Somesekhar
క్రికెట్ అనే మర్రి వృక్షం కింద ప్రపంచానికి కనబడకుండా ఎందరో క్రీడాకారులు కనుమరుగైపోయారు. అందులో ది గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ హాకీగా పేరొందిన పీఆర్ శ్రీజేష్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ లో దుమ్మురేపుతున్నాడు శ్రీజేష్.
క్రికెట్ అనే మర్రి వృక్షం కింద ప్రపంచానికి కనబడకుండా ఎందరో క్రీడాకారులు కనుమరుగైపోయారు. అందులో ది గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ హాకీగా పేరొందిన పీఆర్ శ్రీజేష్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ లో దుమ్మురేపుతున్నాడు శ్రీజేష్.
Somesekhar
సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ ఈ పేర్లు చెప్పగానే భారత దిగ్గజ క్రికెటర్లు అని అందరికి గుర్తుకు వస్తుంది. అంతలా క్రికెట్ అంటే ఇండియా.. ఇండియా అంటే క్రికెట్ గా వేళ్లూనుకుపోయింది. ఈ క్రమంలో ఎన్నో క్రీడాంశాలు మరుగునపడిపోయాయి. అందులో ఒకటి మన జాతీయ క్రీడ అయిన హాకీ కూడా ఉండటం దురదృష్టకరం. క్రికెట్ అనే మర్రి వృక్షం కింద ప్రపంచానికి కనబడకుండా ఎందరో క్రీడాకారులు కనుమరుగైపోయారు. అందులో ది గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ హాకీగా పేరొందిన పీఆర్ శ్రీజేష్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో పసిడి సాధించాలన్న కల చెదిరినప్పటికీ.. గోల్ కీపర్ గా శ్రీజేష్ పోరాటానికి సలామ్ కొట్టాల్సిందే.
పరట్టు రవీంద్రన్ శ్రీజేష్.. కేరళలోని ఎర్నాకులం జిల్లా కిళక్కంబళం గ్రామంలో మలయాళీ కుటుంబంలో మే 8, 1988లో జన్మించాడు. స్కూల్ దశలోనే హాకీపై ప్రేమను పెంచుకున్న శ్రీజేష్.. ఆ దిశగా అడుగులు వేశాడు. హాకీలో శ్రీజేష్ ప్రతిభను స్కూల్లోనే గమనించిన అప్పటి కోచ్ అతడిని సానపట్టాడు. ఇక గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన తర్వాత పూర్తిగా హాకీపైనే ఫోకస్ పెట్టాడు శ్రీజేష్. 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ హాకీలోకి గోల్ కీపర్ గా అరంగేట్రం చేశాడు. తన ఆటతో కేవలం రెండు సంవత్సరాల్లో అంటే 2006లో సీనియర్ జట్టులో చోటు దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు.
శ్రీజేష్ గోల్ పోస్ట్ కు అడ్డుగా ఉన్నాడంటే.. ప్రత్యర్థులకు దడ పుట్టాల్సిందే. గోల్ పోస్ట్ పై దాడులు చేసి, చేసి ప్రత్యర్థులు అసలిపోవాల్సిందే గానీ.. వారికి మాత్రం గోల్ కొట్టే ఛాన్స్ ఇవ్వడు. ఇలాంటి సంఘటనలు అతడి కెరీర్ లో కోకొల్లలు. ఎన్నోసార్లు బెస్ట్ గోల్ కీపర్ గా అవార్డులు అందుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. అందుకే అభిమానులు ముద్దుగా ది గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ హాకీ అంటు పిలుచుకుంటారు. కాగా.. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ టీమ్ అసాధారాణ ప్రతిభతో సెమీ ఫైనల్ వరకు వచ్చింది. ఇక సెమీ ఫైనల్లో కూడా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. 3-2తో జర్మనీ చేతిలో పోరాడి ఓడిపోయింది.
ఇక ఈ ఒలింపిక్స్ ఇండియా సెమీ ఫైనల్ వరకు చేరుకోవడంలో గోల్ కీపర్ శ్రీజేష్ ది కీలక పాత్ర. ఈ ఈవెంట్ లో గ్రేట్ బ్రిటన్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీజేష్ చూపిన ఆటకు సలామ్ కొట్టకుండా ఉండలేం. ప్రత్యర్థులు గోల్ పోస్ట్ 11 సార్లు దాడి చేయగా.. వారికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదంటే, ఈ గోల్ కీపర్ ఏ రేంజ్ లో గోల్ పోస్ట్ కు అడ్డుగోడలా నిలబడ్డాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే ఆటను జర్మనీపై కూడా చూపించాడు. కానీ అతడు ఎంత పోరాడినప్పటికీ.. కాస్తంత అదృష్టం కూడా కలిసిరావాలిగా. ఆ అదృష్టం లేకపోవడంతో.. జర్మనీ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది.
కాగా.. బ్రాంజ్ మెడల్ కోసం స్పెయిన్ తో ఇండియన్ హాకీ టీమ్ తలపడబోంది. ఒలింపిక్స్ లో గోల్డ్ సాధించాలన్న ఇండియన్ హాకీ టీమ్ కల, కలగానే మిగిలిపోయింది. అయితే ఈ విషయంలో ఎక్కువగా బాధపడేది గోల్ కీపర్ శ్రీజేష్ అనే చెప్పాలి. ఎందుకంటే? ఇవి అతడికి చివరి ఒలింపిక్స్. రెండు దశబ్దాలుగా భారత హాకీ టీమ్ కు ది గ్రేట్ వాల్ గా నిలబడుతున్న శ్రీజేష్ కు రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది కాదనలేని వాస్తవం. దానికి కారణం భారత్ లో క్రికెట్ ఉన్న క్రేజ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
WHAT A FREAKING SAVE. 🤯🔥 pic.twitter.com/ffJJeiCWQp
— Johns. (@CricCrazyJohns) August 6, 2024
PR SREEJESH 😢
– No Gold medal for the iconic career, he deserves that more than anyone but sometimes sport is cruel. pic.twitter.com/BLMqYfYWdf
— Johns. (@CricCrazyJohns) August 6, 2024