iDreamPost
android-app
ios-app

ఆ కష్టాలు దాటాడు కాబట్టే ఈ స్థాయికి.. సెల్యూట్ రోహిత్!

  • Author singhj Published - 09:41 AM, Thu - 5 October 23
  • Author singhj Published - 09:41 AM, Thu - 5 October 23
ఆ కష్టాలు దాటాడు కాబట్టే ఈ స్థాయికి.. సెల్యూట్ రోహిత్!

ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్-2023 కోసం అంతా రెడీ అయిపోయింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య ఇవాళ జరిగే మొదటి మ్యాచ్​తో మెగా టోర్నీకి తెరలేవనుంది. భారత్​ తన తొలి మ్యాచ్​లో ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 8వ తేదీన జరగనుంది. 2011 ప్రపంచ కప్​ జట్టులో చోటు దక్కించుకోని రోహిత్ శర్మ సారథ్యంలో ఈసారి వరల్డ్ కప్ ఆడుతోంది టీమిండియా. దేశానికి కప్పును అందించి కెరీర్​ను ఘనంగా ముగించాలని హిట్​మ్యాన్ అనుకుంటున్నాడు. ఒకప్పుడు టీమ్​లో ప్లేస్ కష్టమే అనుకునే దగ్గర నుంచి ఏకంగా జట్టు కెప్టెన్ స్థాయికి ఎదిగాడు రోహిత్. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను, ఎత్తుపల్లాలను చూశాడతను. హిట్​మ్యాన్ క్రికెట్​లోకి రాకముందు చిన్నతనంలో పేదరికంతో చాలా కష్టాలు పడ్డాడు.

ముంబైలోని ఒక పేద కుటుంబంలో పుట్టిన రోహిత్ శర్మ.. స్వయంకృషిని నమ్ముకొని ఒక్కో మెట్టు పైకి ఎక్కాడు. చిన్నతనంలో అతడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. పేదరికం వల్ల ఒకే రూమ్​లో 10 నుంచి 11 మంది పడుకునేవాళ్లమంటూ రోహిత్ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘మేం ఒకే గదిలో 10-11 మంది నిద్రపోయేవాళ్లం. మంచం మీద తాతయ్య పడుకుంటే.. బాబాయిలు, పిన్నిలు, నానమ్మ.. అంతా కిందే పడుకునే వాళ్లు. ఒకే దగ్గర ముడుచుకొని పడుకునే అలవాటు నాకు ఉండేది. కాలును ఎవరికైనా తాకిస్తే గానీ నిద్రపట్టేది కాదు. దీంతో గోడకు కాళ్లు ఆనించి పడుకునేవాడ్ని’ అని రోహిత్ మీడియాకు తెలిపాడు. ఒకప్పుడు పేదరికంతో పాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రోహిత్.. వాటన్నింటినీ దాటుకొని టీమిండియా కెప్టెన్​ రేంజ్​కు చేరుకున్నాడు.

ప్రస్తుతం ముంబైలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన వోర్లీ ఏరియాలో సముద్రానికి ఎదురుగా ఉండే 5,500 అడుగుల విశాలమైన ఫ్లాట్​లో భార్య, కుమార్తెతో కలసి ఉంటున్నాడు రోహిత్. తాతయ్య దగ్గర తనను వదిలి వెళ్లడానికి పేరెంట్స్ ఎంత బాధపడ్డారో ఒక తండ్రిగా ఇప్పుడు తనకు అర్థం అవుతోందన్నాడు హిట్​మ్యాన్. తనతో పాటు పెరిగిన ఫ్రెండ్స్, తాను ఎక్కడి నుంచి వచ్చాననేది తరచూ గుర్తు చేసుకంటూ ఉంటానన్నాడు. లైఫ్​లో ఏదీ ఈజీగా రాదని.. ఎంతో కష్టపడి తాను ఇవన్నీ సాధించుకున్నానని రోహిత్ చెప్పుకొచ్చాడు. తాను పడిన కష్టం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని.. గతం ఎప్పుడూ తన మదిలో మెదులుతుందన్నాడు. అందుకే వచ్చిన ప్రతి ఛాన్స్​ను ఉపయోగించుకున్నానని.. తాను అనుకున్నది సాధించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడని రోహిత్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ధవన్ విడాకుల కేసులో కోర్టు కీలక తీర్పు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి