వరల్డ్ కప్ టైటిల్ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ లో ఫోకస్ మెుత్తం దానిపైనే పెట్టినట్లుగా సమాచారం. మరి హిట్ మ్యాన్ ఆసీస్ కోసం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ టైటిల్ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ లో ఫోకస్ మెుత్తం దానిపైనే పెట్టినట్లుగా సమాచారం. మరి హిట్ మ్యాన్ ఆసీస్ కోసం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. తుది పోరుకు సిద్దమవుతోంది. ఈ మెగాటోర్నీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో పటిష్ట ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. ఆదివారం(నవంబర్ 19న) నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ మెుదలు పెట్టాయి ఇరు జట్లు. ఇక ఫైనల్స్ లో తలపడబోయే టీమిండియా తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోంది అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ టైటిల్ పోరుకోసం భారత సారథి రోహిత్ శర్మ సరికొత్త గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ లో ఫోకస్ మెుత్తం దానిపైనే పెట్టినట్లుగా సమాచారం. మరి హిట్ మ్యాన్ ఆసీస్ కోసం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
130 కోట్ల భారతీయుల కల నెరవేరేందుకు ఇంకా ఒక్క అడుగు మాత్రమే ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తే.. సగర్వంగా ప్రపంచ కప్ ను ముద్దాడొచ్చు. ఇందుకోసం టీమిండియా ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ద్ కృష్ణలు ప్రాక్టీస్ లో నిమగ్నమైయ్యారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సారథ్యంలో ప్రాక్టీస్ సెషన్ సాగింది. ఈ సెషన్ లో ఆసీస్ కోసం రోహిత్ సరికొత్త గేమ్ ప్లాన్ ను రెడీ చేస్తున్నాడు. ప్రాక్టీస్ లో భాగంగా స్లిప్ క్యాచ్ లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం స్పష్టంగా కనిపించింది.
ఈ క్రమంలోనే స్లిప్స్ లో ఆటగాళ్లను ఉంచడం, తక్కువ ఎత్తులో వచ్చే క్యాచ్ లను అందుకోవడంపైనే ఎక్కువ ఫోకస్ చేశారు టీమిండియా ప్లేయర్లు. కాగా.. రోహిత్ శర్మ ఇలా లో-లెవల్లో వచ్చే క్యాచ్ లపైనే దృష్టి పెట్టడానికి కారణం లేకపోలేదు. అసలు విషయం ఏంటంటే? అహ్మదాబాద్ పిచ్ మందకోడిగా ఉంటుందని, బంతులు తక్కువ ఎత్తులో వస్తాయని పిచ్ క్యూరేటర్ రిపోర్ట్ ఇవ్వడమే ఈ ప్రాక్టీస్ కు కారణం. తక్కువ ఎత్తులో బాల్స్ ను బ్యాటర్లు అంచనా వేయడంలో విఫలం అవుతారు. దీంతో బంతులు బ్యాట్ ఎడ్జ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకునే హిట్ మ్యాన్ లో క్యాచ్ లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి రోహిత్ ఫైనల్ మ్యాచ్ కోసం గీస్తున్న ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.