ఫైనల్ కోసం ద్రవిడ్-రోహిత్ మాస్టర్ ప్లాన్.. ఆ అస్త్రాన్ని మళ్లీ బయటకు తీస్తున్న భారత్!

  • Author singhj Published - 05:23 PM, Sat - 18 November 23

వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ ఫైట్​లో ఆ అస్త్రాన్ని మళ్లీ ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోందని తెలిసింది.

వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ ఫైట్​లో ఆ అస్త్రాన్ని మళ్లీ ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోందని తెలిసింది.

  • Author singhj Published - 05:23 PM, Sat - 18 November 23

క్రికెట్​లో పిచ్, కండీషన్స్​కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. మామూలు టోర్నమెంట్స్​లోనే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. అలాంటిది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అంటే ఇంకా డిస్కషన్ ఏ రేంజ్​లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వన్డే ప్రపంచ కప్-2023కి ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందోననే దానిపై క్రికెటర్స్​తో పాటు ఫ్యాన్స్ కూడా ఆలోచనల్లో పడ్డారు. ఈ పిచ్ స్పిన్​కు అనుకూలిస్తుందా? లేదా పేస్​కు అనుకూలిస్తుందా? అనే దాని మీద సోషల్ మీడియాలోనూ జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. సాధారణంగా భారత్​లో టెస్టుల్లో ఎక్కువగా స్పిన్ వికెట్లు కనిపిస్తాయి. కానీ టీ20లు, వన్డేల కోసం మాత్రం ఫ్లాట్ వికెట్లే దర్శనమిస్తాయి.

లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్​లో భారీ పరుగులు రావాలనే ఉద్దేశంతో ఇండియాలో ఎక్కువగా ఫ్లాట్ వికెట్లను తయారు చేస్తుంటారు. ఇంటర్నేషనల్ మ్యాచ్​లతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్​లోనూ దీన్ని చూడొచ్చు. కానీ వరల్డ్ కప్ కోసం మాత్రం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) స్పెషల్​గా ప్లాన్ చేసింది. పేస్​, స్పిన్​కు అనుకూలిస్తూనే బ్యాటింగ్ ఫ్రెండీగా ఉండేలా పిచెస్​ను రూపొందించింది. పూర్తిగా స్పిన్​కు అనుకూలించిన చెన్నై వికెట్​ను తప్పిస్తే మిగతా అన్ని గ్రౌండ్స్​లోనూ పిచ్ నుంచి బౌలర్లతో పాటు బ్యాట్స్​మెన్​కూ హెల్ప్ దొరికింది. స్వింగ్, సీమ్ ఉన్న వికెట్లు తయారు చేయడంతో ప్రారంభంలో వికెట్లు పడటం, క్రీజులో కుదురుకుంటే రన్స్ రావడం ఈ మెగా టోర్నీలో ప్రత్యేకతగా చెప్పొచ్చు. అందుకే వరల్డ్ కప్​లోని పిచ్​ల తయారీపై అందరూ బీసీసీని మెచ్చుకుంటున్నారు.

ఫైనల్​కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ పిచ్​ కూడా బౌలింగ్, బ్యాటింగ్​కు సమానంగా సహకరించింది. ఈ గ్రౌండ్​లో జరిగిన గత నాలుగు మ్యాచుల్లో ఛేజింగ్​లో మూడు టీమ్స్ నెగ్గాయి. ఓవరాల్​గా ఇక్కడ 32 వన్డేలు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 17, ఛేజింగ్​కు దిగిన జట్లు 15 మ్యాచుల్లో గెలిచాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 237 మాత్రమే. అయితే పిచ్ క్యూరేటర్ మాత్రం ఇక్కడ 300 ప్లస్ స్కోరు నమోదవుతుందని అంటున్నారు. ఛేజింగ్ చేయడం ఈసారి కష్టంగా మారుతుందని చెబుతున్నారు. దీన్ని బట్టి టాస్ నెగ్గిన టీమ్ తొలుత బ్యాటింగ్​కు దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

పిచ్ క్యూరేటర్ మాటలకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్​ వ్యవహరిస్తున్న తీరుకు మాత్రం పొంతన కనిపించడం లేదు. ఎందుకుంటే శుక్రవారం నిర్వహించిన ఆప్షనల్ ప్రాక్టీస్​లో భారత కోచింగ్ బృందంతో కలసి హిట్​మ్యాన్ స్లిప్ క్యాచ్​లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ స్టంప్స్​కు దగ్గరగా రోహిత్​తో క్యాచులు ప్రాక్టీస్ చేయించాడు. దీన్ని బట్టి వికెట్ స్లోగా ఉంటుందని, పిచ్​ను టర్నింగ్ ట్రాక్​గా తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారత్ మరోమారు స్పిన్ అస్త్రాన్ని బయటకు తీసే ఛాన్స్ ఉంది. జడేజా, కుల్​దీప్​లకు తోడుగా అశ్విన్​ను టీమ్​లోకి తీసుకునే అవకాశం ఉంది. ఆసీస్ జట్టులో లెఫ్టాండర్లు ఎక్కువగా ఉన్నందున అశ్విన్​ను ఆడించి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే విన్నింగ్ టీమ్​ను కంటిన్యూ చేస్తూ వస్తున్న రోహిత్-ద్రవిడ్​లు టాప్ స్పిన్నర్​ను ఆడిస్తారో లేదో చూడాలి. మరి.. భారత్ స్పిన్ వ్యూహంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కమిన్స్​కు లక్కీ సెంటిమెంట్.. ధోని తరహాలో కలిసొస్తే భారత్​కే కష్టం!

Show comments