iDreamPost
android-app
ios-app

మేమంతా మ్యాచ్‌ విన్నర్లమే! మమ్మల్ని చూసి భయపడుతున్నారు: పాక్‌ బ్యాటర్‌

  • Published Aug 25, 2023 | 9:13 AM Updated Updated Aug 25, 2023 | 9:13 AM
  • Published Aug 25, 2023 | 9:13 AMUpdated Aug 25, 2023 | 9:13 AM
మేమంతా మ్యాచ్‌ విన్నర్లమే! మమ్మల్ని చూసి భయపడుతున్నారు: పాక్‌ బ్యాటర్‌

మరికొన్ని రోజుల్లో మినీ వరల్డ్‌ కప్‌గా పిలువబడే ఆసియా కప్‌ 2023 ప్రారంభం కానుంది. ఈ సారి ఆసియా కప్‌ను హైబ్రిడ్‌ పద్ధతిలో పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక వేదికగా నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటికే పాకిస్థాన్‌-ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు శ్రీలంక చేరుకుని, ఆసియా కప్‌ ఆరంభానికి ముందుగా ఓ మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ ఆడుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ రెండు వన్డేల్లోనూ పాకిస్థాన్‌ విజయం సాధించింది.

తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్‌ను కేవలం 59 పరుగులకే ఆలౌట్‌ చేసి పాకిస్థాన్‌ బౌలర్లు దుమ్ములేపారు. కానీ, రెండు వన్డేలో అదే పాకిస్థాన్‌ బౌలింగ్‌ను ఆఫ్ఘాన్‌ బ్యాటర్లు చీల్చిచెండాడి ఏకంగా 300 పరుగులు చేశారు. అయితే.. పాక్‌ ఆ టార్గెట్‌ను ఛేదించి ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 91 పరుగులతో రాణించిన ఇమామ్‌ ఉల్‌ హక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ టీమ్‌లో అందరూ మ్యాచ్‌ విన్నర్లే ఉన్నారని, పాకిస్థాన్‌ జట్టును చూసి ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయని కాస్త ఓవర్‌ కామెంట్‌ చేశాడు.ఇమామ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్‌ సెటైర్లు వేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ లాంటి జట్టుపై ఓ రెండు వన్డేలు గెలవగానే ఇంత ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వచ్చేసిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

తొలి వన్డేలో అఫ్ఘాన్‌ను 59 పరుగులకే ఆలౌట్‌ చేసిన పాక్‌ బౌలింగ్‌ స్ట్రాంగ్‌గా ఉందనుకుంటే.. రెండో వన్డేలో అదే బౌలింగ్‌ ఎటాక్‌ను ఆఫ్ఘాన్‌ 300 రన్స్‌ బాదింది. ఇక బ్యాటింగ్‌లో 300 టార్గెట్‌ను ఛేజ్‌ చేశామని చెప్పుకున్నా.. తొలి వన్డేలో ఇదే ఆఫ్ఘానిస్థాన్‌ బ్యాటింగ్‌ను కుదేలు చేసింది. 201 పరుగులకే పాక్‌ ఆలౌట్‌ అయింది. ఇలా తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించిన పాక్‌ బ్యాటింగ్‌లో విఫలమైంది, రెండు వన్డేలో బ్యాటింగ్‌లో రాణించి, బౌలింగ్‌లో అట్టర్‌ ఫ్లాఫ్‌ అయింది. ఎప్పుడు ఎలా ఆడతారో మీకే తెలియదు.. అలాంటిది మీ టీమ్‌ను చూసి ఎవరు ఎందుకు భయపడతారంటూ క్రికెట్‌ అభిమానులు చురకలు అంటిస్తున్నారు. మరి ఇమామ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 18 ఏళ్ల తర్వాత ధోని రికార్డు బద్దలు కొట్టిన అఫ్గాన్ కీపర్!