iDreamPost
android-app
ios-app

కోహ్లీని విమర్శించే వాళ్లు.. అతను జట్టు కోసం ఏం చేస్తున్నాడో తెలుసుకోండి!

  • Author singhj Published - 02:57 PM, Sat - 11 November 23

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్​లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంతగా పెర్ఫార్మ్ చేస్తున్నా అతడిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే జట్టు కోసం కోహ్లీ ఏం చేస్తున్నాడో తెలిస్తే అతడ్ని ట్రోల్ చేయలేరు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్​లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంతగా పెర్ఫార్మ్ చేస్తున్నా అతడిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే జట్టు కోసం కోహ్లీ ఏం చేస్తున్నాడో తెలిస్తే అతడ్ని ట్రోల్ చేయలేరు.

  • Author singhj Published - 02:57 PM, Sat - 11 November 23
కోహ్లీని విమర్శించే వాళ్లు.. అతను జట్టు కోసం ఏం చేస్తున్నాడో తెలుసుకోండి!

వన్డే వరల్డ్‌ కప్-2023 ఆఖరి దశకు చేరుకుంటోంది. లీగ్ మ్యాచ్​లు దాదాపుగా ముగింపునకు చేరుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ సెమీఫైనల్స్​పై నిలిచింది. భారత్ తన లాస్ట్ లీగ్ మ్యాచ్​లో నెదర్లాండ్స్​తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. గత మ్యాచ్​లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన రోహిత్ సేన ఫుల్ జోష్​తో ఉంది. డచ్ టీమ్​తో మ్యాచ్​కు ముందు భారత ఆటగాళ్లకు వారం రోజుల రెస్ట్ దొరకింది. దీంతో కాస్త రిలాక్స్ అయిన ప్లేయర్లు నెదర్లాండ్స్​తో మ్యాచ్​కు రెడీ అయిపోయారు. నాకౌట్​ ఫైట్​కు ముందు ఈ మ్యాచ్​ను కంప్లీట్​గా యూజ్ చేసుకోవాలని భావిస్తున్నారు.

ఫామ్​ను కంటిన్యూ చేస్తూ భారీ స్కోర్లు బాదాలని బ్యాటర్లు.. త్వరగా ప్రత్యర్థిని కుప్పకూల్చాలని బౌలర్లు ఫిక్స్ అయిపోయారు. ఈ మ్యాచ్​లో సేమ్ టీమ్ కాంబినేషన్​తో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మెగా టోర్నీలో వరుస విజయాలు సాధిస్తున్న భారత్.. నెదర్లాండ్స్​ మీద భారీ తేడాతో నెగ్గి సెమీస్ బరిలో అడుగుపెట్టాలని చూస్తోంది. ఇక, ఈ వరల్డ్ కప్​లో టీమిండియా వరుస విజయాల్లో బ్యాటర్లు, బౌలర్లది సమాన పాత్ర అని చెప్పాలి. బౌలింగ్​లో షమి, బుమ్రా, సిరాజ్, కుల్​దీప్, జడేజా అదరగొడుతున్నారు. వాళ్ల బౌలింగ్​ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాట్స్​మెన్ భయపడుతున్నారు.

టీమిండియా బౌలర్లను ఫేస్ చేయలేక, వారి బౌలింగ్​లో రన్స్ చేయలేక వికెట్లు సమర్పించుకుంటున్నారు ప్రత్యర్థి బ్యాటర్లు. ఇక, టీమ్ బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలసి పంచుకుంటున్నారు. రోహిత్ ఫెయిలైతే కోహ్లీ నిలబడుతున్నాడు. విరాట్ త్వరగా ఔటైతే హిట్​మ్యాన్ ఆఖరి వరకు ఆడుతున్నాడు. టీమిండియా బ్యాటింగ్​కు మూలస్తంభాలైన ఈ ఇద్దరు ప్లేయర్లు కంటిన్యూగా పెర్ఫార్మ్ చేస్తున్నందునే వరుస విజయాలు వస్తున్నాయి. వరల్డ్ కప్​లో ఇంతగా రాణిస్తున్నా కొందరు పనిగట్టుకొని మరీ కోహ్లీని విమర్శిస్తున్నారు. విరాట్ రికార్డుల కోసం ఆడుతున్నాడని.. టీమ్ గెలుపు అతడికి అక్కర్లేదంటూ నెట్టింట ట్రోలింగ్​కు దిగుతున్నారు. భారత విజయాల వెనుక కోహ్లీ చేస్తున్న ఒక పని గురించి తెలిస్తే వాళ్లు ఈ విమర్శలు చేయలేరు.

మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో కోహ్లీ 543 రన్స్ చేశాడు. ఈ వరల్డ్ కప్​లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల లిస్టులో మూడో ప్లేసులో ఉన్నాడు విరాట్. టోర్నీలో బ్యాటింగ్ టైమ్​లో ఏకంగా 14 గంటల 39 నిమిషాల పాటు క్రీజులో గడిపాడు. అతడు ఒక ఎండ్​లో అలా పాతుకుపోవడం వల్లే మిగతా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయడం, హిట్టింగ్​కు దిగడం సాధ్యమవుతోంది. ఒక ఎండ్​లో వికెట్​ను కాపాడుతూ తాను ఉన్నాననే భరోసాను కోహ్లీ ఇస్తున్నందువల్లే.. గిల్, అయ్యర్, సూర్యకుమార్​లు చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిశాక అయినా విరాట్​ను విమర్శించేవారు వెనక్కి తగ్గుతారేమో చూడాలి. మరి.. కోహ్లీ టీమ్ కోసం ఇంతలా కష్టపడటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌లో టీమిండియా విజయాల వెనుక సీక్రెట్‌ ఇదే! బుమ్రా వల్లే అంతా..