iDreamPost
android-app
ios-app

వీడియో: కోహ్లీ సూపర్బ్ ఫీల్డింగ్.. విరాటే గనుక లేకపోతే మ్యాచ్ పోయేది!

విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే ప్రదర్శన చేశారు. బౌండరీ లైన్ వద్ద అసాధారణ రీతిలో గాల్లోకి దూకి సిక్స్ రాకుండా బంతిని అడ్డుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే ప్రదర్శన చేశారు. బౌండరీ లైన్ వద్ద అసాధారణ రీతిలో గాల్లోకి దూకి సిక్స్ రాకుండా బంతిని అడ్డుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

వీడియో: కోహ్లీ సూపర్బ్ ఫీల్డింగ్.. విరాటే గనుక లేకపోతే మ్యాచ్ పోయేది!

భారత్- ఆఫ్గాన్ మధ్య టీ20 సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఆఖరి టీ20లో కూడా నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ బరిలోకి దిగింది. చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆఫ్గాన్ భావించింది. కాగా బుధవారం చిన్న స్వామి స్టేడియం వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆఖరికి టీమిండియానే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆఫ్గాన్ బ్యాటర్ బాదిన బాల్ ను బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి సిక్స్ వెళ్లకుండా బంతిని ఆపాడు. ఈ కళ్లు చెదిరే విన్యాసం నెట్టింట వైరల్ గా మారింది.

ఆఫ్ఘనిస్తాన్‌ తో జరిగిన మూడవ టీ20లో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీమ్ ఇండియాకు 6 పరుగులను ఆదా చేశాడు. మైదానంలో చురుకుగా ఉండే కోహ్లీ మరోసారి తన అద్భుతమైన ఆటతీరును కనబర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ ఛేజింగ్ సమయంలో ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ బౌలింగ్ లో అఫ్గాన్ బ్యాటర్ కరీం జనత్ లాంగ్ ఆన్ బౌండరీ వైపు భారీ షాట్‌ కొట్టాడు. ఈ సమయంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి దూకి ఒంటి చేత్తో బాల్ ను అడ్డుకుని గ్రౌండ్ లోకి విసిరాడు.

బౌండరీ లైన్ తాకడానికి ముందే కోహ్లీ గాల్లోకి ఎగిరి బాల్ ను అడ్డుకున్నాడు. కోహ్లీ గాల్లోకి దూకి క్యాచ్ అందుకున్న తీరుకు అభిమానులు, డగౌట్ లో ఉన్న ఆటగాళ్లు అంతా ఆశ్చర్యపోయారు. ఒకవేళ విరాట్ కనుక ఈ సాహసం చేయకపోతే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదని.. విరాట్ లేకపోతే మ్యాచ్ పోయేదని కామెంట్స్ చేస్తున్నారు. ఒకే ఒక్క ఫీట్ తో కోహ్లీ మ్యాచ్ రిజల్ట్ నే మార్చేశాడని అంటున్నారు. మరి కోహ్లీ ఫీల్డింగ్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి