గ్రౌండ్​లో నమాజ్ చేయడమేంటి? రిజ్వాన్​పై వెటరన్ క్రికెటర్ సీరియస్!

  • Author singhj Published - 09:19 PM, Fri - 27 October 23

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్​పై ఓ వెటరన్ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. గ్రౌండ్​లో నమాజ్ చేయడం ఏంటని ఫైర్ అయ్యాడు. ఆ మాజీ క్రికెటర్ ఇంకా ఏమేం అన్నాడంటే..

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్​పై ఓ వెటరన్ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. గ్రౌండ్​లో నమాజ్ చేయడం ఏంటని ఫైర్ అయ్యాడు. ఆ మాజీ క్రికెటర్ ఇంకా ఏమేం అన్నాడంటే..

  • Author singhj Published - 09:19 PM, Fri - 27 October 23

ఆటలోనైనా కులం, మతం, వర్ణం, జాతి అనే భేదాలు ఉండవు. దేశం, రాష్ట్రం అనే ప్రాంతీయ భేదాలకూ స్పోర్ట్స్​లో చోటు ఉండదు. ఫిజికల్ ఫిట్​నెస్​, మెంటల్ ఫిట్​నెస్​ను పెంచడంతో పాటు మనుషుల మధ్య బంధాలను మరింత బలోపేతం చేయడం ఆటల లక్ష్యమని చెప్పొచ్చు. దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసి ప్రపంచమంతా ఒక్కటే అనే భావన అనేది తీసుకురావడమే గేమ్స్ టార్గెట్. కానీ కొందరు ప్లేయర్లు మాత్రం ఒక్కోసారి ఆటల్లో మతం, వర్ణం లాంటి తేడాలను తీసుకురావడం చూస్తూనే ఉంటాం. క్రికెట్​లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెటర్లు గ్రౌండ్​లో నమాజ్ చేయడం చూసే ఉంటారు.

సెంచరీ కొట్టాక, వికెట్లు తీశాక పాక్ ప్లేయర్లు మైదానంలో ప్రార్థనలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీనిపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సీరియస్ అయ్యాడు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదన్నాడు. గ్రౌండ్​లో ప్రార్థనలేంటని ప్రశ్నించాడు. అంతగా కావాలంటే డ్రెస్సింగ్ రూమ్​లో చేసుకోవచ్చు కదా అన్నాడు. తమకూ దైవభక్తి ఉందని.. అలాగని తాము గ్రౌండ్​లో మంగళహారతులు ఇవ్వడం లేదు కదా అని ఎదురు ప్రశ్నించాడు కనేరియా. టీమిండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గ్రౌండ్​లో ఎప్పుడూ ప్రార్థనలు చేయలేదని అతడు గుర్తుచేశాడు. మహ్మద్ షమి, సిరాజ్​లు కూడా గ్రౌండ్​లో ఎప్పడూ నమాజ్ చేయలేదన్నాడు కనేరియా.

వరల్డ్ కప్​లో భాగంగా రీసెంట్​గా పాకిస్థాన్​-శ్రీలంక మ్యాచ్​లో సెంచరీ తర్వాత పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ గ్రౌండ్​లోనే నమాజ్ చేశాడు. ఇది కాంట్రవర్సీగా మారింది. ఈ నేపథ్యంలో రిజ్వాన్​ఫై సీరియస్ అయిన కనేరియా పైకామెంట్స్ చేశాడు. పాక్ ప్లేయర్ల ప్రార్థనలు డ్రెస్సింగ్ రూమ్​కే పరిమితం కావాలన్నాడు. ఒకప్పుడు తన తోటి క్రికెటర్లైన షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది తీరుతో ఎంతో వేదనకు గురయ్యానన్నాడు. అక్తర్, అఫ్రిదీలు తనతో మతపరమైన అంశాల గురించి ఎక్కువగా మాట్లాడేవారన్నాడు. మతం మారాల్సిందిగా అఫ్రిది తనపై తీవ్ర ఒత్తిడి చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఇంజమామ్ తప్ప మిగిలిన పాక్ ప్లేయర్స్ అందరూ తనను ఇబ్బంది పెట్టారని బయటపెట్టాడు. మరి.. మైదానంలో ప్రార్థనల విషయంలో కనేరియా చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments