iDreamPost
android-app
ios-app

ఫైనల్లో ఇండియా ఓటమికి కారణం.. ప్యాట్‌ కమిన్స్‌ పెళ్లి! సెంటిమెంట్‌ నిజమైంది

  • Author singhj Published - 12:28 PM, Mon - 20 November 23

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెళ్లికి ఓ లింక్ ఉంది. కమిన్స్ నమ్ముకున్న సెంటిమెంట్ నిజమై కంగారూ టీమ్ కప్పు గెలిచింది.

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెళ్లికి ఓ లింక్ ఉంది. కమిన్స్ నమ్ముకున్న సెంటిమెంట్ నిజమై కంగారూ టీమ్ కప్పు గెలిచింది.

  • Author singhj Published - 12:28 PM, Mon - 20 November 23
ఫైనల్లో ఇండియా ఓటమికి కారణం.. ప్యాట్‌ కమిన్స్‌ పెళ్లి! సెంటిమెంట్‌ నిజమైంది

20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సీన్ రిపీట్. 2003లో జరిగిన ఓటమినే ఇంకా కళ్ల ముందు కదలాడుతుంటే.. ఇప్పుడు మరోమారు అదే పునరావృతమైంది. అప్పటి ఫైనల్ ఫైట్​లో భారత్​ను ఓడించిన ఆస్ట్రేలియా మరోమారు మనల్ని దెబ్బతీసింది. సొంతగడ్డపై 1.3 లక్షల మంది సపోర్ట్ మధ్య చెలరేగి టీమిండియా ఆడుతుందని అనుకుంటే.. కంగారూల డామినేషన్​ ముందు తలవంచింది. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి కమిన్స్ సేన టైటిల్ ఫైట్​లో 6 వికెట్ల తేడాతో రోహిత్ సేనను ఓడించింది. మొదట హిట్​మ్యాన్ ఇచ్చిన క్యాచ్​ను వెనక్కి పరిగెడుతూ పట్టి భారత్​ను దెబ్బతీసిన ట్రావిస్ హెడ్.. ఆ తర్వాత బ్యాట్​తోనూ చెలరేగి సెంచరీ చేసి కప్పును కొట్టేశాడు.

ఈ మ్యాచ్​లో భారత్ ఆటతీరుతో చూస్తే తిరుగులేని గేమ్​తో ఫైనల్​కు వచ్చిన టీమ్ ఇదేనా అనే ఫీలింగ్ ఫ్యాన్స్​కు కలిగింది. బ్యాటింగ్​లో అంత భయమెందుకో? బౌలింగ్​లో ఆ పదును ఎక్కడికి వెళ్లిందో అర్థం కాలేదు. కొన్ని ఓవర్లు తప్ప స్టేడియంలో ఉన్న లక్షా ముప్పై వేల మందితో కిక్కిరిసిన స్టేడియంలో ఆద్యంతం నిశ్శబ్దమే. మెగా టోర్నీ మొదలైనప్పటి నుంచి ఎంతో అద్భుతంగా ఆడుతూ వచ్చిన భారత్​కు నిరాశే మిగిలింది. తుది మెట్టుపై బోల్తాపడిన రోహిత్ సేన.. ముచ్చటగా మూడో వరల్డ్ కప్​ను అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. కోట్లాది మంది ఫ్యాన్స్ హార్ట్​ను బ్రేక్ చేసిన ఇండియా.. మరింత పోరాడితే బాగుండేదని అంటున్నారు. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ ఫియర్​లెస్ యాటిట్యూడ్​ను చూపించాల్సిందని చెబుతున్నారు.

టీమిండియా  తమ అభిమానుల్ని నిరాశపరిస్తే.. ఆస్ట్రేలియా మాత్రం ఎక్స్​పెక్ట్ చేసిన దాని కంటే అద్భుతంగా ఆడింది. బ్యాటింగ్​కు సహకరిస్తున్న పిచ్​పై టాస్ నెగ్గి కావాలనే బౌలింగ్ ఎంచుకున్నాడు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ట్రికీ పిచ్ కాబట్టి మిడిల్ ఓవర్లలో స్పిన్, రివర్స్ స్వింగ్​కు అనుకూలించే ఛాన్స్ ఉందని పసిగట్టాడు కమిన్స్. సెకండ్ ఇన్నింగ్స్​లో తేమ (డ్యూ) పడితే భారత్ స్పిన్ అటాక్​ను ఈజీగా ఫేస్ చేయొచ్చు. బాల్ రివర్స్ స్వింగ్ కూడా అవ్వదని గ్రహించాడు. అందుకే రోహిత్ సేనను బ్యాటింగ్​కు ఆహ్వానించి ప్రతి బ్యాటర్​కు అనుకున్న ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేసి తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. బ్యాటింగ్​లో 3 వికెట్లు త్వరగానే పడ్డా.. లబుషేన్​తో కలసి హెడ్ అద్భుతంగా ఆడి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు.

కోచింగ్ స్టాఫ్​తో కలసి వేసిన ప్లాన్స్​ను గ్రౌండ్​లో బాగా ఎగ్జిక్యూట్ చేశాడు కమిన్స్. అందుకే ఆ టీమ్ భారత్​కు షాకిచ్చి ఆరోసారి వరల్డ్ కప్​ను ముద్దాడింది. అయితే ఈ మ్యాచ్​లో కమిన్స్​కు పెళ్లి సెంటిమెంట్ కలిసొచ్చింది. గత ప్రపంచ కప్​లు నెగ్గిన రికీ పాంటింగ్, ఎంఎస్ ధోని, ఇయాన్ మోర్గాన్​లు మెగా టోర్నీకి సరిగ్గా ఏడాది ముందు మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాతి ఏడాది జరిగిన వరల్డ్ కప్​లో ఛాంపియన్స్​గా నిలిచారు. కమిన్స్ కూడా ఈ సెంటిమెంట్ తనకు కలసి రావాలని కోరుకున్నాడు. అతడి వివాహం 2022లో జరిగింది. ఈ సెంటిమెంట్​పై ఆసీస్ కెప్టెన్ పెట్టుకున్న ఆశలు వమ్ము కాలేదు. అతడు కోరుకున్నట్లుగానే కంగారూలు కప్పు గెలిచారు. దీంతో ఈ సెంటిమెంట్ నిజమైందని.. కమిన్స్ పెళ్లే భారత్ ఓటమికి కారణమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి.. కమిన్స్ మ్యారేజ్ సెంటిమెంట్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఓటమిలోనూ స్పిరిట్‌ కొనసాగించిన టీమిండియా! అతనికే బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డ్‌