iDreamPost
android-app
ios-app

ఒకే ఓవర్లో 36 పరుగులు.. రోహిత్- రింకూ విధ్వంసం చూడండి!

Rohit Sharma- Rinku Singh: ఆఫ్గనిస్తాన్ పై ఆఖరి టీ20లో రోహిత్ శర్మ, రింకూ సింగ్ విజృంభించారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో వారి ప్రతాపానికి బౌలర్ అల్లాడిపోయాడు.

Rohit Sharma- Rinku Singh: ఆఫ్గనిస్తాన్ పై ఆఖరి టీ20లో రోహిత్ శర్మ, రింకూ సింగ్ విజృంభించారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో వారి ప్రతాపానికి బౌలర్ అల్లాడిపోయాడు.

ఒకే ఓవర్లో 36 పరుగులు.. రోహిత్- రింకూ విధ్వంసం చూడండి!

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం మొత్తం రోహిత్ శర్మ- రింకూ సింగ్ జపమే చేశారు. టీమిండియా బ్యాటింగ్ జరుగుతున్నంతసేపు వీళ్ల వీరవిహారం చూసేందుకు అభిమానులకు రెండు కళ్లూ సరిపోలేదు. ఒకరిని మించి ఒకరు ఆఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీళ్లిద్దరూ కలిసి మ్యాచ్ మొత్తం ఆడింది ఒకెత్తు అయితే.. ఆఖరి ఓవర్ మాత్రం ఒకెత్తనే చెప్పాలి. ఎందుకంటే ఆఖరి ఓవర్లో వీళ్లిద్దరూ కలిసి ఏకంగా 36 పరుగులు నమోదు చేశారు. ఆఫ్గాన్ బౌలర్ కరీమ్ జనాత్ కు ముఖంలో నెత్తురు చుక్కలేకుండా చేశారు. ఎలా వేసినా బంతిని మాత్రం బౌండరికీ తరలించారు. ముఖ్యంగా సిక్సర్లతో విజృంభించారు.

మ్యాచ్ లో మొదటి నుంచి రోహిత్ శర్మ, రింకూ సింగ్ చెలరేగి ఆడుతున్నారు. 19 ఓవర్ల సమయానికి టీమిండియా స్కోర్ 4 వికెట్ల నష్టానికి 176గా ఉంది. ఆఖరి ఓవర్ ముగిసే సరికి స్కోర్ బోర్డు 212కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో స్కోర్ బోర్డుని రోహిత్ శర్మ- రింకూ సింగ్ ద్వయం 200 దాటించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. వారి నిర్ణయానికి ఆఫ్గాన్ బౌలర్ కరీమ్ జనాత్ బలికాక తప్పలేదు. 20 ఓవర్ తొలి బంతిని రోహిత్ శర్మ ఫోర్ గా మలిచాడు. ఆ తర్వాత రెండో బంతిని సిక్సర్ బాదాడు. జనాత్ దురదృష్టం ఏంటంటే అది నో బాల్. ఫ్రీ హిట్ ని కూడా రోహిత్ శర్మ సిక్సరే కొట్టాడు. ఆ తర్వాతి బంతిని సింగిల్ తీసుకున్నాడు.

అప్పటికి జనాత్ కాస్త కుదుటపడ్డట్లు కనిపించాడు. రోహిత్ శర్మ వెళ్లాడుతే కాస్త కట్టడి చేయచ్చు అనుకున్నాడు. కానీ, రింకూ సింగ్ కూడా అదే ధోరణితో చెలరేగాడు. 20 ఓవర్లో 4, 5, 6 బంతులను సిక్సర్లు బాదాడు. ఆఖరి ఓవర్లో 4, N6, 6, 1, 6, 6, 6 ఈ విధంగా 36 పరుగులు చేశారు. పాపం జనాత్ పరిస్థితి మూలిగే నక్క మీద మూడు ఇత్తుల తాటికాయ పడ్డట్లు అయ్యింది. మధ్యలో కాసేపు కెప్టెన్ తో కూడా మాట్లాడాడు. కానీ, ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. చివరికి టీమిండియా స్కోర్ 200 దాటేసింది. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు స్కోర్ చేసిన జాబితాలో మూడో స్థానానికి చేరారు.

తొలుత 36 పరుగులతో యువరాజ్, ఆ తర్వాత 36 పరుగులతో పొలార్డ్, ఇప్పుడు రోహిత్ శర్మ- రింకూ సింగ్ జోడీ 36 పరుగులతో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఓవర్ తో వీళ్లు భాగస్వామ్యంలో కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. టీమిండియా తరఫున ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా నిలిచారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ(121 నాటౌట్), రింకూ సింగ్(69 నాటౌట్)గా నిలిచి అంతర్జాతీయ టీ20ల్లో 190 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొత్తానికి వీళ్లిద్దరు చెలరేగడంతో టీమిండియా స్కోర్ అంతంతమాత్రంగానే ఉంటుందేమో అని నిరాశ పడిన అభిమానుల కళ్లల్లో ఆనందం నిండింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి టీమిండియా 212 పరుదులు నమోదు చేసింది. మరి.. ఆఖరి ఓవర్లో రోహిత్ శర్మ- రింకూ సింగ్ జోడీ 36 పరుగులు నమోదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.