iDreamPost

18 ఏళ్ల తర్వాత ధోని రికార్డు బద్దలు కొట్టిన అఫ్గాన్ కీపర్!

  • Author singhj Updated - 09:12 PM, Thu - 24 August 23
  • Author singhj Updated - 09:12 PM, Thu - 24 August 23
18 ఏళ్ల తర్వాత ధోని రికార్డు బద్దలు కొట్టిన అఫ్గాన్ కీపర్!

అఫ్గానిస్థాన్ టీమ్​ను చాలా మంది పసికూనలా చూస్తుంటారు. కానీ ఆ జట్టు తమకు ఛాన్స్ దొరికినప్పుడల్లా సత్తా చాటుతూ వస్తోంది. జట్టు పరంగా సాధించిన విజయాలను పక్కనబెడితే.. అఫ్గాన్ ప్లేయర్లు వ్యక్తిగతంగా మాత్రం బాగా రాణిస్తున్నారు. ప్రస్తుత క్రికెట్​లో టాప్ స్పినర్లలో ఒకడైన రషీద్ ఖాన్​తో పాటు మంచి టాలెంట్ కలిగిన ముజీబుల్ రెహ్మాన్​లు ఇద్దరూ అఫ్గాన్ ఆటగాళ్లే కావడం విశేషం. ఆల్​రౌండర్​గా పేరు తెచ్చుకున్న మహ్మద్ నబీ కూడా ఆ టీమ్ ప్లేయర్ కావడం గమనార్హం. వీళ్లు ఐపీఎల్​లో పలు జట్లకు ఆడుతూ మంచి పాపులారిటీ సంపాదించారు.

ప్లేయర్ల వ్యక్తిగత ప్రదర్శనలను పక్కనబెడితే.. అఫ్గానిస్థాన్ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ దిశగా ఆ టీమ్ ప్రయత్నిస్తోంది. ఇక, మూడు వన్డేల సిరీస్​లో భాగంగా పాకిస్థాన్​తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గాన్ బ్యాటర్లు దుమ్మురేపారు. తొలి వన్డేలో పాక్ బౌలర్ల దెబ్బకు కుదేలైన అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్.. రెండో వన్డేలో మాత్రం రెచ్చిపోయింది. ఆ టీమ్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ (151 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులతో 151) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాక్ ముందు అఫ్గాన్ 301 రన్స్ భారీ టార్గెట్​ను ఉంచింది.

అఫ్గాన్ ఇన్నింగ్స్​లో గుర్బాజ్ బ్యాటింగ్ స్పెషల్ హైలైట్ అనే చెప్పాలి. నాణ్యమైన పేస్ బౌలింగ్ అటాక్ కలిగిన పాక్ బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అద్భుతం. అతడికి తోడుగా ఇబ్రహీమ్ జద్రాన్ (80) కూడా రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిదీ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, ఉసామా మిర్ తలో వికెట్​ తీశారు. ఈ మ్యాచ్​లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్.. టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. వికెట్ కీపర్ కూడా అయిన గుర్బాజ్.. పాక్​పై 150 రన్స్ చేసిన తొలి కీపర్​గా రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్ మీద అత్యధిక రన్స్ చేసిన వికెట్ కీపర్​గా ఎంఎస్ ధోని (120 బంతుల్లో 148) పేరుపై రికార్డు ఉండేది. దాన్ని ఇప్పుడు గుర్బాజ్ బ్రేక్ చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి