ధినేశ్ కార్తిక్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఇంక రింకూ సింగ్ గేమ్ విషయానికి వస్తే.. జట్టుకు అవసరమైన సమయంలో ఎలా రాణించాలో అతనికి బాగా తెలుసు. ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో వరుసగా 5 సిక్సులు కొట్టి మ్యాచ్ ని ఒంటిచేత్తో గెలిపించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాపై 4 ఫోర్లతో చెలరేగి మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేశాడు. అలాగే ఒక గొప్ప ఫినిషర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రింకూ ఇదే ఫామ్ ని కొనసాగిస్తే మాత్రం కచ్చితంగా టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. రింకూ సింగ్- అభిషేక్ నాయర్ బాండింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.