వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్ పోరులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (118) సెంచరీతో అదరగొట్టాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (49) సెంచరీల రికార్డును కింగ్ కోహ్లీ (50*) బ్రేక్ చేశాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్ పోరులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (118) సెంచరీతో అదరగొట్టాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (49) సెంచరీల రికార్డును కింగ్ కోహ్లీ (50*) బ్రేక్ చేశాడు.
వన్డే వరల్డ్ కప్-2023 నాకౌట్ ఫైట్‌లో భారత బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. ఒకర్ని మించి ఒకరు అదిరిపోయే బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ బాల్ నుంచి ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ వరకు ఉతుకుడే ఉతుకుడు. న్యూజిలాండ్ బౌలర్లను రోహిత్ అండ్ కో చితగ్గొట్టారు. ఫస్ట్ సెమీస్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (47), శుబ్‌మన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్) సూపర్ స్టార్ట్ అందించారు. ఈ జోడీ దెబ్బకు టీమిండియా ఎనిమిది ఓవర్లలోనే 70 పరుగుల మార్క్‌కు చేరుకుంది. అయితే సూపర్ టచ్‌లో ఉన్న రోహిత్ భారీ షాట్ కొట్టబోయి టిమ్ సౌతీ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
హిట్‌మ్యాన్ ఔటైనా విరాట్ కోహ్లీ (117)తో కలసి ఇన్నింగ్స్‌ను మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాడు గిల్. కానీ ఉక్కపోత కారణంగా అతడి క్రాంప్స్ పట్టేశాయి. పరుగులు తీయడంలో ఇబ్బంది పడిన గిల్‌కు ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ చేసినా సెట్ అవ్వలేదు. శుబ్‌మన్ రిటైర్డ్ హర్ట్‌గా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. దీంతో అతడి ప్లేసులో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ (105) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు అయ్యర్. అతడి ఇన్నింగ్స్‌లో బౌండరీల కంటే సిక్సులే ఎక్కువగా ఉన్నాయి. నాకౌట్ మ్యాచ్‌లో ఏకంగా 8 సిక్సులు బాదాడు అయ్యర్. నిలబడిన చోటు నుంచి అలవోకగా బంతిని ఆడియెన్స్‌లోకి పంపాడతను.
ఆఖర్లో విరాట్ కోహ్లీ ఔటైనా కేఎల్ రాహుల్ (39) విలువైన రన్స్ చేశాడు. భారత్ స్కోరును 400 దాకా చేర్చేందుకు అతడు తీవ్రంగా ప్రయత్నించాడు. మొత్తానికి ఓవర్లన్నీ ఆడిన రోహిత్ సేన 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ బౌలర్లలో సౌతీకి 3 వికెట్లు దక్కాయి. బౌల్ట్ ఒక వికెట్ తీశాడు. భారత్‌ను ఆపాలంటే వికెట్లు తీయాలి. కానీ ఈ విషయంలో న్యూజిలాండ్ దారుణంగా ఫెయిలైంది. కివీస్ ప్రధాన పేసర్ బౌల్ట్ ఏకంగా 86 రన్స్ ఇచ్చుకున్నాడు. మూడు వికెట్లు తీసిన సౌతీ బౌలింగ్‌లో మన బ్యాటర్లు 100 పరుగులు పిండుకున్నారు. ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర సహా ఎవ్వర్నీ టీమిండియా బ్యాటర్లు వదల్లేదు.
న్యూజిలాండ్ టీమ్‌లో ఎంతో కీలకమైన మిచెల్ శాంట్నర్ 51 రన్స్ ఇచ్చినప్పటికీ.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. శాంట్నర్, బౌల్ట్ విఫలమవ్వడం న్యూజిలాండ్‌ను దెబ్బతీసింది. ఇక, ఈ మ్యాచ్‌లో డ్రింక్స్ టైమ్‌లో జరిగిన ఓ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. 30 ఓవర్ల తర్వాత డ్రింక్స్ సమయంలో కివీస్ ప్లేయర్లు డ్రింక్స్ తాగుతూ గేమ్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నారు. తీవ్రంగా దాహం వేయడంతో భారత టీమ్ నుంచి డ్రింక్స్ వచ్చే దాకా ఆగని కోహ్లీ.. కివీస్ ఆటగాళ్ల చేతుల్లో నుంచి నీళ్ల సీసాను తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కంటిన్యూ చేసి ఏకంగా సెంచరీ బాదేశాడు. దీంతో ఇది చూసిన నెటిజన్స్.. కివీస్ నీళ్లు తాగి వాళ్లనే చితగ్గొట్టావ్.. నువ్వు మామూలోడివి కాదు బాస్ అంటూ విరాట్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మరి.. కోహ్లీ కివీస్ నీళ్లు తాగి వాళ్ల బౌలింగ్‌ను ఊచకోత కోయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ 50 సెంచరీ.. డ్రెస్సింగ్ రూమ్ మెమొరీస్ షేర్ చేస్తూ సచిన్ ఎమోషనల్ పోస్ట్!