లీగ్ దశలో వరుస విజయాలు సాధించిన టీమిండియా.. ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఇన్ని విజయాలు ఊరికే రాలేదు.. దీని వెనుక ఒక ఓటమి నేర్పిన పాఠం ఉంది.
లీగ్ దశలో వరుస విజయాలు సాధించిన టీమిండియా.. ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఇన్ని విజయాలు ఊరికే రాలేదు.. దీని వెనుక ఒక ఓటమి నేర్పిన పాఠం ఉంది.
వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్‌కు టీమిండియా చేరుకోవడంతో ప్రేక్షకులు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న కప్పు కలను ఈసారి తప్పకుండా నెరవేరుతుందని అనుకుంటున్నారు. వరస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న భారత టీమ్‌ను ఫ్యాన్స్, సీనియర్ ప్లేయర్లు, క్రికెట్ అనలిస్టులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే ఈ జర్నీ అంత సులువుగా జరగలేదనే చెప్పాలి. గత టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్ చేతుల్లో ఓడిపోవడం భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. ఆరంభంలో త్వరగా వికెట్లు పడినా విరాట్ కోహ్లీ (50), హార్దిక్ పాండ్యా (63) టీమ్‌ను ఆదుకున్నారు.
ఆ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (27)తో పాటు కేఎల్ రాహుల్ (5) త్వరగా ఔటవ్వడం భారత్‌ను దెబ్బతీసింది. సూర్యకుమార్ యాదవ్ (14) కూడా ఫెయిలయ్యాడు. భారత్ సంధించిన 168 రన్స్ టార్గెట్‌ను ఇంగ్లీష్ టీమ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊది పారేసింది. ఆ జట్టు ఓపెనర్లు జాస్ బట్లర్ (80), అలెక్స్ హేల్స్ (86) ఫోర్లు, సిక్సులతో భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆశలు అడియాశలయ్యాయి. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో కప్పు వస్తుందేమో అనుకుంటే సెమీస్‌లోనే స్టోరీ ముగియడంతో అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. మ్యాచ్‌లో ఓటమి కంటే ఇంగ్లీష్ టీమ్ తమపై చూపించిన డామినేషన్‌ను రోహిత్ శర్మ తీసుకోలేకపోయాడు. భారత టీమ్ ఆటతీరును పూర్తిగా మార్చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు తగ్గట్లు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలసి ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్నాడు.
నెక్స్ట్ వరల్డ్ కప్ కోసం అప్పటి నుంచే యువకులు, సీనియర్లతో నిండిన టీమ్‌ను తయారు చేసుకోవడంపై రోహిత్ శర్మ ఫోకస్ చేశాడు. మెగా టోర్నీలో ఎవరెవరు ఏయే ప్లేస్‌లో ఆడాలనేది ముందే డిసైడయ్యాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు గాయాలపాలైనా వారికి టీమిండియా మేనేజ్మెంట్ అండగా నిలిచింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉంచి.. ఫిట్నెస్, స్కిల్స్‌ను మెరుగుపర్చింది. పైఆటగాళ్లు ఫెయిలైనా, ఫామ్ కోల్పోయినా వాళ్లపై నమ్మకం ఉంచి కంటిన్యూ చేసింది. దీని ఫలితంగానే ఆసియా కప్-2023 నుంచి ఈ వరల్డ్ కప్ సెమీస్ వరకు భారత్ తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది.
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఎదురైన ఓటమే భారత్ ఇన్ని విజయాలు సాధించడానికి కారణమని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తెలిపాడు. ‘గత టీ20 వరల్డ్ కప్‌లో ఓటమి తర్వాత దినేష్ కార్తీక్‌తో రోహిత్ శర్మ మాట్లాడాడు. మనం మారాలి, చాలా మార్పులు చేయాలన్నాడు’ అని హిట్‌మ్యాన్ సంభాషణను హుస్సేన్ బయటపెట్టాడు. రోహిత్ శర్మ భారత టీమ్‌లో కల్చర్‌ను పూర్తిగా మార్చేశాడని మెచ్చుకున్నాడు. టీమిండియాలో అతడే నిజమైన హీరో అని నాసిర్ హుస్సేన్ ప్రశంసించాడు. మరి.. రోహిత్‌పై హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: షమి జేబులో మరో బాల్‌ను దాస్తున్నాడు.. పాక్ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
Nasser Hussain said, “after India were knocked out in the T20 World Cup Semis last year, Rohit Sharma told Dinesh Karthik that ‘we’ve to change, we need a change’. Rohit has changed the culture in the team”. (Sky Sports). pic.twitter.com/JOQuJx0qQ4
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023
Indian fans, do you agree with Nasser Hussain?🤔 pic.twitter.com/C6Bx8sD7qi
— CricTracker (@Cricketracker) November 16, 2023