వరుస విజయాలు ఊరికే రాలేదు.. ఆ ఓటమి వల్లే ఇక్కడి దాకా వచ్చిన భారత్!

  • Author singhj Published - 08:55 PM, Thu - 16 November 23

లీగ్ దశలో వరుస విజయాలు సాధించిన టీమిండియా.. ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్​కు చేరుకుంది. అయితే ఇన్ని విజయాలు ఊరికే రాలేదు.. దీని వెనుక ఒక ఓటమి నేర్పిన పాఠం ఉంది.

లీగ్ దశలో వరుస విజయాలు సాధించిన టీమిండియా.. ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్​కు చేరుకుంది. అయితే ఇన్ని విజయాలు ఊరికే రాలేదు.. దీని వెనుక ఒక ఓటమి నేర్పిన పాఠం ఉంది.

  • Author singhj Published - 08:55 PM, Thu - 16 November 23

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్​కు టీమిండియా చేరుకోవడంతో ప్రేక్షకులు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న కప్పు కలను ఈసారి తప్పకుండా నెరవేరుతుందని అనుకుంటున్నారు. వరస విజయాలతో ఫైనల్​కు చేరుకున్న భారత టీమ్​ను ఫ్యాన్స్, సీనియర్ ప్లేయర్లు, క్రికెట్ అనలిస్టులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే ఈ జర్నీ అంత సులువుగా జరగలేదనే చెప్పాలి. గత టీ20 వరల్డ్ కప్​లో సెమీస్​లో ఇంగ్లండ్ చేతుల్లో ఓడిపోవడం భారత్​ను తీవ్రంగా దెబ్బతీసింది. ఆ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. ఆరంభంలో త్వరగా వికెట్లు పడినా విరాట్ కోహ్లీ (50), హార్దిక్ పాండ్యా (63) టీమ్​ను ఆదుకున్నారు.

ఆ మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ (27)తో పాటు కేఎల్ రాహుల్ (5) త్వరగా ఔటవ్వడం భారత్​ను దెబ్బతీసింది. సూర్యకుమార్ యాదవ్ (14) కూడా ఫెయిలయ్యాడు. భారత్ సంధించిన 168 రన్స్ టార్గెట్​ను ఇంగ్లీష్ టీమ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊది పారేసింది. ఆ జట్టు ఓపెనర్లు జాస్ బట్లర్ (80), అలెక్స్ హేల్స్ (86) ఫోర్లు, సిక్సులతో భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆశలు అడియాశలయ్యాయి. హిట్​మ్యాన్ కెప్టెన్సీలో కప్పు వస్తుందేమో అనుకుంటే సెమీస్​లోనే స్టోరీ ముగియడంతో అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. మ్యాచ్​లో ఓటమి కంటే ఇంగ్లీష్ టీమ్​ తమపై చూపించిన డామినేషన్​ను రోహిత్​ శర్మ తీసుకోలేకపోయాడు. భారత టీమ్ ఆటతీరును పూర్తిగా మార్చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు తగ్గట్లు కోచ్ రాహుల్ ద్రవిడ్​తో కలసి ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్నాడు.

నెక్స్ట్ వరల్డ్ కప్ కోసం అప్పటి నుంచే యువకులు, సీనియర్లతో నిండిన టీమ్​ను తయారు చేసుకోవడంపై రోహిత్ శర్మ ఫోకస్ చేశాడు. మెగా టోర్నీలో ఎవరెవరు ఏయే ప్లేస్​లో ఆడాలనేది ముందే డిసైడయ్యాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్​ప్రీత్ బుమ్రా, కుల్​దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు గాయాలపాలైనా వారికి టీమిండియా మేనేజ్​మెంట్ అండగా నిలిచింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్​లో ఉంచి.. ఫిట్​నెస్​, స్కిల్స్​ను మెరుగుపర్చింది. పైఆటగాళ్లు ఫెయిలైనా, ఫామ్ కోల్పోయినా వాళ్లపై నమ్మకం ఉంచి కంటిన్యూ చేసింది. దీని ఫలితంగానే ఆసియా కప్-2023 నుంచి ఈ వరల్డ్ కప్ సెమీస్ వరకు భారత్ తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది.

టీ20 వరల్డ్ కప్​ సెమీస్​లో ఎదురైన ఓటమే భారత్ ఇన్ని విజయాలు సాధించడానికి కారణమని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తెలిపాడు. ‘గత టీ20 వరల్డ్ కప్​లో ఓటమి తర్వాత దినేష్ కార్తీక్​తో రోహిత్ శర్మ మాట్లాడాడు. మనం మారాలి, చాలా మార్పులు చేయాలన్నాడు’ అని హిట్​మ్యాన్ సంభాషణను హుస్సేన్ బయటపెట్టాడు. రోహిత్ శర్మ భారత టీమ్​లో కల్చర్​ను పూర్తిగా మార్చేశాడని మెచ్చుకున్నాడు. టీమిండియాలో అతడే నిజమైన హీరో అని నాసిర్ హుస్సేన్ ప్రశంసించాడు. మరి.. రోహిత్​పై హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: షమి జేబులో మరో బాల్​ను దాస్తున్నాడు.. పాక్ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

Show comments