iDreamPost
android-app
ios-app

Rishabh Pant: నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే వారికి లక్ష గిఫ్ట్ అంటూ పంత్ ప్రకటన! ఏం చేయాలంటే?

  • Published Aug 07, 2024 | 10:17 AM Updated Updated Aug 07, 2024 | 10:17 AM

ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే.. వారికి రూ. 100089 బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. దానికి మీరు ఏం చేయాలంటే?

ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే.. వారికి రూ. 100089 బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. దానికి మీరు ఏం చేయాలంటే?

Rishabh Pant: నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే వారికి లక్ష గిఫ్ట్ అంటూ పంత్ ప్రకటన! ఏం చేయాలంటే?

నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్ లో రెండో గోల్డ్ మెడల్ ను సాధించేందుకు సిద్ధం అవుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన ఈ బల్లెం వీరుడు.. ఆ హిస్టరీని రిపీట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. క్వాలిఫికేషన్​ రౌండ్ లో ఫస్ట్ అటెంప్ట్​లోనే జావెలిన్​ను 89.34 మీటర్ల దూరం విసిరి, గ్రూప్​లో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ బెర్త్​ను ఖరారు చేసుకున్నాడు. ఇక ఫైనల్లో దాయాది దేశమైన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తో పసిడి పోరులో తలపడనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే.. వారికి రూ. 100089 బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఇందుకు మీరు ఏం చేయాలంటే?

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్వితీయ ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకెళ్లాడు. క్వాలిఫైయింగ్ తొలి రౌండ్ లోనే జావెలిన్ ను అత్యధిక దూరం విసిరాడు. దాంతో డైరెక్ట్ గా ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకున్నాడు. ఇక గోల్డ్ మెడల్ కోసం పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తో పోరుకు సిద్ధమైయ్యాడు. నీరజ్ చోప్రా పసిడి పతకం గెలవాలని 140 కోట్ల మంది భారతీయులు ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ జనాలకు ఓ బంపరాఫర్ ఇచ్చాడు. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే.. వారికి రూ. 100089 బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు.

“నీజర్ చోప్రా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తే.. లక్కీ విన్నర్ కు ఒక లక్ష 89 రూపాయలను గిఫ్ట్ గా ఇస్తాను. దానికి మీరు ఏం చేయాలంటే? నా ట్విట్ ను లైక్ చేసి ఎక్కువ కామెంట్స్ చేయాలి. ఇలా ఎవరు చేస్తారో.. ఆ లక్కీ విన్నర్ కు ఈ డబ్బులు ఇస్తాను. అలాగే టాప్ 10లో నిలిచిన వారికి విమాన టికెట్లు స్పాన్సర్ చేస్తాను. ఇండియాతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారు నా సోదరుడు నీరజ్ చోప్రాకు సపోర్ట్ చేయండి” అంటూ రాసుకొచ్చాడు రిషబ్ పంత్. మరి ఇంకెందుకు ఆలస్యం పంత్ ట్విట్ కు లైక్ కొట్టి.. కామెంట్స్ పెట్టేయండి. మరి పంత్ బంపరాఫర్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.