వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు రోహిత్ శర్మ కాస్త ఎమోషనల్ అయ్యాడు. అతడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు రోహిత్ శర్మ కాస్త ఎమోషనల్ అయ్యాడు. అతడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
వరల్డ్ కప్.. ఏ ప్రొఫెషనల్ క్రికెటర్‌కైనా ఇదే పెద్ద డ్రీమ్. మెగా టోర్నీలో నెగ్గి కప్పును ఒక్కసారైనా చేతబట్టాలనేది చాలా మంది ప్లేయర్ల కల. దీని కోసం కొందరు తమ కెరీర్ మొత్తం ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. భారత గ్రేట్ సచిన్ టెండూల్కర్ అయితే కెరీర్ ఆఖర్లో ప్రపంచ కప్ డ్రీమ్‌ను తీర్చుకున్నాడు. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 2011లో తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. 2003లోనే ప్రపంచ కప్‌ను అందుకునేవాడు సచిన్. కానీ ఆ ఏడాది ఫైనల్లో భారత్‌ను ఓడించి కప్పును ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. 2003లో వరల్డ్ కప్ మిస్సవ్వడంతో మళ్లీ 2011 వరకు అంటే ఎనిమిదేళ్ల పాటు సచిన్‌కు ఎదురు చూపులు తప్పలేదు.
స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో భారత్ కప్పును అందుకుంది. మాస్టర్ బ్లాస్టర్ కోసమైనా ట్రోఫీ నెగ్గాలనే కోరిక, తపన అప్పటి టీమ్‌లో కనిపించాయి. అందుకే ఫైనల్లో శ్రీలంకపై నెగ్గగానే జట్టు సభ్యులంతా తిరంగాలు పట్టుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్‌ను తమ భుజాల మీద మోస్తూ గ్రౌండ్ మొత్తం కలియతిరిగారు. ఆ మూమెంట్స్‌ను ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక తరాన్ని క్రికెట్ ఆడేందుకు ఎంకరేజ్ చేసిన క్షణాలవి. అప్పట్లో కపిల్ డెవిల్స్ సాధించినట్లే, 2011లో ధోని అండ్ కో కప్పు సొంతం చేసుకొని ఎందరో యువతను జెంటిల్మన్ గేమ్‌ను తమ కెరీర్‌గా మలచుకునేలా చేశాయి. భారతీయుల మనసుల్లో 2011 వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్స్ నింపిన సంతోషం, ఇచ్చిన కిక్ అలాంటిది.
ఆ ఏడాది కప్పు నెగ్గిన టీమ్‌లో రోహిత్ శర్మ లేడు. అవును, ప్రపంచ కప్ గెలిచిన జట్టులో హిట్‌మ్యాన్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడు బాగా కుమిలిపోయాడు. ఫిట్నెస్ సమస్యలు, కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేయకపోవడం తదితర కారణాల వల్ల ఆ ఏడాది మెగా టోర్నీలో ఆడిన జట్టులో రోహిత్‌కు ప్లేస్ దక్కలేదు. అయితే గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా దూసుకొచ్చిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్‌లో టీమిండియకు కెప్టెన్సీ వహించే స్థాయికి ఎదిగాడు. ఈసారి అతడి నేతృత్వంలోనే జట్టు ఫైనల్‌కు చేరుకుంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత క్రికెట్లో రోహిత్ ఎరా మొదలైంది. ఓపెనర్‌గా ధనాధన్ ఇన్నింగ్స్‌లు, సెంచరీల మీద సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదుతూ టీమ్‌లో తన ప్లేస్‌ను ఫిక్స్ చేసుకున్నాడు హిట్‌మ్యాన్.
విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాక జట్టులో వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాడు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచి, ఫెయిలైనా వరుస అవకాశాలు ఇస్తూ మంచి రిజల్ట్స్ రాబడుతున్నాడు. అలాంటి రోహిత్ 2011 వరల్డ్ కప్‌లో ఆడకపోవడం, ఈసారి టీమ్‌కు కెప్టెన్సీ చేయడంపై స్పందించాడు. ‘2011లో టీమ్‌లో ప్లేస్ దక్కకపోవడం కఠిన సమయం. కానీ నేను ఇప్పుడు ఉన్న పొజిషన్‌కు హ్యాపీగా ఉన్నా. వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండి ముందుకు నడిపిస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అలా జరిగిపోయింది. ప్రపంచ కప్‌కు ముందు వరకు టీమ్‌లో మంచి వాతావరణం ఏర్పాటు చేయాలని అనుకున్నా’ అని చెబుతూ రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. మరి.. వరల్డ్ కప్ ఫైనల్‌పై హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఫైనల్‌లో గెలవాలంటే.. టాస్ గెలిచి ఏం తీసుకోవాలి? రికార్డ్స్ ఏం చెబుతున్నాయ్?
#RohitSharma𓃵 #WorldcupFinal #INDvsAUSfinal pic.twitter.com/wR6vzerrnd
— Sayyad Nag Pasha (@nag_pasha) November 18, 2023