ఆస్ట్రేలియా కెప్టెన్ పాన్ కమిన్స్ ఒక లక్కీ సెంటిమెంట్‌ను నమ్ముకున్నాడు. టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ తరహాలోనే ఆ సెంటిమెంట్ తనకూ కలిసి రావాలని అనుకుంటున్నాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాన్ కమిన్స్ ఒక లక్కీ సెంటిమెంట్‌ను నమ్ముకున్నాడు. టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ తరహాలోనే ఆ సెంటిమెంట్ తనకూ కలిసి రావాలని అనుకుంటున్నాడు.
వన్డే వరల్డ్ కప్-2023 ట్రోఫీకి భారత జట్టు మరో అడుగు దూరంలో ఉంది. ఓటమి అనేది లేకుండా మెగా టోర్నీ ఫైనల్‌కు చేరుకున్న రోహిత్ సేనకు, ప్రపంచ కప్ టైటిల్‌కు మధ్య ఆస్ట్రేలియా అనే ఓ డేంజర్ టీమ్ ఉంది. ఈ గండాన్ని దాటితే 12 ఏళ్లుగా అందకుండా ఊరిస్తున్న వరల్డ్ కప్ ట్రోఫీ మన ఒడిలోకి చేరుతుంది. ఇందుకోసం తమ బెస్ట్ ఇవ్వాలని, ఎలాగైనా దేశానికి మరో కప్పు అందించాలని టీమిండియా ఆటగాళ్లు అనుకుంటున్నారు. 140 కోట్ల మంది ఇండియన్స్ కల నెరవేర్చాలని వాళ్లు అహర్నిషలు శ్రమిస్తున్నారు. కంగారూ టీమ్‌ను కంగారెత్తించి టైటిల్ ఎగరేసుకుపోవాలని భావిస్తున్నారు.
గత రికార్డుల దృష్ట్యా చూస్తే ఆసీస్‌ను ఓడించడం అంత తేలిక కాదనే చెప్పాలి. టీమ్‌లో స్టార్లు ప్లేయర్లు ఉన్నా, లేకపోయినా.. ఫామ్ ఎలా ఉన్నప్పటికీ ప్రతి ప్రపంచ కప్‌లో కనీసం సెమీస్‌కు చేరడం ఆస్ట్రేలియాకు ఆనవాయితీగా మారింది. అయితే ఆ టీమ్‌ను 2011 వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్లోనే ఓడించింది టీమిండియా. ఆ ఏడాది మనమే కప్పు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే 2003 ఫైనల్‌కు మాత్రం భారతీయులు ఎవరూ మర్చిపోలేరు. వరుస గెలుపులతో ఫైనల్‌కు చేరిన గంగూలీ సేనను పాంటింగ్ టీమ్ వన్‌సైడ్‌గా ఓడించింది. దీంతో 20 ఏళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు అందరూ బలంగా కోరుకుంటున్నారు.
గత రికార్డులన్నీ ఆస్ట్రేలియాకు ఫేవర్‌గా ఉన్నాయి. కానీ ఫామ్ విషయంలో మాత్రం టీమిండియా సూపర్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఆసియా కప్-2023 దగ్గర నుంచి మొదలుపెడితే ఆ తర్వాత ఆసీస్‌తో వన్డే సిరీస్, అలాగే ఈ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు వరకు రోహిత్ సేన జైత్రయాత్రకు అడ్డే లేకుండా పోయింది. వరుస విజయాలు సాధిస్తూ, అడ్డొచ్చిన ప్రతి అపోజిషన్ టీమ్‌ను చిత్తు కింద ఓడిస్తూ బ్రేకుల్లేని బుల్డోజర్గా దూసుకెళ్తోంది టీమిండియా. బ్యాటింగ్‌లో టాప్ నుంచి మిడిలార్డర్ వరకు, బౌలింగ్‌లో పేసర్ల నుంచి స్పిన్నర్ దాకా అందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటిదాకా ఆడుతూ వస్తున్న గేమ్‌ను కంటిన్యూ చేస్తే ముచ్చటగా మూడో వరల్డ్ కప్‌ను భారత్ సొంతం చేసుకోవడం ఖాయం.
ఇక, మెగా టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా టీమ్ ఆ తర్వాత పుంజుకొని వరుసగా విక్టరీలు సాధిస్తూ ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో 2003 ఫైనల్‌ను మరోమారు రిపీట్ చేసి రోహిత్ సేనకు షాక్ ఇవ్వాలని కంగారూ టీమ్ అనుకుంటోంది. అయితే ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం భారత లెజెండ్ ఎంఎస్ ధోనీనే నమ్ముకుంటున్నాడు. మాహీ సెంటిమెంట్ రిపీటైతే ఈ వరల్డ్ కప్ తమదేనని అతడు అనుకుంటున్నాడు. అసలా సెంటిమెంట్ ఏంటంటే.. గత నాలుగు వరల్డ్ కప్స్ గెలిచిన టీమ్స్ కెప్టెన్స్ అందరూ కప్పు గెలవడానికి ముందు ఏడాది పెళ్లి చేసుకున్నారు.
రికీ పాంటింగ్ 2002లో మ్యారేజ్ చేసుకోగా.. తర్వాతి సంవత్సరం ఆసీస్ వరల్డ్ కప్ నెగ్గింది. 2010లో ధోని ఓ ఇంటివాడు కాగా.. ఆ నెక్స్ట్ ఇయరే అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ కప్ మన ఒడిలో వచ్చి చేరింది. 2018లో పెళ్లి చేసుకున్న ఇయాన్ మోర్గాన్.. ఆ తర్వాతి ఏడాదే ఇంగ్లండ్‌కు ఫస్ట్ వరల్డ్ కప్ అందించాడు. ఈ నేపథ్యంలో 2022లో తనకు వివాహం అయినందున ఈ ఏడాది తమ జట్టు ప్రపంచ కప్ నెగ్గుతుందని కమిన్స్ భావిస్తున్నాడు. గత కెప్టెన్లకు అచ్చొచ్చిన సెంటిమెంట్ తన విషయంలోనూ రిపీట్ అవ్వాలని అతను కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇది రిపీటైతే భారత్‌కు కష్టం అవుతుందని అనుకుంటున్నాడు. మరి.. కమిన్స్ సెంటిమెంట్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ట్రాన్స్ జెండర్స్ ప్రత్యేక పూజలు! వీడియో వైరల్..