వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ ఫైట్‌లో ఆ అస్త్రాన్ని మళ్లీ ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోందని తెలిసింది.
వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ ఫైట్‌లో ఆ అస్త్రాన్ని మళ్లీ ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోందని తెలిసింది.
క్రికెట్లో పిచ్, కండీషన్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. మామూలు టోర్నమెంట్స్లోనే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. అలాంటిది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అంటే ఇంకా డిస్కషన్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వన్డే ప్రపంచ కప్-2023కి ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందోననే దానిపై క్రికెటర్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఆలోచనల్లో పడ్డారు. ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందా? లేదా పేస్‌కు అనుకూలిస్తుందా? అనే దాని మీద సోషల్ మీడియాలోనూ జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. సాధారణంగా భారత్‌లో టెస్టుల్లో ఎక్కువగా స్పిన్ వికెట్లు కనిపిస్తాయి. కానీ టీ20లు, వన్డేల కోసం మాత్రం ఫ్లాట్ వికెట్లే దర్శనమిస్తాయి.
లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో భారీ పరుగులు రావాలనే ఉద్దేశంతో ఇండియాలో ఎక్కువగా ఫ్లాట్ వికెట్లను తయారు చేస్తుంటారు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ దీన్ని చూడొచ్చు. కానీ వరల్డ్ కప్ కోసం మాత్రం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) స్పెషల్‌గా ప్లాన్ చేసింది. పేస్, స్పిన్‌కు అనుకూలిస్తూనే బ్యాటింగ్ ఫ్రెండీగా ఉండేలా పిచెస్ను రూపొందించింది. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించిన చెన్నై వికెట్‌ను తప్పిస్తే మిగతా అన్ని గ్రౌండ్స్‌లోనూ పిచ్ నుంచి బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్‌కూ హెల్ప్ దొరికింది. స్వింగ్, సీమ్ ఉన్న వికెట్లు తయారు చేయడంతో ప్రారంభంలో వికెట్లు పడటం, క్రీజులో కుదురుకుంటే రన్స్ రావడం ఈ మెగా టోర్నీలో ప్రత్యేకతగా చెప్పొచ్చు. అందుకే వరల్డ్ కప్‌లోని పిచ్‌ల తయారీపై అందరూ బీసీసీని మెచ్చుకుంటున్నారు.
ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ పిచ్ కూడా బౌలింగ్, బ్యాటింగ్‌కు సమానంగా సహకరించింది. ఈ గ్రౌండ్లో జరిగిన గత నాలుగు మ్యాచుల్లో ఛేజింగ్‌లో మూడు టీమ్స్ నెగ్గాయి. ఓవరాల్‌గా ఇక్కడ 32 వన్డేలు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 17, ఛేజింగ్‌కు దిగిన జట్లు 15 మ్యాచుల్లో గెలిచాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 237 మాత్రమే. అయితే పిచ్ క్యూరేటర్ మాత్రం ఇక్కడ 300 ప్లస్ స్కోరు నమోదవుతుందని అంటున్నారు. ఛేజింగ్ చేయడం ఈసారి కష్టంగా మారుతుందని చెబుతున్నారు. దీన్ని బట్టి టాస్ నెగ్గిన టీమ్ తొలుత బ్యాటింగ్‌కు దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
పిచ్ క్యూరేటర్ మాటలకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్న తీరుకు మాత్రం పొంతన కనిపించడం లేదు. ఎందుకుంటే శుక్రవారం నిర్వహించిన ఆప్షనల్ ప్రాక్టీస్‌లో భారత కోచింగ్ బృందంతో కలసి హిట్‌మ్యాన్ స్లిప్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ స్టంప్స్‌కు దగ్గరగా రోహిత్‌తో క్యాచులు ప్రాక్టీస్ చేయించాడు. దీన్ని బట్టి వికెట్ స్లోగా ఉంటుందని, పిచ్‌ను టర్నింగ్ ట్రాక్‌గా తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారత్ మరోమారు స్పిన్ అస్త్రాన్ని బయటకు తీసే ఛాన్స్ ఉంది. జడేజా, కుల్దీప్లకు తోడుగా అశ్విన్‌ను టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. ఆసీస్ జట్టులో లెఫ్టాండర్లు ఎక్కువగా ఉన్నందున అశ్విన్‌ను ఆడించి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే విన్నింగ్ టీమ్‌ను కంటిన్యూ చేస్తూ వస్తున్న రోహిత్-ద్రవిడ్‌లు టాప్ స్పిన్నర్‌ను ఆడిస్తారో లేదో చూడాలి. మరి.. భారత్ స్పిన్ వ్యూహంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కమిన్స్‌కు లక్కీ సెంటిమెంట్.. ధోని తరహాలో కలిసొస్తే భారత్‌కే కష్టం!
Rohit Sharma standing at slips, close to the stumps, with T Dilip giving him some catching practice at Motera. Guess it’s going to be a slowish, turning track for the final with Rohit prepping himself up for the India. spinners at the slips. #WorldcupFinal pic.twitter.com/DI1duTvxjc
— Rahul Rawat (@rawatrahul9) November 17, 2023